ఎం.ఎల్.ఎ

Wednesday,January 17,2018 - 01:26 by Z_CLU

నటీ నటులు : కళ్యాణ్ రామ్, కాజల్ అగర్వాల్, రవి కిషెన్, పోసాని , జయప్రకాశ్ రెడ్డి, అజయ్, వెన్నెల కిశోర్, పృథ్వి, శివాజీ రాజా,ప్రభాస్ శ్రీను, లాస్యా , మనాలి రాథోడ్ తదితరులు

సంగీతం : మణి శర్మ

సినిమాటోగ్రఫీ : ప్రసాద్ మూరెళ్ళ

ఎడిటింగ్‌ : తమ్మిరాజు

సమర్పణ : T.G. విశ్వప్రసాద్

కో ప్రొడ్యూసర్ : వివేక్ కూచిభొట్ల

నిర్మాతలు : C భరత్ చౌదరి, M. V. కిరణ్ రెడ్డి

కథ, స్క్రీన్‌ప్లే, మాటలు, దర్శకత్వం: ఉపేంద్ర మాధవ్.

 

నందమూరి కళ్యాణ్‌రామ్‌ కథానాయకుడిగా,నూతన దర్శకుడు ఉపేంద్ర మాధవ్ దర్శకత్వం లో రూపొందుతోన్న ఫుల్ లెంగ్త్ ఎంటర్‌టైనర్‌ ‘MLA’. “మంచి లక్షణాలు ఉన్న అబ్బాయ్” అనేది కాప్షన్. ఈ చిత్రం లో అందాల భామ కాజల్ హీరోయిన్ గా నటిస్తున్నారు.

T.G. విశ్వప్రసాద్ సమర్పణ లో ,బ్లూ ప్లానెట్ ఎంటర్టైన్మెంట్స్ LLP మరియు పీపుల్ మీడియా ఫ్యాక్టరీ LLP బ్యానర్ ల సంయుక్త నిర్మాణంలో ఈ చిత్రం రూపొందుతోంది. ఈ చిత్రానికి మెలోడీ బ్రహ్మ మణిశర్మ సంగీతాన్ని అందిస్తున్నారు.
“ఆధ్యంతం వినోదభరితం గా సాగే ఈ చిత్రం హీరో కళ్యాణ్ రామ్ కెరీర్ లో ఒక మంచి చిత్రం అవుతుంది అని నమ్ముతున్నాం. నూతన దర్శకుడు ఉపేంద్ర ఈ చిత్రాన్ని చాలా వినోదభరితం గా మలచారు.  మర్చి లో వేసవి సెలవుల సందర్భం గా ఈ చిత్రాన్ని విడుదల చేసేందుకు ప్లాన్ చేస్తున్నాం. ఈ చిత్రం టీజర్ ను నేడు విడుదల చేయగా, విశేష స్పందన లభించింది “, అని నిర్మాతలు తెలిపారు.
” టోటల్ న్యూ లుక్ లో ఎంతో స్టైలిష్ గా కళ్యాణ్ రామ్ గారు ఈ సినిమా లో కనపడతారు. నాకు డైరెక్షన్ ఛాన్స్ ఇచ్చిన కళ్యాణ్ గారి కి, చిత్ర నిర్మాతల కి కృతఘ్నతలు తెలుపుతున్నా. MLA అనే టైటిల్ కి, కాప్షన్ కి పూర్తి జస్టిఫికేషన్ ఉంటుంది”, అని దర్శకులు ఉపేంద్ర అన్నారు.

Release Date : 20180323