లావణ్య విత్ లవ్‌బాయ్స్

Tuesday,October 03,2017 - 06:23 by Z_CLU

రాజ్యలక్ష్మి క్రియేషన్స్ పతాకంపై డా.వడ్డేపల్లి కృష్ణ దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘లావణ్య విత్ లవ్‌బాయ్స్’. పావని, కిరణ్, యోధ, సాంబ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమాను నర్సింలు పటేల్‌చెట్టి, సి.రాజ్యలక్ష్మి  నిర్మించారు. యశోకృష్ణ సంగీతం అందించారు. గేయ రచయితగా మంచి పేరుతెచ్చుకున్న వడ్డేపల్లి కృష్ణ చాలా కాలం తరువాత దర్శకత్వం వహిస్తున్న చిత్రమిది. యూత్‌ఫుల్ ఎంటర్‌టైనర్‌గా నవరసాల్ని మిళితం చేసి ఆద్యంతం వినోదాత్మకంగా రూపొందించాను. ముగ్గురు యువకులు, ఓ యువతి నేపథ్యంలో సాగే చిత్రమిది.  పడుచుకుర్రాళ్ల ప్రణయగాథగా తెరకెక్కిన ఈ చిత్రం అక్టోబర్ 6 న విడుదల కానుంది .

Release Date : 20171006