జంబలకిడిపంబ

Friday,May 04,2018 - 04:36 by Z_CLU

నటీ నటులు : స‌త్యం రాజేశ్‌, ధ‌న్‌రాజ్‌, ష‌క‌ల‌క శంక‌ర్‌, హ‌రి తేజ‌, రాజ్య‌ల‌క్ష్మి, హిమ‌జ‌, కేదారి శంక‌ర్‌, మ‌ధుమ‌ణి, మిర్చి కిర‌ణ్‌, జ‌బ‌ర్ద‌స్త్ అప్పారావు, స‌న‌, సంతోష్‌, గుండు సుద‌ర్శ‌న్‌, జ‌బ‌ర్ద‌స్త్ ఫ‌ణి త‌దిత‌రులు.

సంగీతం:  గోపీసుంద‌ర్‌

కెమెరా:  స‌తీశ్ ముత్యాల‌

నిర్మాత‌లు: ర‌వి, జోజో జోస్‌, శ్రీనివాస‌రెడ్డి.ఎన్‌

స‌హ నిర్మాత‌:  బి.సురేశ్ రెడ్డి

ర‌చ‌న‌- ద‌ర్శ‌క‌త్వం:  జె.బి.ముర‌ళీకృష్ణ (మ‌ను)

జంబ‌ల‌కిడి పంబ‌` అనే పేరు విన‌గానే న‌రేశ్ హీరోగా ఈవీవీ స‌త్య‌నారాయ‌ణ చేసిన న‌వ్వుల సంద‌డి గుర్తుకొస్తుంది. తాజాగా అదే పేరుతో ఓ సినిమా రూపొందుతోంది. ఈ చిత్రంలో శ్రీనివాస‌రెడ్డి క‌థానాయ‌కుడు. `గీతాంజలి`, `జ‌య‌మ్ము నిశ్చ‌య‌మ్మురా` వంటి వైవిధ్య‌మైన సినిమాల‌తో క‌థానాయ‌కుడిగా అడుగులు వేసిన శ్రీనివాస‌రెడ్డి న‌టిస్తోన్న తాజా సినిమా ఇది.  శివ‌మ్ సెల్యూలాయిడ్స్, మెయిన్‌లైన్ ప్రొడ‌క్ష‌న్స్ సంయుక్తంగా తెర‌కెక్కిస్తున్నాయి.  సిద్ధి ఇద్నాని క‌థానాయిక‌. పోసాని కృష్ణ‌ముర‌ళి, వెన్నెల కిశోర్ కీల‌క పాత్ర‌ధారులు. జె.బి. ముర‌ళీకృష్ణ (మ‌ను) ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నారు. ర‌వి, జోజో జోస్‌, శ్రీనివాస‌రెడ్డి.ఎన్ నిర్మాత‌లు.

Release Date : 20180622

సంబంధిత వార్తలు