నటీ నటులు : కళ్యాణ్ దేవ్, మాళవిక తదితరులు.
సినిమాటోగ్రఫీ: కేకే సెంథిల్ కుమార్
సంగీతం : హర్షవర్ధన్ రామేశ్వర్
ఎడిటింగ్ : కార్తిక శ్రీనివాస్
లిరిక్స్ : రెహమాన్, రామజోగయ్యశాస్త్రి
ఆర్ట్ డైరెక్టర్ : రామకృష్ణ
సమర్పణ : సాయి శివాణి
నిర్మాత : రజినీ కొర్రపాటి (సాయి కొర్రపాటి ప్రొడక్షన్)
కథ, స్క్రీన్ ప్లే, దర్శకుడు : రాకేశ్ శశి
మెగాస్టార్ చిరంజీవి చిన్నల్లుడు కళ్యాణ్ దేవ్ హీరోగా పరిచయం అవుతున్న తొలి సినిమా ‘విజేత’ . 1985లో చిరంజీవి నటించిన బ్లాక్ బస్టర్ సినిమా టైటిల్ ఇది. లైటింగ్ అప్ స్మైల్స్ ఆన్ అదర్స్ ఫేసెస్ ఈజ్ ఆల్సో ఎ సక్సెస్ అనేది ట్యాగ్ లైన్. అంటే ఇతరుల మొహాల్లో వెలుగు చూడటం కూడా విజయమే అని అర్థం. అందుకే కథకు తగ్గట్లుగా ఈ చిత్రానికి విజేత అనే టైటిల్ పెట్టారు. సాయి కొర్రపాటి వారాహి సంస్థలో రజినీ కొర్రపాటి నిర్మాతగా విజేత వస్తుంది. రాకేశ్ శశి ఈ చిత్రానికి దర్శకుడు. మాళవిక నయ్యర్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ చిత్రానికి హర్షవర్ధన్ రామేశ్వర్ సంగీతం అందిస్తున్నాడు. బాహుబలి ఫేమ్ సెంథిల్ కుమార్ ఈ చిత్రానికి సినిమాటోగ్రఫీ అందిస్తుండటం విశేషం. త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది ఈ విజేత.ఈ చిత్రంలో కళ్యాణ్ దేవ్ తో పాటు మాళవిక నయ్యర్, నాజర్, తణికెళ్ళ భరణి, మురళిశర్మ, సత్యం రాజేష్, ప్రగతి, కళ్యాణి నటరాజన్, పోసాని, రాజీవ్ కనకాల, జయప్రకాశ్(తమిళ్), ఆదర్శ్ బాలకృష్ణ, నియోల్ సీన్, కిరీటి, భద్రం, సుదర్శన్ తదితరులు ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు.