సప్తగిరి ఇంటర్వ్యూ

Wednesday,December 06,2017 - 03:45 by Z_CLU

సప్తగిరి హీరోగా నటించిన సప్తగిరి ఎక్స్ ప్రెస్ డిసెంబర్ 7 న రిలీజ్ కి రెడీ అవుతుంది. హిందీ సూపర్ హిట్ మూవీ Jolly LLB కి రీమేక్ గా తెరకెక్కిన ఈ మూవీ గురించి ఇంట్రెస్టింగ్ విషయాలు షేర్ చేసుకున్నాడు సప్తగిరి. ఆ విషయాలు మీ కోసం….

కామన్ మ్యాన్ రెప్రెజెంట్ అవుతాడు…

సప్తగిరి ఎక్స్ ప్రెస్ ఒక నిజాయితీ గల కానిస్టేబుల్ కథైతే ఈ సినిమాలో ఒక కామన్ మ్యాన్ ని రిప్రెజెంట్ చేశాం. హిందీలో సూపర్ హిట్టయిన Jolly LLB సినిమాని మెయిన్ థీమ్ చెడకుండా, మన నేటివిటీకి తగ్గట్టు మార్చి, చేసిన సినిమా.  సప్తగిరి ఎక్స్ ప్రెస్ తరవాత మళ్ళీ అదే కాంబినేషన్ లో వస్తున్న ఈ సినిమా అందరికీ తప్పకుండా నచ్చుతుంది.

మనసుకు హత్తుకునే సినిమా…

మన దేశంలో పుట్టిన ఏ పౌరుడికైనా ధనిక, పేద, చిన్న, పెద్దా అని తేడా అందరికీ న్యాయం విషయమో సమాన హక్కు ఉంటుంది. ఆ పాయిట్ పైనే ఈ సినిమా ఉంటుంది. మనసుకు హత్తుకునే సన్నివేశాలతో సినిమా చాలా బాగా వచ్చింది…

 

నిజాయితీ గల సినిమా…

రీమేక్ చేయాలనే నిర్ణయం నా ఒక్కడిది కాదు… ఒక నిజాయితీ ఉన్న సినిమా చేయాలనుకున్నాం. మంచి ప్రొడక్షన్ వ్యాల్యూస్ ఉన్న సినిమా చేయాలనుకున్నాం.. అప్పుడు ఈ సినిమా చేయాలనుకున్నాం… నిజాయితీ గల లాయర్లకు ఈ సినిమా అంకితం చేశాం…

కామెడీ ఉంటుంది కానీ…

ఈ సినిమా కథే భావోగ్వేదాలతో కూడిన సినిమా, సినిమా మొత్తంలో కథ ముందు కు వెళ్తున్న కొద్దీ చాలా ఇమోషన్స్ ఉంటాయి. మధ్య మధ్యంలో నా మార్క్ కామెడీ ఉంటుంది.

నా రేంజ్ లో ఉంటుంది…

నా రేంజ్ నటుడికి ఏది సూట్ అవుతుందో అదే చేశాం, డైలాగ్స్ దగ్గరి నుండి ప్రతీది చాలా జాగ్రత్తగా రాయించుకున్నాం. ఇప్పటి వరకు 70 కి పైగా సినిమాలు చేసిన  నాకు ఏదో డిఫెరెంట్ గా చేయాలి అని ఉంటుంది.. ఆ డిఫెరెన్స్ ఈ సినిమాలో మీరు చూస్తారు…

చరణ్ కరెక్ట్ అని ముందే అనుకున్నా…

తక్కువ టైమ్ లో అనుకున్న బడ్జెట్ లో సినిమా కంప్లీట్ కావాలంటే డైరెక్టర్ మంచి ఎక్స్ పీరియన్స్ ఉన్నవాడై ఉండాలి. చరణ్ ఇప్పటి వరకు చాలా సినిమాలకు కో డైరెక్టర్ గా చేశాడు. సినిమా ఇండస్ట్రీలో 25 ఏళ్ల ఎక్స్ పీరియన్స్ ఉన్న ఆయనైతేనే ఈ సినిమాకి కరెక్ట్ అనిపించి ఈ సినిమాని ఆయనకు అప్పగించాం….

మీరే చెప్పాలి..

కరియర్ లో ఫస్ట్ టైమ్ ఈ సినిమాలో డ్యాన్స్ చేశాను. మాస్టర్స్ ని పెట్టుకున్నాను చాలా ప్రాక్టీస్ చేశాను.. ఇక నేను డ్యాన్స్ ఎలా చేశాను అన్నది సినిమా చూశాక మీరే చెప్పాలి…

 

 

థ్రిల్లింగ్ ఎలిమెంట్

ఒక చెట్టు కింద  ప్లీడర్ లాంటి చిన్న లాయర్ సింహం లాంటి లాయర్ ని ఎలా ఢీ కొట్టాడు… ఒక్కో స్థాయిలో ఎలా ఎదిగాడు అనేది సినిమాలో థ్రిల్లింగ్ ఎలిమెంట్.

కమర్షియల్ చేంజెస్ చేశాం…

హిందీ సినిమాతో పోలిస్తే ఈ సినిమాలో హీరోయిజం కొంచెం ఎక్కువగా ఉంటుంది. హిందీ మూవీలో చాలా వరకు న్యాచురల్ గా ఉంటుంది. ఈ సినిమా వరకొస్తే కమర్షియల్ గా వర్కవుట్ అయ్యేలా డిజైన్ చేసుకున్నాం, అలాగే తెరకెక్కించుకున్నాం….

ఇది ముగ్గురి సినిమా…

సాయి కుమార్ గారు, శివ ప్రసాద్ , నేను…. ఇది ముగ్గురి సినిమా… సినిమాలో ఈ మూడు అద్భుతమైన క్యారెక్టర్స్….