హేయ్‌..పిల్ల‌గాడ

Wednesday,October 04,2017 - 04:48 by Z_CLU

నటీ నటులు : దుల్క‌ర్ స‌ల్మాన్‌,సాయిప‌ల్ల‌వి,వినయకన్, వినోద్, వి.కె.ప్రకాష్,శౌబిన్ శాహిర్ తదితరులు

మ్యూజిక్ : గోపి సుందర్

సినిమాటోగ్రఫీ : గిరీష్ గంగాధ‌ర‌న్

స‌మ‌ర్ప‌ణ :  సూరెడ్డి గోపాలకృష్ణ(యు.ఎస్‌.ఎ)

మాట‌లు : భాషా శ్రీ

సాహిత్యం : సురేంద్ర కృష్ణ‌

నిర్మాత : డి.వి.కృష్ణ‌స్వామి

ద‌ర్శ‌క‌త్వం : స‌మీర్ తాహిర్‌.

‘ఓకే.. బంగారం’ సినిమాతో దుల్క‌ర్ స‌ల్మాన్‌, ఇటీవ‌ల విడుద‌లైన `ఫిదా`తో భానుమ‌తిగా ప్రేక్ష‌కుల హృద‌యాల్లో చెర‌గ‌ని ముద్ర వేసిన సాయిప‌ల్ల‌వి తెలుగు ప్రేక్ష‌కుల‌కు ద‌గ్గ‌ర‌య్యారు. వీరిద్ద‌రి కాంబినేష‌న్‌లో రూపొందిన సినిమా `క‌లి`. ఈ సినిమాను సూరెడ్డి గోపాలకృష్ణ(యు.ఎస్‌.ఎ) స‌మ‌ర్ప‌ణ‌లో ల‌క్ష్మీ చెన్న‌కేశ‌వ ఫిలింస్ ప‌తాకంపై `హేయ్‌.. పిల్ల‌గాడ` అనే పేరుతో తెలుగులో విడుద‌ల చేస్తున్నారు. డి.వి.కృష్ణ‌స్వామి నిర్మాత‌. స‌మీర్ తాహిర్ ద‌ర్శ‌కుడు. ఈ సినిమా సెన్సార్ కార్య‌క్ర‌మాల‌ను పూర్తి చేసుకుంది. అక్టోబ‌ర్ నెల‌లో సినిమాను విడుద‌ల చేయ‌డానికి నిర్మాత‌లు స‌న్నాహాలు చేస్తున్నారు.

ఈ సంద‌ర్భంగా…. నిర్మాత డి.వి.కృష్ణ‌స్వామి మాట్లాడుతూ – ” ఓకే బంగారం దుల్క‌ర్ స‌ల్మాన్‌, ఫిదా సాయిప‌ల్ల‌వి జంట‌గా న‌టించిన చిత్రం `క‌లి`. మ‌ల‌యాళం,త‌మిళంలో సినిమా మంచి విజ‌యాన్ని సాధించింది. ఇప్పుడు తెలుగులో విడుద‌ల `హేయ్‌..పిల్ల‌గాడ‌` పేరుతో తెలుగులో మా ల‌క్ష్మీ చెన్న కేశ‌వ పిలింస్ బ్యాన‌ర్‌పై విడుద‌ల చేస్తున్నాం. ఇదొక టిపిక‌ల్ ల‌వ్‌స్టోరీ. దుల్క‌ర్‌, సాయిప‌ల్ల‌వి మ‌ధ్య కెమిస్ట్రీ అద్భుతంగా కుదిరింది. యూత్‌, ఫ్యామిలీ ఆడియెన్స్‌కు క‌నెక్ట్ అయ్యే ఎలిమెంట్స్ ఉన్నాయి. సినిమా సెన్సార్ కార్య‌క్ర‌మాల‌ను పూర్తి చేసుకుని క్లీన్ `యు` స‌ర్టిఫికేట్ పొందింది. గోపీసుంద‌ర్ సంగీతం, బ్యాక్‌గ్రౌండ్ స్కోర్‌, గిరీష్ గంగాధ‌ర‌న్ సినిమాటోగ్ర‌ఫీ సినిమాకు పెద్ద ఎసెట్ అవుతాయి.  సినిమాను ఈ అక్టోబ‌ర్ నెల‌లో విడుద‌ల చేయ‌డానికి స‌న్నాహాలు చేస్తున్నాం” అన్నారు.

Release Date : 20171124