దేవి శ్రీ ప్రసాద్

Friday,November 10,2017 - 05:46 by Z_CLU

యశ్వంత్ మూవీస్ స‌మ‌ర్ప‌ణ‌లో ఆర్‌.ఒ.క్రియేష‌న్స్ బేన‌ర్‌పై రూపొందిన చిత్రం `దేవిశ్రీ ప్ర‌సాద్‌`. పూజా రామ‌చంద్ర‌న్‌, భూపాల్‌రాజు, ధ‌న‌రాజ్‌, మ‌నోజ్ నందం ప్ర‌ధాన పాత్ర‌ధారులు. శ్రీ కిషోర్ ద‌ర్శ‌కుడు. డి.వెంక‌టేష్‌, ఆర్‌.వి.రాజు, ఆక్రోష్ నిర్మాత‌లు.క‌మ్రాన్ సంగీతం అందించిన ఈ సినిమా నవంబర్ 17 న రిలీజ్ కానుంది.

ఈ సందర్భంగా  నిర్మాత డి వెంకటేష్ మాట్లాడుతూ “కొత్తదనం కోరుకునే తెలుగు  ప్రేక్షకులకు ఈ చిత్రం తప్పకుండా నచ్చుతుంది. డిఫరెంట్ సబ్జెక్ట్ ను ఎంకరేజ్ చేయాలనే ఉద్దేశ్యంతోనే సినిమాకు నిర్మాతగా వ్యవహరిస్తున్నా.. ఎంత కష్టం ఎదురయినా సినిమాను 10తేదీన విడుదల చేస్తున్నాము. యూ ఎస్ ఎ లో 45 థియేటర్లలో దేవిశ్రీప్రసాద్ ను విడుదలచేస్తున్నాం“ అని అన్నారు.

పూజా రామ‌చంద్ర‌న్‌, భూపాల్ రాజు, ధ‌న‌రాజ్‌, మ‌నోజ్ నందం, పోసాని కృష్ణ‌ముర‌ళి, వేణు టిల్లు త‌దిత‌రులు న‌టించిన ఈ చిత్రానికి సంగీతంః కమ్రాన్‌, కెమెరాః ఫ‌ణీంద్ర వ‌ర్మ అల్లూరి, ఎడిటింగ్ః చంద్ర‌మౌళి.ఎం, మాట‌లుః శేఖ‌ర్ విఖ్యాత్‌, శ్రీ కిషోర్‌, లైన్ ప్రొడ్యూస‌ర్ః చంద్ర వ‌ట్టికూటి, నిర్మాత‌లుః డి.వెంక‌టేష్‌, ఆర్‌.వి.రాజు, ఆక్రోష్, క‌థ‌, స్క్రీన్‌ప్లే, ద‌ర్శ‌క‌త్వంః శ్రీ కిషోర్‌.

Release Date : 20171124