'పిశాచి-2'

Wednesday,April 19,2017 - 07:54 by Z_CLU

స్వర్ణ భారతి క్రియేషన్స్ పతాకంపై లయన్ సాయి వెంకట్ నిర్మిస్తున్న చిత్రం “పిశాచి-2ష‌. `డేంజర్ జోన్` అన్నది ట్యాగ్ లైన్.  నల్లగట్ల శ్రీనివాస్ రెడ్డి-తిరుక్కోవళ్ళూరి మురళీకృష్ణ సంయుక్తంగా సమర్పిస్తున్న ఈ చిత్రానికి.. లయన్ ఏ.వేణుమాధవ్, కొలను సురేంద్రరెడ్డి, అట్లూరి రామకృష్ణ సహ నిర్మాతలు. ఏప్రిల్ 21న సినిమా విడుద‌ల‌వుతుంది. ఈ సంద‌ర్భంగా  బుధ‌వారం  ఏర్పాటు చేసిన మీడియా స‌మావేశంలో  సాయి వెంక‌ట్ మాట్లాడుతూ, ` క‌న్న‌డ భాష‌లో పెద్ద విజ‌యం సాధించిన చిత్ర‌మిది. ఏ సినిమాలో నైనా విష‌యం ఉంటే హిట్ అవుతుంది. ఈసినిమా కూడా ఆ కోవ‌కు చెందించే. పిశాచి వ‌ల్ల ఓ గ్రామ ప్ర‌జ‌లు ఎదుర్కున్న ఇబ్బందులేంటి?  వాటి నుంచి ఆ దుర్గామాత ఎలా బ‌య‌ట పడేసింది అన్న‌దే క‌థ‌. ప్ర‌తీ స‌న్నివేశం ఆద్యంతం ఆస‌క్తిక‌రంగా ఉంటుంది. 100 థియేట‌ర్ల‌లలో సినిమా విడుద‌ల చేస్తాం. తెలుగు ప్రేక్ష‌కులంతా సినిమా ను ఆద‌రిస్తార‌ని ఆశిస్తున్నా` అని అన్నారు.

Release Date : 20170421