లండన్ బాబులు

Tuesday,October 24,2017 - 05:14 by Z_CLU

న‌టీన‌టులు.. ర‌క్షిత్‌(ప‌రిచ‌యం), స్వాతి, ఆలీ, ముర‌ళిశ‌ర్మ‌, రాజార‌వీంద్ర‌, జీవా, ధ‌న‌రాజ్‌, స‌త్య‌, అజ‌య్ ఘోష్, ఈరోజోల్లో సాయి, వేణు, స‌త్య‌కృష్ణ త‌దిత‌రులు న‌టించగా..

సినిమాటోగ్రాఫర్ – శ్యామ్ కె నాయుడు
మ్యూజిక్ – కె
ఎడిటర్ – ఎస్.బి.ఉద్దవ్
కో డైరెక్టర్ – కొప్పినీడి పుల్లారావు
ఆర్ట్ డైరెక్టర్ – విఠల్ కోసనం
పి.ఆర్‌.ఓ- ఏలూరు శ్రీను
ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ – కిరణ్ తలసిల, దాసరి వెంకట సతీష్
నిర్మాత – మారుతి
దర్శకుడు – చిన్ని కృష్ణ

మారుతి టాకీస్‌, ఎవిఎస్ స్టూడియోస్‌ సమర్పణలో ప్రముఖ దర్శక‌, నిర్మాత‌ మారుతి నిర్మాతగా, చిన్ని కృష్ణ దర్శకుడిగా తెరకెక్కిస్తున్న చిత్రం లండన్ బాబులు. త‌మిళం లో విజ‌య్‌ సేతుప‌తి, రితికా సింగ్ క‌ల‌సి నటించిన “ఆండ‌వ‌న్ క‌ట్టాలై” చిత్రాన్ని తెలుగు లో రీమేక్‌ చేస్తున్నారు. నేటి యువత ప్రేమకి, పెళ్లికి ఎంత తొందర పడుతున్నారో అంతే తొందర విడాకులు తీసుకోవడంలో కూడా ముందున్నారు. అలాంటి ఓ జంట లండన్ ప్రయాణంలో జరిగిన పరిస్థితులను దర్శకుడు వినోదాత్మకంగా ఎమోషనల్ గా తెరకెక్కించారు.  అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ సినిమా నవంబర్ 17న ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు.

Release Date : 20171117