సప్తగిరి ఎల్‌ఎల్‌బి

Friday,December 01,2017 - 03:42 by Z_CLU

కామెడీ కింగ్‌ సప్తగిరి కథానాయకుడిగా ‘సప్తగిరి ఎక్స్‌ప్రెస్‌’ వంటి సూపర్‌హిట్‌ చిత్రాన్ని నిర్మించిన సాయి సెల్యులాయిడ్‌ సినిమాటిక్‌ క్రియేషన్స్‌ ప్రై లిమిటెడ్‌ అధినేత డా.రవికిరణ్‌ మళ్లీ సప్తగిరి హీరోగా ‘సప్తగిరి ఎల్‌ఎల్‌బి’ చిత్రాన్ని నిర్మిస్తున్న విషయం తెలిసిందే. ఈ చిత్రం అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకొని డిసెంబర్‌ 7న వరల్డ్‌వైడ్‌గా రిలీజ్‌కి రెడీ అవుతోంది. విజయ్‌ బుల్గానిన్‌ సంగీత సారధ్యంలో ఈ చిత్రం ఆడియో రూపొందింది.

డిసెంబర్‌ 7న ప్రపంచ వ్యాప్తంగా విడుదలవుతున్న ఈ చిత్రంలో కామెడీ కింగ్‌ సప్తగిరి సరసన కశిష్‌ వోరా హీరోయిన్‌గా నటిస్తున్నారు. ఈ చిత్రానికి మాటలు: పరుచూరి బ్రదర్స్‌, సంగీతం: విజయ్‌ బుల్గానిన్‌, కో-డైరెక్టర్‌: రాజశేఖర్‌రెడ్డి పులిచెర్ల, ఫొటోగ్రఫీ: సారంగం ఎస్‌.ఆర్‌, ఎడిటింగ్‌: గౌతంరాజు, ఆర్ట్‌: అర్జున్‌, పాటలు: చంద్రబోస్‌, కందికొండ, ప్రొడక్షన్‌ ఎగ్జిక్యూటివ్‌: భిక్షపతి తుమ్మల, నిర్మాత: డా. రవికిరణ్‌, దర్శకత్వం: చరణ్‌ లక్కాకుల.

Release Date : 20171207