కృష్ణార్జునయుద్ధం
Wednesday,January 17,2018 - 01:11 by Z_CLU
నటీ నటులు : నాని అనుపమ పరమేశ్వరన్, రుక్సర్ మీర్ హీరోయిన్స్‌గా
సినిమాటోగ్రఫీ: కార్తీక్ ఘట్టమనేని
సమర్పణ : వెంకట్ బోయనపల్లి
నిర్మాతలు : సాహు గారపాటి, హరీష్ పెద్ది
దర్శకత్వం : మేర్లపాక గాంధీ.
నేచరల్ స్టార్ నాని హీరోగా నటిస్తున్న చిత్రం `కృష్ణార్జున యుద్ధం`.సినిమా టైటిల్ పోస్టర్ విడుదలైనప్పటి నుండి సినిమాపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. విభిన్నమైన క్యారెక్టరైజేషన్స్‌లో ఆకట్టుకుంటున్న నాని ఈ సినిమాలో రెండు పాత్రలు చేస్తుండటం విశేషం. సంక్రాంతి సందర్భంగా ఈ చిత్రంలోని కృష్ణ, అర్జున్ పాత్రలలో నాని ఎలా ఉండబోతున్నారనే దానికి సంబంధించిన ఫస్ట్ లుక్స్ విడుదలయ్యాయి. వెంకట్ బోయనపల్లి సమర్పణలో షైన్ స్క్రీన్న్ పతాకంపై సాహు గారపాటి, హరీష్ పెద్ది ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. `వెంకటాద్రి ఎక్స్‌ప్రెస్`, `ఎక్స్‌ప్రెస్ రాజా` చిత్రాల దర్శకుడు మేర్లపాక గాంధీ సరికొత్త స్టైల్లో నానిని తెరపై చూపిస్తున్నారని అర్థమవుతుంది. ప్రస్తుతం సినిమాకు సంబంధించిన ఫైనల్ షెడ్యూల్ చిత్రీకరణ జరుగుతోంది. ఈ షెడ్యూల్‌తో షూటింగ్ మొత్తం పూర్తవుతుంది. పోస్ట్ ప్రొడక్షన్ సహా అన్ని కార్యక్రమాలను పూర్తి చేసి సినిమాను ప్రపంచ వ్యాప్తంగా ఏప్రిల్ 12న గ్రాండ్ రిలీజ్ చేస్తున్నారు. ఈ చిత్రానికి హిప్ హాప్ తమిళ సంగీతాన్ని అందిస్తుండగా, కార్తీక్ ఘట్టమనేని సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు.
Release Date : 20180412