దర్శకుడు

Monday,July 10,2017 - 06:58 by Z_CLU

నటీ నటుల : అశోక్, ఈషా

సినిమాటోగ్రఫీ : ప్రవీణ్ అనుమోలు,

ఎడిటింగ్ : నవీన్‌నూలి

సంగీతం : సాయికార్తీక్

ఎగ్జిక్యూటివ్ నిర్మాత : రమేష్ కోలా

నిర్మాణం : సుకుమార్ రైటింగ్స్

నిర్మాతలు : సుకుమార్, బీఎన్‌సీఎస్‌పీ విజయ్‌కుమార్, థామస్‌రెడ్డి ఆదూరి, రవిచంద్ర సత్తి

కథ-స్క్రీన్ ప్లే-మాటలు- దర్శకత్వం : హరిప్రసాద్ జక్కా

 

వైవిధ్యమైన చిత్రాలతో దర్శకుడిగా అందరి ప్రశంసలు అందుకుంటున్న క్రియేటివ్ దర్శకుడు సుకుమార్ నిర్మాతగా మారి నిర్మించిన తొలిచిత్రం కుమారి 21 ఎఫ్ ఎంతటి విజయాన్ని సాధించిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఇప్పుడు సుకుమార్ నిర్మాతగా తన సొంత సంస్థలో నిర్మిస్తున్న మరో వైవిధ్యమైన ప్రేమకథా చిత్రం దర్శకుడు. సుకుమార్ రైటింగ్స్ పతాకంపై బీఎన్‌సీఎస్‌పీ విజయ్‌కుమార్, థామస్‌రెడ్డి ఆదూరి, రవిచంద్ర సత్తిలతో కలిసి సుకుమార్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాడు. అశోక్, ఈషా జంటగా నటిస్తున్నారు. హరిప్రసాద్ జక్కా దర్శకత్వం వహిస్తున్నారు. త్వరలోనే ఆడియో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. కాగా ఈ చిత్రంలోని ఆకాశం దించి మేఘాల్లో సెట్ వేస్తా అనే పాటను సోమవారం ప్రముఖ కథానాయిక రకుల్ ప్రీత్‌సింగ్ విడుదల చేశారు. ఈ సందర్భంగా రకుల్‌ప్రీత్ సింగ్ మాట్లాడుతూ సుకుమార్ ఆలోచనలన్నీ వినూత్నంగా వుంటాయి. ఆయన నిర్మాతగా రూపొందిన ఈ చిత్రం తప్పకుండా అందర్ని అలరిస్తుందనే నమ్మకం వుంది అని తెలిపింది. త్వరలోనే మిగతా పాటలను కూడా ఒక్కొక్కటి విడుదల చేసి.. ఆ తర్వాత పూర్తి ఆడియోను గ్రాండ్‌గా విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నాం. అశోక్ నటన, హరి ప్రసాద్ జక్కా దర్శకత్వ ప్రతిభ ఈ సినిమాకు హైలైట్‌గా నిలుస్తాయని నిర్మాతలు తెలిపారు.అశోక్, ఇషా,పూజిత, నోయల్, నవీన్, సుదర్శన్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న ఈ చిత్రానికి సినిమాటోగ్రఫీ: ప్రవీణ్ అనుమోలు, ఎడిటింగ్: నవీన్‌నూలి, సంగీతం: సాయికార్తీక్, ఎగ్జిక్యూటివ్ నిర్మాత: రమేష్ కోలా.

Release Date : 20170804