అంజ‌లి సిబిఐ

Monday,February 18,2019 - 11:26 by Z_CLU

న‌టీన‌టులు: న‌య‌న‌తార‌, అథ‌ర్వ, రాశీఖ‌న్నా, అనురాగ్ క‌శ్య‌ప్, ర‌మేష్ తిల‌క్, దేవన్ త‌దిత‌రులు.

సంగీతం: హిప్ హాప్ త‌మిళ‌న్

సినిమాటోగ్ర‌ఫీ: ఆర్ డి రాజ‌శేఖ‌ర్

ఎడిట‌ర్: భువ‌న్ శ్రీ‌నివాస‌న్

బ్యాన‌ర్: విశ్వ‌శాంతి క్రియేష‌న్స్

నిర్మాత‌లు: Ch రాంబాబు, ఆచంట గోపీనాథ్

క‌థ‌, స్క్రీన్ ప్లే, ద‌ర్శ‌కుడు: ఆర్ అజ‌య్ జ్ఞాన‌ముత్తు

 

లేడీ సూప‌ర్ స్టార్ న‌య‌న‌తార న‌టించిన బ్లాక్ బ‌స్ట‌ర్ సినిమా ఇమైక్క నోడిగ‌ల్. ఈ చిత్రాన్ని తెలుగులో అంజ‌లి సిబిఐ ఆఫీస‌ర్ పేరుతో అనువదిస్తున్నారు. ఆర్ అజ‌య్ జ్ఞాన‌ముత్తు ఈ క్రైమ్ థ్రిల్ల‌ర్ తెర‌కెక్కించారు. న‌య‌న‌తార సిబిఐ ఆఫీస‌ర్ గా టైటిల్ రోల్ లో న‌టించింది. ఈ చిత్రంలో అథ‌ర్వ‌, రాశీఖ‌న్నా కీల‌క పాత్ర‌ల్లో న‌టించ‌గా.. బాలీవుడ్ ద‌ర్శ‌కుడు అనురాగ్ క‌శ్య‌ప్ ప్ర‌తినాయకుడిగా న‌టించారు. ప్ర‌ముఖ హీరో విజ‌య్ సేతుప‌తి విక్ర‌మాదిత్య అనే అతిథి పాత్ర‌లో న‌టించారు. న‌య‌న‌తార భ‌ర్త పాత్ర ఇది. ఈ చిత్రాన్ని క్యామియో ఫిల్మ్స్ బ్యాన‌ర్ సంస్థ‌లో సిజే జ‌య‌కుమార్ నిర్మించారు. హిప్ హాప్ త‌మిళ‌న్ ఈ చిత్రానికి సంగీతం అందించగా.. ఆర్ డి రాజ‌శేఖ‌ర్ సినిమాటోగ్ర‌ఫీ అందించారు.

Release Date : 20190222