'ఉన్నది ఒకటే జిందగీ' రివ్యూ 

Friday,October 27,2017 - 03:59 by Z_CLU

నటీనటులు : రామ్, అనుపమ పరమేశ్వరన్, లావణ్య త్రిపాఠి, శ్రీవిష్ణు

సంగీతం : దేవిశ్రీ  ప్రసాద్

సినిమాటోగ్రఫీ : సమీర్ రెడ్డి

 ఆర్ట్ : ఏఎస్ ప్రకాష్

ఎడిటింగ్ : శ్రీకర ప్రసాద్

నిర్మాణం : స్రవంతి సినిమాటిక్స్, పి.ఆర్.సినిమాస్

నిర్మాత : కృష్ణ చైతన్య

కథ -స్క్రీన్ ప్లే – దర్శకత్వం : కిషోర్ తిరుమల

రన్ టైం : 152 నిమిషాలు

రిలీజ్ డేట్ : 27-10-2017

‘నేను శైలజ’ వంటి సూపర్ హిట్ తర్వాత రామ్ – కిశోర్ తిరుమల కాంబినేషన్ లో  సినిమా వస్తుందనగానే ‘ఉన్నది ఒకటే జిందగీ’ సినిమాపై  ఓ  రేంజ్ లో అంచనాలు నెలకొన్నాయి. ఫ్రెండ్ షిప్ కాన్సెప్ట్ తో లవ్ ఎంటర్టైనర్ గా తెరకెక్కిన ఈ సినిమా మరి ఆ అంచనాలను అందుకుందా.. రామ్ – శ్రీ విష్ణు ల ఫ్రెండ్షిప్ అందరికీ కనెక్ట్ అవుతుందా… చూద్దాం

కథ: 

అభి(రామ్) – వాసు(శ్రీ విష్ణు) ఒకరిని వదిలి ఒకరు ఉండలేని ప్రాణ స్నేహితులు.  చిన్నతనం నుంచి బెస్ట్ ఫ్రెండ్స్ గా  జీవితాన్ని గడుపుతున్న అభి – వాసు జీవితంలోకి  అనుకోకుండా మహా(అనుపమ) అనే అమ్మాయి ఎంటర్ అవుతుంది.  స్నేహితుడు తర్వాతే ఇంకెవరైనా అనుకునే అభి- వాసులు మహా వల్ల నాలుగేళ్లు  దూరమవుతారు. ఇంతకీ మహా ఎవరు. ఒకరినొకరు వదిలి ఉండలేని అభి – వాసులు ఎందుకు విడిపోయారు.. చివరికి మళ్ళీ ఎలా కలిశారు..అనేది తెలుసుకోవాలంటే సినిమా చూడాల్సిందే.

నటీనటుల పనితీరు :

ప్రతి సినిమాలో తన ఎనర్జిటిక్ పెర్ఫార్మెన్స్ తో ఎంటర్టైన్ చేసే రామ్.. ఈసారి స్టైలిష్ లుక్ – పెర్ఫార్మెన్స్ తో ఎంటర్టైన్ చేశాడు. ముఖ్యంగా ఎమోషనల్ సీన్స్ లో సూపర్బ్ అనిపించుకున్నాడు. సినిమాలో రామ్ తర్వాత హైలైట్ గా నిలిచింది అనుపమ. మహా అనే క్యారెక్టర్ లో అనుపమ ఇన్వాల్వ్ అయి నటించిన తీరు అందరినీ ఆకట్టుకుంటుంది. లావణ్య గ్లామరస్ క్యారెక్టర్ లో పరవాలేదనిపించుకుంది. వాసు అనే క్యారెక్టర్ లో శ్రీ విష్ణు ది బెస్ట్ అనిపించుకున్నాడు. ప్రియదర్శి- హిమజ తమ కామెడీ టైమింగ్ తో ఎంటర్టైన్ చేశారు. చిన్న క్యారెక్టర్ అయినప్పటికీ అనిషా అంబ్రోస్ తన పర్ఫార్మెన్స్ తో పరవాలేదనిపించుకుంది. ఇక కిరీటి ,కౌషిక్‌, కౌముది, అనంత్, మహేష్ ఆచంట  తదితరులు తమ క్యారెక్టర్స్ పర్ఫెక్ట్ అనిపించుకున్నారు.

