ఒడియన్

Monday,December 10,2018 - 03:57 by Z_CLU

“మ‌న్యంపులి”, “జ‌న‌తాగ్యారేజ్‌”, “క‌నుపాప” లాంటి సూప‌ర్‌హిట్ చిత్రాల‌తో తెల‌గు సిని అభిమానుల్ని ఆక‌ట్టుకున్న మ‌ళ‌యాల మూవీ లెజెండ్ మోహ‌న్‌లాల్ ఇప్పుడు ‘ఒడియ‌న్ గా తెలుగు ప్రేక్ష‌కుల ముందుకు వ‌స్తున్నారు.  ఈ చిత్రం తెలుగు హ‌క్కులు  ద‌క్కించుకున్న‌ ద‌గ్గుపాటి క్రియేష‌న్స్ వారు రెండు తెలుగు రాష్ట్రాల్లో ఈ చిత్రాన్ని ఫ్యాన్సి ఆఫ‌ర్ కి బిజినెస్ చేయ‌టం విశేషం. తెలుగులో రామ్ ద‌గ్గుపాటి, సంప‌త్ కుమార్ లు తెలుగు నిర్మాత‌లు. దర్శకుడు శ్రీ కుమార్ మీనన్ . ఈ చిత్రం మ‌ళ‌యాలంలో  అత్యంత భారీ ప్రెస్టీజియ‌స్ ఫిల్మ్‌గా క్రేజ్ ని సొంతంచేసుకోవ‌ట‌మేకాకుండా అన్ని భాష‌లతో పాటు తెలుగు ట్రేడ్ లో కూడా చాలా మంచి క్రేజ్ రావ‌టం మెహ‌న్‌లాల్ గారి స్టామినా ని తెలియ‌జేస్తుంది. ఒడియ‌న్ చిత్రం తెలుగు టీజ‌ర్ ని విడుద‌ల చేశారు.. చూసిన వారంద‌రికి మెహ‌న్‌లాల్ గారు మ‌రో వినూత్న‌ప్ర‌యోగంతో ఒడియ‌న్ గా వస్తున్నార‌నే విష‌యం తెలుస్తుంది. చాలా ఇంట్ర‌స్టింగ్  యాక్ష‌న్ థ్రిల్ల‌ర్ గా ఈ చిత్రాన్ని ప్రేక్ష‌కుల ముందుకు తీసుకువ‌స్తున్నారు. అన్ని కార్య‌క్ర‌మాలు పూర్తిచేసి ప్ర‌పంచ‌వ్యాప్తంగా డిసెంబ‌ర్ 14న విడుద‌ల చేస్తున్నారు.

Release Date : 20181214