విశ్వరూపం 2 మూవీ రివ్యూ

Friday,August 10,2018 - 03:20 by Z_CLU

నటీనటులు : కమల్‌హాసన్‌, రాహుల్‌ బోస్‌, పూజా కుమార్‌, ఆండ్రియా, శేఖర్‌ కపూర్‌, వహీదా రెహమాన్‌

సంగీతం : గిబ్రాన్‌

పాటలు: రామజోగయ్య శాస్త్రి

సినిమాటోగ్రఫీ: శామ్‌దత్‌ షైనుదీన్‌, షను జాన్‌ వర్గీస్‌

ఎడిటింగ్‌: మహేష్‌ నారాయణన్‌, విజయ్‌ శంకర్‌

మాటలు: శశాంక్‌ వెన్నెలకంటి

నిర్మాతలు: ఎస్‌.చంద్రహాసన్‌, కమల్‌హాసన్‌

రచన, దర్శకత్వం : కమల్‌హాసన్‌

విడుదల తేదీ : 10 ఆగస్ట్ 2018

యూనివర్సల్‌ హీరో కమల్‌హాసన్‌ స్వీయ దర్శకత్వంలో నటించి నిర్మించిన ‘విశ్వరూపం’ ఎంతటి ఘనవిజయం సాధించిందో తెలిసిందే. ఐదేళ్ళ తర్వాత ఈ సినిమాకు సీక్వెల్ గా ‘విశ్వరూపం2’ తో ఈరోజే ప్రేక్షకుల ముందుకొచ్చాడు కమల్. మరి ఈ సినిమా ‘విశ్వరూపం’ను మించి ఉందా..? హీరోగా దర్శకుడిగా కమల్ తన విశ్వరూపం చూపించాడా..? జీ సినిమాలు ఎక్స్ క్లూజీవ్ రివ్యూ.


కథ :

‘విశ్వరూపం’ సినిమాకు సీక్వెల్ గా ‘విశ్వరూపం 2’ తెరకెక్కింది . ‘విశ్వరూపం’ లో న్యూయార్క్‌ మిషన్‌ పూర్తి చేసిన విసామ్ (కమల్‌ హాసన్‌), మరో మిషన్‌ మీద లండన్‌ వెళ్తాడు. లండన్‌లో భారీ విధ్వంసానికి జరుగుతున్న కుట్రను తన భార్య నిరుపమా (పూజా కుమార్‌), ఆస్మితా సుబ్రమణ్యం (ఆండ్రియా)లతో కలిసి ఛేదిస్తాడు. అదే సమయంలో తొలి భాగం చివర్లో విసామ్‌ నుంచి తప్పించుకున్న అల్‌ ఖైధా తీవ్రవాది ఒమర్‌ (రాహుల్‌ బోస్‌) ఢిల్లీలో 64 బాంబ్ బ్లాస్ట్‌లు ప్లాన్‌ చేస్తాడు. ఈ విషయం తెలుసుకున్న విసామ్‌, ఒమర్‌ ప్లాన్‌ను ఎలా అడ్డుకున్నాడు అన్నదే ‘విశ్వరూపం 2’ కథ.

 

నటీనటుల పనితీరు :

యూనివర్సల్‌ హీరో కమల్‌హాసన్‌ గురించి కొత్తగా చెప్పేదేముంది… విసాం క్యారెక్టర్ లో అదరగొట్టేశాడు. ముఖ్యంగా కొన్ని యాక్షన్ ఎపిసోడ్స్ లో నటుడిగా తన విశ్వరూపం చూపించాడు. ఆండ్రియా, పూజా కుమార్ ఇద్దరూ ఇంపార్టెన్స్ ఉన్న రోల్స్ లో కనిపించి సినిమాకు ప్లస్ అయ్యారు. రాహుల్‌ బోస్‌, పూజా కుమార్‌, ఆండ్రియా, శేఖర్‌ కపూర్‌, వహీదా రెహమాన్‌ మిగతా నటీనటులందరూ వారి క్యారెక్టర్స్ కి బెస్ట్ అనిపించారు.

టెక్నిషీయన్స్ పనితీరు:

టెక్నికల్ గా విశ్వరూపం కి ఏ మాత్రం తగ్గకుండా ఉంది ‘విశ్వరూపం2’… సినిమాటోగ్రఫీ, బ్యాక్ గ్రౌండ్ స్కోర్, ఆర్ట్ వర్క్, సౌండ్ డిజైనింగ్ ఇలా అన్ని ఎలిమెంట్స్ సినిమాను నెక్స్ట్ లెవెల్ లో నిలబెట్టాయి. ముఖ్యంగా సినిమాటోగ్రఫీ సినిమాకు మెయిన్ హైలైట్. గిబ్రాన్ బ్యాగ్రౌండ్ స్కోర్ కూడా సినిమాకి మరో ఎట్రాక్షన్. ఎడిటింగ్ పరవాలేదు కానీ మొదటి భాగం కొంతభాగం ట్రిమ్ చేస్తే బెటర్ గా ఉండేది. సందర్భానుసారంగా వచ్చే శశాంక్‌ వెన్నెలకంటి మాటలు ఆకట్టుకున్నాయి. కమల్ రచయితగా దర్శకుడిగా తన ఫుల్ ఎఫర్ట్ పెట్టాడు. ప్రొడక్షన్ వాల్యూస్ హై లెవెల్ లో ఉన్నాయి.

