రివ్యూ - మాయా బజార్ ( Zee5 సిరీస్)

Friday,July 14,2023 - 03:37 by Z_CLU

నటీ నటులు : డా. న‌రేష్ వి.కె, న‌వ‌దీప్‌, ఝాన్సీ, ఈషా రెబ్బా, మెయంగ్ చంగ్‌, కోట శ్రీనివాస‌రావు, సునైన‌, హ‌రితేజ‌, రాజా చెంబోలు, ర‌వివ‌ర్మ, గౌతం రాజు , అదితి మైకల్   తదితరులు

సంగీతం : జెర్రీ సిల్వస్టెన్ విన్సెంట్

కెమెరా : నవీన్ యాదవ్

మాటలు : గౌతమి , శ్వేత , హరిబాబు

నిర్మాత : రాజీవ్ రంజన్

దర్శకత్వం : గౌతమి చల్ల‌గుల్ల

ఎపిసోడ్స్ :  7 ఎపిసోడ్స్

విడుదల తేది : 14 జూలై 2023

జీ 5తో పాటు రానా ద‌గ్గుబాటికి సంబంధించిన స్పిరిట్ మీడియా..మిరాజ్ మీడియా బ్యాన‌ర్ క‌లిసి రాజీవ్ రంజ‌న్ నిర్మాత‌గా రూపొందించిన ‘మాయబజార్ ఫర్ సేల్’ జీ5 లో స్ట్రీమ్ అవుతుంది. గేటెడ్ క‌మ్యూనిటీస్‌ లో జరిగే ఫ్యామిలీ డ్రామాగా తెరకెక్కిన ఈ సిరీస్ ఎలా ఉంది ? ఫ్యామిలీ అంతా చూసే మంచి వినోదం పంచిందా ? జీ సినిమాలు ఎక్స్ క్లూసివ్ రివ్యూ.

కథ : 

‘మాయాబజార్’ గేటెడ్ కమ్యూనిటీస్ విల్లాస్ లో వివిధ రకాల కుటుంబాలు నివశిస్తుంటాయి. కొందరు పిల్లులను పెంచుకుంటే, కొందరు ఆవులను పెంచుతారు. ఒక విల్లా లో ఉండే కుటుంబంలో ఒక మహిళ తన భర్తతో నిరంతరం గొడవపడుతుంది. కొందరు ఓవర్ పర్ఫెక్షనిజం పద్ధతిలో ప్రవర్తిస్తారు. అయితే ఈ గేటెడ్ కమ్యూనిటీ అక్రమ భూమిపై నిర్మించబడింది. దీంతో గేటెడ్ కమ్యూనిటీని కూల్చివేయాలని, ఇళ్లను నేలమట్టం చేసేందుకు బుల్ డోజర్లను పంపాలని ప్రభుత్వం ఆఫీసర్ ఆదేశిస్తాడు. అప్పుడు ఏమవుతుంది ? వారు తమ విల్లాలను కాపాడుకోగలిగారా? అనే ప్రశ్నలకు సమాధానం దొరకాలంటే మాయా బజార్ చూడాల్సిందే.

 

నటీ నటుల పనితీరు : 

పద్మనాభ శాస్త్రి గా నరేష్ విజయ కృష్ణ మంచి నటన కనబరిచాడు. సైంటిస్ట్ పాత్రలో మంచి ఎంటర్టైన్ మెంట్ అందించాడు. స్టార్ హీరో అభిజిత్ గా నవదీప్ ఆకట్టుకున్నాడు. వల్లి గా ఈషా రెబ్బ , సుధ గా సునైనా , గాంధీ గా రవి వర్మ , సరితా గాంధీ గా హరితేజ , వైభవ్ గా రాజా , సుబ్బు గా గౌతం రాజు , సుధ మావయ్య పాత్రలో కోటా శ్రీనివాస్ అందరూ వారి వారి పాత్రలతో మెప్పించారు. మెయంగ్ చంగ్‌ మిగతా నటీ నటులంతా తమ పాత్రలకు న్యాయం చేశారు.

 

సాంకేతిక వర్గం పనితీరు : 

జెర్రీ సిల్వస్టెన్ విన్సెంట్ కంపోజ్ చేసిన  సాంగ్ బాగుంది. అలాగే కొన్ని సన్నివేశాలకు ఇచ్చిన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ మంచి ఇంపాక్ట్ తీసుకొచ్చింది. నవీన్ యాదవ్ అందించిన విజువల్స్ బాగున్నాయి. తన కెమెరా వర్క్ తో కొన్ని సన్నివేశాలను ఎట్రాక్టివ్ గా చూపించిన తీరు ఆకట్టుకుంది. ఎక్కువ డ్యురేషన్ లేకుండా రవిరాజా ఎడిటింగ్ పర్ఫెక్ట్ గా ఉంది. సిరీస్ ఇంట్రో సాంగ్ కి  ఉమా అందించిన లిరిక్స్ బాగున్నాయి.

గౌతమి , శ్వేత , హరిబాబు అందించిన మాటలు సన్నివేశాలకు తగ్గట్టుగా ఉన్నాయి. కొన్ని డైలాగ్స్ ఫన్ క్రియేట్ చేసి నవ్వించాయి. గౌతమి చల్ల‌గుల్ల క్యారెక్టర్స్ ను హ్యాండిల్ చేసిన విధానం , వారి నుండి రాబట్టిన పెర్ఫార్మెన్స్ సిరీస్ కి ప్లస్ అయ్యాయి. అలాగే కొన్ని సన్నివేశాలను ఆమె డీల్ చేసిన విధానం బాగుంది. ప్రొడక్షన్ వేల్యూస్  బాగున్నాయి.

