నా నువ్వే

Monday,January 08,2018 - 04:51 by Z_CLU

నటీ నటులు : నందమూరి కళ్యాణ్ రామ్ , తమన్నా తదితరులు

సంగీతం: షరెత్

సినిమాటోగ్రఫీ: పి. సి. శ్రీరామ్

ఎడిటింగ్‌: టి. ఎస్. సురేష్

సమర్పణ : మహేష్ ఎస్ కోనేరు

నిర్మాతలు : కిరణ్ ముప్పవరపు , విజయ్ వట్టికూటి

కథ, స్క్రీన్‌ప్లే – జయేంద్ర, శుభ

దర్శకత్వం:  జయేంద్ర

నందమూరి కళ్యాణ్‌రామ్‌ కథానాయకుడిగా, ప్రఖ్యాత యాడ్ ఫిలిం మేకర్ జయేంద్ర దర్శకత్వంలో రూపొందుతోన్న చిత్రంలో అందాల భామ తమన్నా హీరోయిన్ గా నటిస్తోన్న సంగతి తెలిసిందే. ఈ చిత్రానికి “నా.. నువ్వే”  అనే టైటిల్ ని ఖరారు చేసారు. కూల్ బ్రీజ్ సినిమాస్ నిర్మాణంలో, ఈస్ట్ కోస్ట్ ప్రొడక్షన్స్ సమర్పణలో  ఈ చిత్రం రూపొందింది. ప్రఖ్యాత కెమరామెన్ పి. సి. శ్రీరామ్ ఈ చిత్రానికి అద్భుతమైన ఛాయాగ్రహణాన్ని అందిస్తున్నారు. ఒక టోటల్ ఫ్రెష్ లుక్ లో నందమూరి కళ్యాణ్ రామ్ ఈ చిత్రం లో కనిపిస్తారు. ఈ చిత్రానికి అవార్డు విన్నింగ్ మ్యూజిక్ డైరెక్టర్ షరెత్ సంగీతాన్ని అందిస్తున్నారు.

లవ్, యాక్షన్, ఎంటర్టైన్మెంట్ ప్రధానంగా గా ఉండే ఈ చిత్రం లో, కళ్యాణ్ రామ్, తమన్నా, తనికెళ్ళ భరణి, పోసాని కృష్ణ మురళి, వెన్నెల కిశోర్, ప్రవీణ్, బిత్తిరి సత్తి, ప్రియ, సురేఖ వాణి  ప్రధాన నటులు. ఇతర నటీ నటులు వివరాలు త్వరలో తెలుపుతాము అని యూనిట్ సభ్యులు తెలిపారు.

Release Date : 20180614