డోర

Tuesday,March 28,2017 - 11:27 by Z_CLU

రిలీజ్ డేట్ : 31 మార్చ్ 2017

నటీ నటులు : నయనతార

కెమెరా: దినేష్ కృష్ణన్

సంగీతం: వివేక్ , మెర్విన్ సోలో మాన్

నిర్మాత: మల్కాపురం శివకుమార్

దర్శకత్వం : దాస్ రామ స్వామి

 

ప్రముఖ కథానాయిక నయనతార తమిళ, తెలుగులో నటిస్తున్న మహిళా ప్రధాన చిత్రం డోర. తెలుగు, తమిళ భాషల్లో ఒకే పేరుతో ఏకకాలంలో రూపొందుతున్న ఈ చిత్రానికి దాస్ దర్శకత్వం వహించారు. సురక్ష్ ఎంటర్‌టైన్‌మెంట్ మీడియా పతాకంపై మల్కాపురం శివకుమార్ ఈ చిత్రాన్ని తెలుగులో విడుదల చేస్తున్నారు. ఓ యువతి జీవితంలో చోటుచేసుకున్న అనూహ్య సంఘటనల సమాహారమే ఈ చిత్ర ఇతివృత్తం. డోర అనే పేరు వెనకున్న రహస్యమేమిటనేది తెరపై ఉత్కంఠను పంచుతుంది. ప్రారంభం నుండి ముగింపు వరకు ప్రతి సన్నివేశం థ్రిల్‌ను కలిగిస్తుంది. నయనతార నటన, పాత్ర చిత్రణ నవ్యరీతిలో ఉంటాయి. గతంలో వచ్చిన హారర్ చిత్రాలకు పూర్తి భిన్నంగా ఉండే చిత్రమిది. నవ్యతతో కూడిన కథాబలమున్న చిత్రాలను తెలుగు ప్రేక్షకులకు అందించాలనే ఉద్దేశ్యంతో ఈ సినిమాను నిర్మిస్తున్నాం. ఇటీవలే విడుదలైన తమిళ టీజర్ అందరిలో ఆసక్తిని రేకెత్తించడంతో పాటు సినిమాపై భారీగా అంచనాలను పెంచింది

Release Date : 20170331

సంబంధిత మూవీ రివ్యూ