మేడమీద అబ్బాయి

Thursday,August 17,2017 - 05:54 by Z_CLU

నటి నటులు : అల్లరి నరేష్, నిఖిల విమల తదితరులు

సినిమాటోగ్రఫీ: ఉన్ని ఎస్ కుమార్

సంగీతం: షాన్ రెహమాన్

ఎగ్జిక్యూటివ్ నిర్మాత: ఎం.ఎస్.కుమార్,

సమర్పణ:  శ్రీమతి నీలిమ

నిర్మాత: బొప్పన చంద్రశేఖర్,

స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: జి.ప్రజిత్.

వినోదాత్మక చిత్రాల కథానాయకుడు అల్లరి నరేష్  నటిస్తున్న తాజా చిత్రం మేడమీద అబ్బాయి.  జాహ్నవి ఫిల్మ్స్ పతాకంపై శ్రీమతి నీలిమ సమర్పణలో  బొప్పన చంద్రశేఖర్ నిర్మిస్తున్నారు. నిఖిల విమల్ కథానాయిక. జి.ప్రజిత్ దర్శకత్వం వహిస్తున్నారు.చిత్రీకరణను పూర్తిచేసుకున్న ఈ చిత్రం నిర్మాణానంతర పనులు తుదిదశకు చేరుకున్నాయి. కాగా ఈ చిత్రంలోని పాటలను అతి త్వరలో విడుదల చేసి సెప్టెంబరు మొదటివారంలో చిత్రాన్ని విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఈ సందర్భంగా నిర్మాత మాట్లాడుతూ కొత్తదనంతో కూడిన కథతో చేస్తున్న విభిన్న చిత్రమిది. నరేష్ కెరీర్‌లో మరో మైలురాయిలా ఈ చిత్రం నిలిచిపోతుందనే నమ్మకం వుంది. గమ్యం శంభో శివ శంభో తర్వాత ఆ తరహా సున్నితమైన కథతో నరేష్ చేస్తున్న చిత్రమిది. రొమాంటిక్ కామెడీ థ్రిల్లర్‌గా రూపొందుతున్న ఈ చిత్రంలో స్క్రీన్‌ప్లే హైలైట్‌గా వుంటుంది. సహజమైన అంశాలతో థ్రిల్లింగ్  వుంటూనే  నరేష్ శైలి వినోదం వుంటుంది. సెప్టెంబరు మొదటివారంలో  చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకరావడానికి ప్లాన్ చేస్తున్నాం అని తెలిపారు.

Release Date : 20170908