శంభో శంకర్

Tuesday,June 26,2018 - 02:36 by Z_CLU

క‌మెడియ‌న్ ట‌ర్న్‌డ్ హీరోలుగా రాణిస్తున్న ఈ టైమ్‌లో ష‌క‌ల‌క శంక‌ర్ హీరోగా అదృష్టం ప‌రీక్షించుకుంటున్న సంగ‌తి తెలిసిందే. శంక‌ర్ న‌టించిన‌ `శంభో శంక‌ర‌` ట్రైల‌ర్‌, పోస్ట‌ర్ల‌కు అద్భుత స్పంద‌న వ‌చ్చింది. ష‌క‌ల‌క శంక‌ర్‌ని హీరోగా,  శ్రీధ‌ర్‌ను ద‌ర్శ‌కుడిగా ప‌రిచ‌యం చేస్తూ ఆర్. ఆర్. పిక్చ‌ర్స్ సంస్థ, ఎస్.కె. పిక్చ‌ర్స్ స‌మ‌ర్ప‌ణ‌లో వై. ర‌మ‌ణారెడ్డి, సురేష్ కొండేటి సంయుక్తంగా నిర్మిస్తున్నారు.

షకలక శంక‌ర్, కారుణ్య  నాగినీడు, అజ‌య్ ఘోష్, ర‌వి ప్రకాష్, ప్ర‌భు, ఏడిద  శ్రీరామ్ త‌దిత‌రులు న‌టించారు. ఈ చిత్రానికి  కెమెరా:  రాజ‌శేఖ‌ర్, సంగీతం:  సాయి కార్తిక్, ఎడిటింగ్:  ఛోటా.కె. ప్ర‌సాద్, నిర్మ‌తలు:  వై. ర‌మ‌ణారెడ్డి, సురేష్ కొండేటి, క‌థ‌, స్ర్కీన్ ప్లే, ద‌ర్శ‌క‌త్వం:  శ్రీధ‌ర్. ఎన్.

Release Date : 20180629