గాంఢీవధారి అర్జున

Thursday,June 29,2023 - 03:58 by Z_CLU

‘గాంఢీవధారి అర్జున’ షూటింగ్ పూర్త‌యిన విష‌యాన్ని తెలియ‌జేస్తూ మేకర్స్ ఓ పోస్ట‌ర్‌ను విడుద‌ల చేశారు. ఇందులో వ‌రుణ్ తేజ్ చాలా స్టైలిష్‌గా క‌నిపిస్తున్నారు.  చేతిలో గ‌న్ ప‌ట్టుకుని నిలుచుని ఉన్నారు. వ‌రుణ్‌తేజ్ ఈ చిత్రంలో సెక్యూరిటీ ఆఫీస‌ర్‌గా క‌నిపిస్తారు. అత్యంత ప్ర‌మాద‌క‌ర‌మైన ప‌రిస్థితుల నుంచి ప్ర‌జ‌లను అత‌ను ఎలా కాపాడాడు, అత‌ని స్ట్రాట‌జీస్ ఏంటి? అనేది తెలుసుకోవాలంటే ఆగ‌స్ట్ 25 వ‌ర‌కు ఆగాల్సిందేనంటున్నారు మేక‌ర్స్‌. ఈ చిత్రానికి మిక్కీ జె.మేయ‌ర్ సంగీతాన్ని అందిస్తున్న ఈ చిత్రానికి ముఖేష్ సినిమాటోగ్ర‌ఫీ, అవినాష్ కొల్ల ఆర్ట్ వ‌ర్క్ అందిస్తున్నారు.

Release Date : 20230825