మహానటి

Monday,May 29,2017 - 04:04 by Z_CLU

అలనాటి మహానటి నటి స్వర్గీయ సావిత్రి జీవిత కథ ఆధారంగా తెరకెక్కుతున్న సినిమా ‘మహానటి’. సీనియర్ నటి సావిత్రి క్యారెక్టర్ లో కీర్తి సురేష్ నటిస్తుంది. సావిత్రి గారి లైఫ్ కి సంబంధించి మ్యాగ్జిమం రీసెర్చ్ తర్వాత, కాస్ట్ సెలెక్షన్ మీద దృష్టి పెట్టిన సినిమా యూనిట్, ఎట్టకేలకు ప్రీ ప్రొడక్షన్ కి ప్యాకప్ చెప్పి సినిమాను సెట్స్ పైకి తీసుకువచ్చింది. సమంత ఈ సినిమాలో ఒక ముఖ్య పాత్ర పోషిస్తుంది. ఈ సినిమాలో జెమినీ గణేషన్ క్యారెక్టర్ లో దుల్కర్ సల్మాన్ నటిస్తుండగా, కీలక పాత్రల్లో సమంత, విజయ్ దేవరకొండ నటిస్తున్నారు. నాగ్ అశ్విన్ డైరెక్షన్ లో తెరకెక్కుతున్న ఈ సినిమాని స్వప్న దత్, ప్రియాంక దత్ నిర్మిస్తున్నారు.

Release Date : 20180509

సంబంధిత వార్తలు