టిక్ టిక్ టిక్

Wednesday,June 20,2018 - 01:23 by Z_CLU

జ‌యం ర‌వి, నివేదా పేతురాజ్ హీరో హీరోయిన్లుగా చ‌ద‌ల‌వాడ బ్ర‌ద‌ర్స్ స‌మ‌ర్ప‌ణ‌లో  శ్రీ తిరుమ‌ల తిరుప‌తి వెంక‌టేశ్వ‌ర ఫిలింస్ బ్యాన‌ర్‌పై శ‌క్తి సౌంద‌ర్ రాజ‌న్ ద‌ర్శ‌క‌త్వంలో ప‌ద్మావ‌తి చ‌ద‌ల‌వాడ నిర్మాతగా వ‌స్తోన్న   చిత్రం `టిక్ టిక్ టిక్‌`. ఇండియ‌న్ సినిమా చ‌రిత్రంలో తొలి అంత‌రిక్ష సినిమాగా ఈ సినిమా తెరకెక్క‌డం విశేషం.త్వ‌ర‌లోనే సినిమా తెలుగులో విడుద‌ల చేస్తున్నారు.

ల‌క్ష్మ‌ణ్ మాట్లాడుతూ – “తెలుగులో ఈ సినిమాను మా బ్యాన‌ర్‌లో విడుద‌ల చేస్తున్నందుకు ఆనందంగా ఉంది. క్వాలిటీ విష‌యంలో ఎక్క‌డా కాంప్ర‌మైజ్ కాలేదు. `బిచ్చ‌గాడు` సినిమాను తెలుగులో విడుద‌ల చేసిన‌ప్పుడు ఇక్క‌డ ప్రేక్ష‌కులు ఎంత‌గానో మ‌మ్మ‌ల్ని ఆద‌రించారు. త‌ర్వాత మా బ్యాన‌ర్‌లో చేసిన థ్రిల్ల‌ర్ మూవీ `16`ని కూడా ఆద‌రించారు. అలాంటి విల‌క్ష‌ణ‌మైన స‌బ్జెక్ట్ ఇది. ఇండియ‌న్ సినిమాలో తొలి స్పేస్ మూవీని  ప్రేక్ష‌కుల‌కు అందిస్తున్నందుకు గ‌ర్వంగా ఉంది. అల్రెడి విడుద‌లైన టీజ‌ర్‌కు మంచి స్పంద‌న వ‌చ్చింది. ఇప్పుడు ట్రైల‌ర్‌ను, సినిమాను ఆద‌రిస్తార‌ని న‌మ్మ‌కంగా ఉన్నాం. జూన్ 22 న సినిమాను విడుద‌ల చేస్తున్నాం“ అన్నారు.

జ‌యం ర‌వి, నివేదా పేతురాజ్, జ‌య‌ప్ర‌కాష్ త‌దిత‌రులు న‌టించిన ఈ చిత్రానికి సంగీతం:  డి.ఇమ్మాన్‌, కెమెరా :  వెంక‌టేష్‌, ఎడిట‌ర్:  ప్ర‌దీప్‌, ఆర్ట్:  మూర్తి, నిర్మాత : ప‌ద్మావ‌తి చ‌ద‌ల‌వాడ‌, ద‌ర్శ‌క‌త్వం : శ‌క్తి సౌంద‌ర్ రాజ‌న్‌.

Release Date : 20180622