C/o కంచర పాలెం

Tuesday,August 21,2018 - 07:07 by Z_CLU

కేరాఫ్ కంచెర‌పాలెం సినిమా సెప్టెంబ‌ర్ 7న విడుద‌ల కానుంది. వైజాగ్ కు చేరువ‌గా ఉన్న కంచెర‌పాలెం నేప‌థ్యంలో సాగే భిన్న‌మైన ప్రేమ‌క‌థ ఇది.  ఈ ఏడాది న్యూయార్క్ ఫిల్మ్ ఫెస్టివ‌ల్ కు తెలుగు నుంచి ఎంపికైన తొలి సినిమా ఇది. రానా ద‌గ్గుపాటి ఈ చిత్రాన్ని చూసి.. న‌చ్చి త‌నే విడుద‌ల చేయ‌డానికి ముందుకొచ్చాడు. ఇప్పుడు ఆయ‌న స‌మ‌ర్ప‌ణ‌లోనే విడుద‌ల కానుంది కేరాఫ్ కంచెర‌పాలెం. న్యూయార్క్ కు చెందిన కార్డియాల‌జిస్ట్ విజ‌య ప్ర‌వీణ ప‌రుచూరి ఈ చిత్రాన్ని నిర్మిస్తుండ‌గా.. స్వీక‌ర్ అగ‌స్తి ఈ చిత్రానికి సంగీతం అందించారు.

న‌టీన‌టులు: 

సుబ్బారావ్, రాధాబెస్సి, కేశ‌వ క‌ర్రి, నిత్య‌శ్రీ గోరు, కార్తిక్ ర‌త్నం, విజ‌య ప్ర‌వీణ‌, మోహ‌న్ భ‌గ‌త్, ప్ర‌ణీత ప‌ట్నాయ‌క్ త‌దిత‌రులు..

సాంకేతిక నిపుణులు:

ద‌ర్శ‌కుడు: వెంకటేశ్ మ‌హా

స‌మ‌ర్ప‌ణ‌: ద‌గ్గుపాటి రానా

నిర్మాత‌: విజ‌య ప్ర‌వీణ ప‌రుచూరి

సంగీతం: స‌్వీక‌ర్ అగ‌స్తి

సినిమాటోగ్ర‌ఫీ: ఆదిత్య జ‌వ్వాడి అండ్ వ‌రుణ్ ఛాపేక‌ర్

సౌండ్ డిజైన్: నాగార్జున తాళ్ల‌ప‌ల్లి

Release Date : 20180907