ర‌క్ష‌క‌భటుడు

Wednesday,May 03,2017 - 12:11 by Z_CLU

నటీ నటులు : రీచా పనై

సినిమాటోగ్రఫి: మల్హర్‌ భట్‌ జోషి

మ్యూజిక్ : శేఖర్ చంద్ర

ఆర్ట్‌: రాజీవ్‌నాయర్‌

ఎడిటింగ్‌: అమర్‌ రెడ్డి

నిర్మాణ, నిర్వహణ: జె. శ్రీనివాసరాజు

ప్రొడ్యూసర్‌: ఎ.గురురాజ్‌

రచన-స్క్రీన్ ప్లే -దర్శకత్వం: వంశీకృష్ణ ఆకెళ్ల.

రిలీజ్ డేట్ : 12 మే ,2017

సుఖీభవ మూవీస్‌ పతాకంపై ఎ. గురురాజ్‌ నిర్మాత‌గా రూపొందుతోన్న ఫాంట‌సీ స‌స్పెన్స్ థ్రిల్ల‌ర్ క‌మ‌ర్షియ‌ల్ ఎంట‌ర్‌టైన‌ర్ `ర‌క్ష‌క‌భటుడు`. రిచాపనై, బ్ర‌హ్మానందం, బాహుబ‌లి ప్ర‌భాక‌ర్‌, బ్ర‌హ్మాజీ, సుప్రీత్‌(కాట్రాజు). అదుర్స్ ర‌ఘు, ధ‌న‌రాజ్‌ ప్రధాన పాత్రల్లో న‌టించారుజ ర‌క్ష‌, జ‌క్క‌న వంటి సూప‌ర్‌హిట్ చిత్రాల త‌ర్వాత వంశీకృష్ణ ఆకెళ్ళ ద‌ర్శ‌క‌త్వంలో రూపొందుతోన్న ఈ చిత్రం సెన్సార్ కార్య‌క్ర‌మాల‌ను పూర్తి చేసుకుని మే ప్ర‌థమార్థంలో విడుద‌ల‌కు సిద్ద‌మైంది. అర‌కులోయ బ్యాక్‌డ్రాప్‌లో సాగే ఈ సినిమా పోలీస్ స్టేష‌న్‌లో ఏం జ‌రిగింది. అస‌లు ఆంజ‌నేయ‌స్వామికి, ర‌క్ష‌క‌భ‌టుడు అనే టైటిల్‌కు ఉన్న రిలేష‌న్ ఏంటి? అనేదాన్ని ఆస‌క్తిక‌రంగా రూపొందించాం. ఎమోష‌న్స్‌, కామెడి, థ్రిల్లింగ్, స‌స్పెన్స్ ఇలా అన్నీ ఎలిమెంట్స్ సినిమాలో ఉంటాయి. ఫ‌స్ట్ సీన్ నుండి క్లైమాక్స్ వ‌ర‌కు సినిమా ఎంట‌ర్‌టైనింగ్‌గా సాగుతుంది. చివ‌రి ప‌దిహేను నిమిషాలు హృద్యయంగా తెర‌కెక్కించాం. సినిమా సెన్సార్ కార్య‌క్ర‌మాల‌ను పూర్తి చేసుకుని `యు/ఎ` స‌ర్టిఫికేట్‌ను పొందింది. సినిమాను మే ప్ర‌థ‌మార్థంలో విడుద‌ల చేయ‌డానికి స‌న్నాహాలు చేస్తున్నాం.

Release Date : 20170512