వీర‌భోగ వ‌సంత‌రాయులు

Monday,September 24,2018 - 05:21 by Z_CLU

నటీనటులు : నారా రోహిత్, శ్రీవిష్ణు, సుధీర్ బాబు,శ్రీయ సరన్, మనోజ్ నందన్

సంగీతం : మార్క్ కే రాబిన్

డిఓపి : ఎస్ వెంక‌ట్, న‌వీన్ యాద‌వ్

ఎడిట‌ర్: శ‌శాంక‌ర్ మాలి

ఆర్ట్ డైరెక్ట‌ర్: శ్రీ‌కాంత్ రామిశెట్టి

నిర్మాత‌: అప్పారావ్ బెల్లానా

ద‌ర్శ‌కుడు: ఇంద్ర‌సేన ఆర్

 

వీర‌భోగ వ‌సంత రాయులు విడుద‌ల తేదీ క‌న్ఫ‌ర్మ్ అయిపోయింది. అక్టోబ‌ర్ 5న ఈ చిత్రాన్ని విడుద‌ల చేయ‌నున్నారు. నారా రోహిత్, సుధీర్ బాబు, శ్రీ‌య స‌ర‌న్, శ్రీ‌విష్ణు ముఖ్య‌పాత్ర‌ల్లో న‌టించిన ఈ చిత్రాన్ని ఇంద్ర‌సేన తెర‌కెక్కించాడు. క్రైమ్ థ్రిల్ల‌ర్ గా తెర‌కెక్కుతోన్న ఈ చిత్ర ఫ‌స్ట్ లుక్ ఇప్ప‌టికే విడుద‌లైంది. దీనికి ప్రేక్ష‌కుల నుంచి అద్భుత‌మైన స్పంద‌న వ‌చ్చింది. పూర్తిగా కొత్త కాన్సెప్ట్ తో తెర‌కెక్కిన ఈ చిత్ర షూటింగ్ చివ‌రిద‌శకు వ‌చ్చింది. ఆస‌క్తిక‌ర‌మైన టైటిల్ తో పాటు సినిమాలో క‌థ కూడా అంతే ఆస‌క్తిక‌రంగా ఉండ‌బోతుంది. కొత్త మ‌తం పుట్టుకొస్తుంది అనే ట్యాగ్ లైన్ తో ఈ చిత్రం వ‌స్తుంది. ఇప్ప‌టికే విడుద‌ల తేదీ ప్ర‌క‌టించిన ద‌ర్శ‌క నిర్మాత‌లు.. త్వ‌ర‌లోనే ఆడియో విడుద‌ల తేదీని కూడా అనౌన్స్ చేయ‌నున్నారు. త్వ‌ర‌లోనే ఈ తేదీ అఫీషియ‌ల్ గా ప్ర‌క‌టించనున్నారు. బాబా క్రియేష‌న్స్ బ్యాన‌ర్ పై అప్పారావ్ బెల్లానా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. మార్క్ కే రాబిన్ సంగీతం అందిస్తుండ‌గా.. ఎస్ వెంక‌ట్, న‌వీన్ యాద‌వ్ సినిమాటోగ్ర‌ఫీ అందిస్తున్నారు.

Release Date : 20181026