జీ సినిమాలు సమీక్ష :

ఇరుగు పొరుగుతో బావుండాలి.. ఏదైనా ఇబ్బంది వ‌స్తే మ‌న‌కు బాస‌ట‌గా నిల‌బ‌డేది వారే కాబట్టి. ఇరుగు పొరుగు అంటే మ‌న ప‌క్కింటి వాళ్లని ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. మ‌న ప‌క్క వీధి వాళ్లు.. ప‌క్క ఊరు వాళ్లు.. ఇలా చెప్పుకుంటూ వెళ్లొచ్చు. కానీ పెరుగుతున్న న‌గ‌రీక‌ర‌ణ‌, మారుతున్న‌ సంస్కృతి సాంప్ర‌దాయ‌ల న‌డుమ ఇప్పుడు ఇరుగు పొరుగుకి అర్థం మారిపోయింది. హైద‌రాబాద్ వంటి మ‌హా న‌గ‌రంలోని ఉండేవాళ్లు ఎవ‌రి బిజీలో వాళ్లుంటారు. ప‌క్క‌న ఎవ‌రున్నార‌నేది ప‌ట్టించుకోరు. మ‌రి ఇలాంటి ప్రాంతాల్లో ఇరుగు పొరుగు అంటే .. గేటెడ్ క‌మ్యూనిటీస్‌.. అపార్ట్‌మెంట్ క‌ల్చ‌రే అని చెప్పాలి. అలాంటి కల్చర్ తో గేటెడ్ క‌మ్యూనిటీస్‌ విల్లాస్ లో ఉండే వారి స్టోరీస్ తో గౌతమి తెరకెక్కించిన మాయా బజార్ సిరీస్ ఫ్యామిలీ ఆడియన్స్ ఎంజాయ్ చేసేలా ఉంది.

ఓ గేటెడ్ క‌మ్యూనిటిలో భిన్న మ‌న‌స్త‌త్వాలున్న కుటుంబాలుంటాయి. కోప తాపాలుంటాయి. ఒక్కొక్క‌రి ప్ర‌వ‌ర్త‌న ఒక్కోలా ఉంటుంది. కొంద‌రిని గ‌మ‌నిస్తే విచిత్రంగా కూడా అనిపిస్తాయి. అలాంటి గేటెడ్ కమ్యూనిటీ వాతార‌ణంపై రూపొందిన ఈ సిరీస్ లో పాత్రలు , వాటి బిహేవియర్ మంచి ఎంటర్టైన్ మెంట్ అందిస్తుంది. సిరీస్ ఆరంభం నుండి చివరి వరకూ క్యారెక్టర్స్ తో వచ్చే కామెడీ అలరిస్తుంది. కొందరి కథలు , వారి ఇబ్బందులు , మధ్యలో విల్లాస్ ను కూల్చాలని చూసే ప్రభుత్వ ఉద్యోగి .. ఆ సన్నివేశాలన్నీ ఎపిసోడ్స్ వారీగా ఆకట్టుకున్నాయి. ముఖ్యంగా మొదటి ఎపిసోడ్స్ లో క్యారెక్టర్స్ ను పరిచయం చేస్తూ ఎండింగ్ లో అభిజిత్ మరణంతో మంచి ట్విస్ట్ ఇచ్చి మిగతా ఎపిసోడ్స్ పై ఆసక్తి రేకెత్తించడం బాగుంది. మద్యలో ఆవుతో వచ్చే సన్నివేశాలు , బుల్డోజర్స్ మాయాబజార్ లోకి ఎంట్రీ అయ్యాక వచ్చే సన్నివేశాలు ఆకట్టుకున్నాయి.

రెండో ఎపిసోడ్స్ లో ఒక్కొక్కరి కథలు , వారి బిహేవియర్ పై మాత్రం దర్శకురాలు శ్రద్ద పెట్టడంతో ఆ ఎపిసోడ్ పూర్తిగా మెప్పించకపోయినా అలరిస్తుంది. ఇక మూడో ఎపిసోడ్ , అలాగే నాలోగో ఎపిసోడ్ నుండి అసలు కథ మొదలవ్వడంతో సిరీస్ ఆసక్తిగా ముందుకు నడిచింది. నాలోగో ఎపిసోడ్స్ లో సునైనా ఎంట్రీ నుండి మరింత ఫన్ క్రియేట్ చేస్తుంది సిరీస్. అక్కడి  ఉంది చివరి ఎపిసోడ్ వరకూ ఎంటర్టైనయింగ్ గా తెరకెక్కించారు గౌతమి. అక్కడక్కడా కాస్త బోర్ కొట్టినా ఎక్కువ శాతం నవ్విస్తూ మాయాబజార్ ఫ్యామిలీ అంతా కలిసి చూసే హృద్యమైన సిరీస్ అనిపించింది.  ఎప్ప‌టి క‌ప్పుడు స‌రికొత్త కంటెంట్‌తో ప్రేక్ష‌కుల‌ను అల‌రిస్తోన్న టాప్ వెబ్ ఫ్లాట్‌ఫామ్ జీ 5 నుండి ‘మాయాబజార్ ఫర్ సేల్’ ద్వారా మరో డీసెంట్ ఫ్యామిలీ సిరీస్ వచ్చినట్టే.

 

రేటింగ్ : 3 .5 /5

 

 “Mayabazaar for Sale” STREAMING NOW ON ZEE5

https://www.zee5.com/web-series/details/maya-bazaar-for-sale/0-6-4z5387149