3 రోజుల్లో 100 కోట్లు

Sunday,October 01,2017 - 03:15 by Z_CLU

సూపర్ హిట్ టాక్ తో దూసుకుపోతున్న స్పైడర్ సినిమా మరో అరుదైన రికార్డు సృష్టించింది. జస్ట్ 3 రోజుల్లో వంద కోట్ల రూపాయల గ్రాస్ సాధించి టాలీవుడ్ లో సరికొత్త రికార్డు సృష్టించింది. ఈ వసూళ్లతో మహేష్ స్టామినా ఏంటో మరోసారి ప్రూవ్ అయింది. అన్ని భాషలతో కలుపుకొని ప్రపంచవ్యాప్తంగా వంద కోట్ల రూపాయల గ్రాస్ సాధించినట్టు మేకర్స్ ప్రకటించారు.

మహేష్-మురుగదాస్ క్రేజీ కాంబినేషన్ లో తెరకెక్కింది స్పైడర్ సినిమా. 120 కోట్ల రూపాయల భారీ బడ్జెట్ తో దాదాపు 190 రోజుల పాటు షూటింగ్ జరుపుకున్న ఈ సినిమా టెక్నికల్ గా రిచ్ గా తెరకెక్కింది. ఈ సినిమా కోసం మహేష్ చాలా కష్టపడ్డాడు. దాదాపు 70 రోజుల పాటు నైట్ షిఫ్టుల్లో వర్క్ చేశాడు. మోకాలికి తీవ్ర గాయమైనప్పటికీ లెక్క చేయకుండా పనిచేశాడు.

ఏపీ, నైజాంలో భారీ వసూళ్లతో దూసుకుపోతున్న స్పైడర్ సినిమాకు తమిళనాడు, కేరళ రాష్ట్రాల నుంచి కూడా మంచి రెస్పాన్స్ వస్తోంది. హరీష్ జైరాజ్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్, పీటర్ హెయిన్స్ యాక్షన్ సన్నివేశాలు అందర్నీ ఎట్రాక్ట్ చేస్తున్నాయి.