అర్జున్ రెడ్డి

Wednesday,July 26,2017 - 06:44 by Z_CLU

విజయ్ దేవర కొండ కథానాయకుడుగా రూపొందుతున్న చిత్రం `అర్జున్ రెడ్డి`. షాలిని హీరోయిన్‌గా న‌టిస్తుంది. భ‌ద్ర‌కాళి పిక్చ‌ర్స్ బ్యాన‌ర్‌పై సందీప్ రెడ్డి వంగా ద‌ర్శ‌క‌త్వంలో ప్ర‌ణ‌య్ రెడ్డి వంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ సినిమా ప్రారంభం నుండి ప్రేక్ష‌కుల్లో అంచ‌నాల‌ను పెంచుతుంది. విల‌క్ష‌ణ పాత్ర‌లు చేయ‌డానికి ఆస‌క్తి చూపే హీరో విజ‌య్ దేవ‌ర కొండ ఈ చిత్రంలో యారోగెంట్ మెడిక‌ల్ స్టూడెంట్ పాత్ర‌లో క‌న‌ప‌డ‌బోతున్నాడు. . ర‌ధ‌న్ సంగీతం అందిస్తున్నాడు.

విజ‌య్ దేవ‌ర కొండ‌, షాలిని, జియా శ‌ర్మ‌, ప్రియ‌ద‌ర్శి, క‌మ‌ల్ కామ‌రాజు, సంజ‌య్ స్వ‌రూప్‌, కాంచ‌న ప్ర‌ధాన తారాగ‌ణంగా న‌టిస్తున్న ఈ చిత్రానికి సౌండ్ మిక్సింగ్ః రాజ‌కృష్ణ‌న్‌, సౌండ్ డిజైన్ః సింక్ సినిమా, వి.ఎఫ్‌.ఎక్స్ః హ‌రికృష్ణ‌, సాహిత్యంః అనంత శ్రీరాం, రాంబాబు గోసాల‌, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూస‌ర్ః కృష్ణ వ‌డ్డేప‌ల్లి, మ్యూజిక్ః ర‌ధ‌న్‌, కెమెరాః రాజ్ తోట‌, ఎడిటింగ్ః శ‌శాంక్‌, నిర్మాతః ప్ర‌ణ‌య్ వంగా, ర‌చ‌న‌, ద‌ర్శ‌క‌త్వంః సందీప్‌రెడ్డి వంగా.

Release Date : 20170825