`శివ‌లింగ` ట్రైల‌ర్‌కు 10 ల‌క్ష‌ల వ్యూస్‌

Friday,February 03,2017 - 05:16 by Z_CLU

రాఘవ లారెన్స్ న‌టించిన లేటెస్ట్ ఫిలిం ‘శివ‌లింగ’ ట్రైలర్ సోషల్ మీడియాలో హల్చల్ చేస్తుంది. ఇటీవలే రిలీజ్ అయిన ఈ ట్రైలర్ యూట్యూబ్‌లో రికార్డు స్థాయిలో వ్యూస్ సాధించింది. కన్నడ లో శివ రాజ్ కుమార్ నటించిన సినిమాకు రీమేక్ గా తమిళ్, తెలుగు లో తెరకెక్కించారు దర్శకుడు పి.వాసు.

హార్రర్ ఎంటర్ టైనర్ గా రూపొందిన ఈ సినిమా ట్రైలర్ యూట్యూబ్‌లో 10 ల‌క్ష‌ల వ్యూస్ సాధించి సినిమా పై భారీ అంచనాలు నెలకొల్పింది. రాఘవ లారెన్స్ సరసన రితికా సింగ్ క‌థానాయిక‌గా నటించిన ఈ సినిమా ప్రెజెంట్ పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ జరుపుకుంటుంది. ఈ నెలాఖరున సినిమాను రిలీజ్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు నిర్మాతలు.