టెక్నీషియన్స్ పనితీరు :

సినిమాకు పనిచేసిన టెక్నీషియన్స్ లో ముందుగా చెప్పుకోవాల్సింది దేవిశ్రీ ప్రసాద్ గురించే.. తన సాంగ్స్ తో రిలీజ్ కి ముందే  హైప్ తీసుకొచ్చిన దేవి సినిమాకు పర్ఫెక్ట్ మ్యూజిక్ అందించి హైలైట్ అయ్యాడు. ముఖ్యంగా కొన్ని సన్నివేశాలను తన బ్యాగ్రౌండ్ స్కోర్ తో ఎలివేట్ చేశాడు దేవి. చంద్రబోస్, శ్రీమణి అందించిన సాహిత్యం అందరినీ ఆకట్టుకుంది. తన కెమెరా పనితనంతో సినిమాకు మరింత అందం తీసుకొచ్చాడు సమీర్ రెడ్డి. ఎడిటింగ్ ఓకే.. కిశోర్ తిరుమల డైలాగ్స్ – క్లాసీ స్క్రీన్ ప్లే ఎంటర్టైన్ చేశాయి. స్రవంతి సినిమాటిక్స్, పి.ఆర్ సినిమాస్ ప్రొడక్షన్ వాల్యూస్ బాగున్నాయి.

జీ సినిమాలు సమీక్ష :

ఎన్ని ఎత్తుపల్లాలు వచ్చినా జిందగీ మొత్తం మనతో ఉండేవాడే నిజమైన స్నేహితుడు.. అనే పాయింట్ ను తీసుకొని తనదైన శైలిలో సినిమాను ఎంటర్టైనింగ్ గా చెప్పాడు దర్శకుడు. కథ పాతదే అయినప్పటికీ తన క్లాసీ స్క్రీన్ ప్లే- డైలాగ్స్ తో మెస్మరైస్ చేశాడు కిశోర్ తిరుమల. ‘నేను శైలజ’ సినిమాతో దర్శకుడిగా తానేంటో నిరూపించుకొని యూత్ ఫుల్ హిట్ అందుకున్న కిశోర్.. ఈ సినిమాతో కూడా మరోసారి యూత్ ని టార్గెట్ చేస్తూ వారి మధ్య ఉండే ఫ్రెండ్ షిప్ కు ఎమోషనల్ టచ్ ఇచ్చి మెప్పించాడు. హైపర్ తర్వాత ఈ సినిమా కోసం చాలా టైం తీసుకున్న రామ్ ఎట్టకేలకి తన లుక్, ఎనర్జిటిక్ పెర్ఫార్మెన్స్ తో ఆకట్టుకున్నాడు. ఇక ఓవైపు హీరోగా సినిమాలు చేస్తూనే ఈ సినిమాలో ఫ్రెండ్ క్యారెక్టర్ చేసిన శ్రీవిష్ణుని, అలాగే తనతో ఈక్వల్ రోల్ ఉన్న ఇలాంటి స్క్రిప్ట్ ఓకే చేసిన రామ్ ను ఈ సందర్భంగా అభినందించాల్సిందే. రామ్ స్టైలిష్ లుక్, క్యారెక్టర్స్, చిన్నప్పటి ఎపిసోడ్, ఫ్రెండ్ షిప్ సీన్స్, లవ్ ట్రాక్, సాంగ్స్, ఎమోషనల్ సీన్స్, సెకండ్ హాఫ్ లో కామెడీ, ప్రీ-ఇంటర్వెల్ సీన్స్, ఇంటర్వెల్ బ్యాంగ్, ప్రీ క్లైమాక్స్ ట్విస్ట్, క్లైమాక్స్ సినిమాకు హైలైట్స్ గా నిలవగా … కాస్త స్లో అనిపించే స్క్రీన్ ప్లే, రొటీన్ అనిపించే స్టోరీ సినిమాకు మైనస్ అనిపిస్తాయి. ఓవరాల్ గా ఫ్రెండ్ షిప్ – లవ్ ఎంటర్టైనర్ గా రూపొందిన ‘ఉన్నది ఒకటే జిందగీ’ యూత్ కి బాగా కనెక్ట్ అవుతుంది.

రేటింగ్ : ౩.25 /5