సీత రాముని కోసం

Friday,December 08,2017 - 04:23 by Z_CLU

తెలుగు టీవీ సమర్పణలో శరత్ శ్రీరంగం, కారుణ్య జంటగా నటిస్తున్న చిత్రం సీత..రాముని కోసం. అనిల్ గోపిరెడ్డి సంగీత మరియు దర్శకత్వ బాధ్యతలు  నిర్వర్తిస్తున్నారు.

ఈ మూవీ ఆడియోని మెగా ఫామిలీ వారసురాలు నిహారిక విడుదల చేసారు.  దర్శకుడు మాట్లాడుతూ ‘ నా రెండో సినిమా చిరంజీవి గారి చేతుల మీదుగా ప్రారంభమైంది. ఇప్పుడు ఈ చిత్రం ఆడియో మెగా వారసురాలి చేతుల మీదుగా రిలీజ్ కావడం ఆనందంగా ఉందని అన్నారు. తన మొదటి సినిమా ఆడియో నిహారిక లాంచ్ చేయడం సంతోషంగా ఉందని చిత్ర హీరో శరత్ శ్రీరంగం చెప్పారు. ఈ సీత రాముని కోసం చిత్రానికి మాటలు-వేణు రాచర్ల , ఎడిటింగ్- సాయి తలారి , కెమెరామెన్ – జయపాల్ రెడ్డి , రచన ,సంగీతం,దర్శకత్వం – అనిల్ గోపిరెడ్డి. సెన్సార్ కార్య    క్రమాలు పూర్తిచేసుకుని ఈ నెల్లోనే ఈ చిత్రం విడుదలకి సిద్దమవుతుంది.
Release Date : 20171215