కథలో రాజకుమారి

Wednesday,July 26,2017 - 06:39 by Z_CLU

నారా రోహిత్ నటించిన మరొక విభిన్న కుటుంబ, ప్రేమకధా చిత్రం “కథలో రాజకుమారి”. రాజేష్ వర్మ సిరువూరి సమర్పణ లో నిర్మించబడిన ఈ చిత్రానికి సౌందర్య నర్రా, ప్రశాంతి, బీరం సుధాకర్ రెడ్డి, కృష్ణవిజయ్, నిర్మాతలు మహేష్ సూరపనేని దర్శకుడు. ఈ సందర్భంగా చిత్ర నిర్మాతలు మాట్లాడుతూ.. “పరిణతి చెందిన ఓ జంట మధ్య జరిగే భావోద్వేగాలతో కూడుకున్న ప్రేమకథా చిత్రం ‘కథలో రాజకుమారి’. సెన్సార్ సహా పోస్ట్ ప్రొడక్షన్ పనులు పూర్తి చేసుకున్న ఆగస్ట్ 25న ప్రపంచవ్యాప్తంగా విడుదల చేసేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి” అన్నారు.

నాగశౌర్య, నమిత ప్రమోద్, నందిత, శ్రీముఖి, శ్రీనివాసరావు, తనికెళ్ళ భరణి, అవసరాల శ్రీనివాస్, రాజీవ్ కనకాల, అజయ్, ప్రభాస్ శ్రీను, పరుచూరి వెంకటేశ్వరరావు, చలపతిరావు, కమెడియన్ సత్య, జెన్ని హని తదితరులు ఇతరముఖ్యపాత్రలు పోషిస్తున్న ఈ చిత్రానికి సంగీతం: మేస్ట్రో ఇళయరాజా- విశాల్ చంద్రశేఖర్, ఛాయాగ్రహణం: నరేష్ కే రానా, ఎడిటర్: కార్తీక్ శ్రీనివాస్!

Release Date : 20170915