స్పెషల్

Tuesday,June 18,2019 - 11:50 by Z_CLU

విలన్ గా సహనటుడిగా తనకంటూ ఒక మంచి గుర్తింపు తెచ్చుకున్న నటుడు అజయ్. అప్పుడప్పుడు సినిమాల్లో కథానాయకుడి పాత్రలు కూడా చేస్తున్నారు. మైండ్ రీడర్ లవ్ రివెంజ్ స్టోరీ కాన్సెప్ట్ తో వస్తోన్న స్పెషల్ అనే సినిమాలో అజయ్ పోలీస్ ఆఫీసర్ గా కనిపించనున్నాడు. ప్రేమించిన అమ్మాయి మోసం చేయడానికి కారణమైన వారిని తెలుసుకొని మైండ్ రీడర్ వారిని ఎలా అంతం చేశాడు అనేది సినిమా కథ అని దర్శకుడు వాస్తవ్ తెలిపారు.

అజయ్… గతంలో ఒకటి రెండు సినిమాల్లో హీరోగానూ కనిపించినప్పటికీ పెద్దగా ఆకట్టుకోలేకపోయారు. తాజాగా ఆయన ‘స్పెషల్‘ సినిమాతో మరోమారు ప్రేక్షకుల ముందుకు హీరోగా రానున్నారు. అజయ్ పోలీస్ ఆఫీసర్‌గా కనిపిస్తున్న ఈ సినిమాకి వాత్సవ్ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రం అన్ని కార్య‌క్ర‌మాలు పూర్తి చేసుకుని 21 ప్రేక్ష‌కుల ముందుకు రానుంది

నటీనటులు

అజయ్, రంగ, అక్షత, సంతోష, అశోక్ కుమార్, బిహెచ్ఈఎల్ ప్రసాద్, జబర్దస్త్ అప్పారావ్, ప్రకాష్, మహేష్, చక్రపాణి, కమలేష్, వర్షిత్, బిహెచ్ఈఎల్ సునీల్, గౌతమ్ తదితరులు

సాంకేతిక వర్గం
బ్యానర్ – నందలాల్ క్రియేషన్స్

నిర్మాత – నందమ్ శ్రీ వాస్తవ్

డైరెక్టర్ – వాస్తవ్

మ్యూజిక్ డైరెక్టర్ – ఎన్వీఎస్ మన్యం

ఫొటోగ్రఫీ – బి అమర్ కుమార్

ఎడిటింగ్ – ఎస్ బి ఉద్దవ్

ప్రొడక్షన్ కంట్రోలర్ – బిఎస్ నాగిరెడ్డి

కో డైరెక్టర్ – ప్రణీత్ వర్మ

సౌండ్ రికార్డింగ్ – సాగర్ స్టూడియోస్

సిజి అండ్ డీఐ – క్రిష్ణ ప్రసాద్

పిఆర్ఓ – ఏలూరు శ్రీను

Release Date : 20190621