జీ సినిమాలు సమీక్ష :

‘విశ్వరూపం’ సినిమాతో హాలీవుడ్ స్టైల్ స్పై థ్రిల్లర్ ను సౌత్ ప్రేక్షకులకు పరిచయం చేసి మెస్మరైజ్ చేసిన కమల్ ఈ సారి ‘విశ్వరూపం2’ తో ఆ మేజిక్ ను రిపీట్ చేయలేకపోయాడు. పార్ట్ 1 వచ్చిన ఐదేళ్ళ తర్వాత ఈ సీక్వెల్ రావడం వల్ల ప్రేక్షకుల్లో ఈ సినిమాపై పెద్దగా అంచనాలు కూడా లేవు. కానీ విశ్వరూపం చూసి కమల్ ఈ సారి కూడా థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ తో మెస్మరైజ్ చేస్తాడనుకుంటే మాత్రం ప్రేక్షకులకు నిరాశే మిగుతుంది. చాలా సన్నివేశాలకు ‘విశ్వరూపం’తో లింక్‌ ఉండటంతో ఆ సినిమా చూసిన వారికే ‘విశ్వరూపం 2’ పూర్తి స్థాయిలో అర్థమవుతుంది. పార్ట్ 1 మిస్ అయిన వారికి ఈ సినిమా అర్థం కావడం కష్టమే.. నిజానికి పార్ట్ -1 వచ్చిన ఐదేళ్ళ తర్వాత ఈ సినిమా విడుదల కావడం మొదటి మైనస్. అప్పుడే వచ్చి వుంటే ఆ సినిమాకొచ్చిన బజ్ ఈ సినిమాకి కూడా కలిసొచ్చి ఉండేది.

నిజానికి కమల్ ఈ సీక్వెల్ పై పెద్దగా ఫోకస్ పెట్టలేదేమో అనే సందేహం కూడా ప్రేక్షకుల్లో కలుగుతుంది. హై టెక్నికల్ వాల్యూస్ తో ఇంప్రెస్ చేసిన కమల్ ఇంట్రెస్టింగ్ స్క్రీన్ ప్లే తో ప్రేక్షకులను పూర్తి స్థాయిలో అలరించలేకపోయాడు. సినిమా అంతా స్లో నేరేషన్ తో సాగడం, పెద్దగా ఇంట్రెస్టింగ్ ఎలిమెంట్స్ లేకపోవడం, ఎడిటింగ్, సాదా సీదా క్లైమాక్స్ సినిమాకు పెద్ద మైనస్. ముఖ్యంగా మొదటి భాగంలో మిగిలిపోయిన ఎడిటెడ్ సీన్స్ తో సినిమాను చుట్టేసాడేమో అనిపించింది. మొదటి భాగం నిడివి ఎక్కువ ఉండటంతో ప్రేక్షకులకు ఇంటర్వెల్ ఎప్పుడొస్తుందా.. అనే ఫీలింగ్ వస్తుంది.

తీవ్ర‌వాదం గురించి ఎంతో ప‌రిశీలించి విశ్వ‌రూపం ను తెరకెక్కించిన బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న క‌మ‌ల్ ఈ సీక్వెల్ పై మరింత శ్రద్ధ పెడితే కచ్చితంగా మంచి అవుట్ పుట్ వచ్చి ఉండేది. సినిమాలో ఒకటి రెండు యాక్షన్ సీక్వెన్స్, మినహా ఆస‌క్తిక‌రమైన అంశాలు కానీ.. సరైన క‌థ‌నం కానీ లేకపోవడంతో కేవలం ఓ యావరేజ్ సినిమా అన్న ఫీల్ కలిగిస్తుంది.

తొలిభాగం చూసిన త‌ర్వాత ఈ సినిమా చూస్తే అంతగా నచ్చదు.. చూడ‌ని వాళ్ల‌కు అర్థం కాదు. సో ఫైనల్ గా కమల్ ‘విశ్వరూపం 2’ జస్ట్ పరవాలేదు అనిపించే స్పై యాక్షన్ డ్రామా అనిపించుకుంది.

రేటింగ్ : 2 / 5