ఛలో

Friday,November 17,2017 - 05:34 by Z_CLU

నటీ నటులు : నాగ శౌర్య, రష్మిక

సంగీతం– సాగ‌ర్ మ‌హ‌తి,

సినిమాటోగ్ర‌ఫి– సాయి శ్రీరామ్‌,

నిర్మాత‌– ఉషా ముల్పూరి,

సమర్పణ – శంక‌ర ప్ర‌సాద్ ముల్పూరి,

కథ – మాటలు-స్క్రీన్ ప్లే- ద‌ర్శ‌క‌త్వం– వెంకి కుడుముల‌

రిలీజ్ డేట్ : 2 ఫిబ్రవరి2018

 

 

ఈ సందర్భంగా నిర్మాత ఉషా ముల్పూరి మాట్లాడుతూ…. ఐరా క్రియేషన్స్ ప్రొడక్షన్ నెంబర్ వన్ చిత్రంగా నాగశౌర్య హీరోగా వెంకి కుడుముల దర్శకత్వంలో మేం నిర్మిస్తున్న చిత్రానికి ఛలో అనే టైటిల్ ను ఇటీవలే ఖరారు చేసిన విష‌యం తెలిసిందే. ఫస్ట్ లుక్ పోస్టర్స్ కి ఇండస్ట్రీ నుంచి అటు ప్రేక్షకుల నుంచి చాలా మంచి రెస్పాన్స్ రావాడంతో ఫుల్ హ్యాపీగా ఉన్నాం. సినిమా కూడా అంతే బాగా వచ్చింది. టీం అంతా చాలా కాన్ఫిడెంట్ గా ఉన్నాం. ట్రేడ్ లో బిజినెస్ కూడా ఆరేంజి లోనే జ‌రుగుతుంది. ద‌ర్శ‌కుడు వెంకీ మంచి కథను కమర్షియాలిటీ మిస్ కాకుండా ఎంటర్ టైనింగ్ గా చెప్పారు. నాగశౌర్య పెర్ ఫార్మెన్స్ తో అన్ని వర్గాల ప్రేక్షకుల్ని తప్పకుండా ఎంటర్ టైన్ చేస్తాడు. నాగశౌర్య కెరీర్లోనే బిగ్గెస్ట్ కమర్షియల్ బ్లాక్ బస్టర్ గా నిలుస్తుందనే నమ్మకంతో ఉన్నాం. అందుకే సినిమా ప్రమోషన్ ను సైతం విభిన్నంగా ప్లాన్ చేస్తున్నాం. న‌వంబ‌ర్‌ 18న ఛలో టీజర్ ను రిలీజ్ చేస్తున్నాం. డిసెంబర్ 29న ప‌క్కాగా  ఛలో చిత్రాన్ని ప్రపంచ ప్యాప్తంగా అత్యధిక థియేటర్లలో గ్రాండ్ రిలీజ్ చేస్తున్నాం.   అని అన్నారు.

దర్శకుడు వెంకి కుడుముల మాట్లాడుతూ… దర్శ‌కుడు త్రివిక్ర‌మ్ గారి అశీస్సుల‌తో ద‌ర్శ‌కుడుగా కెరీర్ స్టార్ట్ చేశాను. నాగ‌శౌర్య నటుడిగా నాకు చాలా ఇష్టం. అందుకే ఆయన్ని ఛలో చిత్రం ద్వారా డిఫరెంట్ గా ప్రజెంట్ గా చేస్తున్నాను. నాగశౌర్యను నటుడిగా మరో మెట్టు ఎక్కించే సినిమా అవుతుందని నమ్ముతున్నాను.  ఆంధ్రా, తమిళనాడు బార్డర్ లో జరిగే కాలేజ్ లవ్ స్టోరీ ఇది.  ఛలో చిత్ర టైటిల్ కు హ్యూజ్ రెస్పాన్స్ వచ్చింది. హీరోయిన్ రష్మిక మండన్న కన్నడలో సూపర్ హిట్ అయిన కిరాక్ పార్టీ ద్వారా ఫేమస్ అయ్యింది. ఈ చిత్రంలో చాలా బాగా చేసింది. నిర్మాతల అన‌టం కంటే మా ఫ్యామిలి అన‌టం నాకు ఇష్టంగా వుంటుంది. వారికి చాలా థాంక్స్. న‌వంబ‌ర్‌ 18న వచ్చే టీజర్ తో అంచనాలు పెరుగుతాయని నమ్ముతున్నాను. డిసెంబర్ 29న ఛలో ప్రేక్షకుల ముందుకు వస్తుంది. అని అన్నారు.

చిత్ర సమర్పకుడు… శంకర ప్రసాద్ ముల్పూరి మాట్లాడుతూ…. మా ప్రొడక్షన్ లో వస్తున్న మొదటి చిత్రం ఛలో. టైటిల్ కు ఎంతటి రెస్పాన్స్ వచ్చిందో న‌వంబ‌ర్‌ 18న రిలీజ్ చేస్తున్న టీజర్ కు సైతం అంతే రెస్పాన్స్ వస్తుందని నమ్ముతున్నాం. నాగశౌర్య కు మంచి కమర్షియల్ హిట్ సినిమా అవుతుందని ధీమాగా చెబుతున్నాం. దర్శకుడు వెంకి కథను చాలా బాగా హ్యాండిల్ చేశారు. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుగుతున్నాయి. డిసెంబర్ 29న ప్రపంచ వ్యాప్తంగా గ్రాండ్ గా రిలీజ్ చేయనున్నాం. మా మొదటి చిత్రాన్ని ఇంతగా ఆదరిస్తున్న అందరికీ చాలా థాంక్స్. అని అన్నారు.

Release Date : 20180202

సంబంధిత వార్తలు