వాసుకి మూవీ రివ్యూ

Friday,July 28,2017 - 03:53 by Z_CLU

నటీనటులు – నయనతార, మమ్ముట్టి, బేబి అనన్య, షీలు అబ్రహాం,

సంగీతం – గోపీ సుందర్

సినిమాటోగ్రాఫర్ – రాబీ రాజ్

డైరక్టర్ – ఏకే సాజన్

నిర్మాత – మోహన్

రిలీజ్ డేట్ – జులై 28

ఫిమేల్ ఓరియంటెడ్ మూవీస్ కు కేరాఫ్ గా మారిన నయనతార లీడ్ రోల్ లో నటించిన చిత్రం వాసుకి. సౌత్ లో నయన్ కు ఎందుకంత డిమాండ్.. ఆమె స్టోరీ సెలక్షన్ ఎలా ఉంటుంది.. ఆమె నటనకు విమర్శకుల ప్రశంసలు సైతం ఎందుకు దక్కుతుంటాయి.. ఈ ప్రశ్నలకు సరైన సమాధానం వాసుకి సినిమా.

కథ

సస్పెన్స్ ఫ్యామిలీ థ్రిల్లర్ గా తెరకెక్కింది వాసుకి మూవీ. తనకు జరిగిన అన్యాయంపై ఓ సాధారణ మహిళ ఎలా తిరగబడింది, ఏ విధంగా ప్రతీకారం తీర్చుకుందనేది ఈ సినిమా స్టోరీ. ఈ రివెంజ్ ప్రాసెస్ లో భర్త తనకు ఎలా సహాయపడ్డాడనే యాంగిల్ సినిమాలో సస్పెన్స్.

టెక్నీషియన్స్ పనితీరు

ఇలాంటి కథను రాసుకున్న దర్శకుడు సాజన్ ను అభినందించి తీరాలి. డ్రగ్స్ వల్ల యువత ఎలా చెడిపోతుందనే విషయాన్ని అంతర్లీనంగా చెబుతూనే వాసుకి కథను అల్లిన విధానం బాగుంది. గోపీసుందర్ రీ-రికార్డింగ్ ఈ సినిమాకు ప్రాణం పోసింది. ఎడిటింగ్ లో ఎక్కడా లోపాల్లేవ్. స్క్రీన్ ప్లేలో ఎక్కడా ఎక్స్ ట్రా సీన్ కనిపించదు. సినిమాటోగ్రాఫర్ రాబీ రాజ్ పనితీరు అద్భుతంగా ఉంది.

నటీనటుల పనితీరు

సినిమాలో ముందుగా చెప్పుకోవాల్సింది నయనతార గురించే. ఫస్ట్ ఫ్రేమ్ నుంచి లాస్ట్ వరకు నయనతార అద్భుతంగా నటించింది. ఏ ఫ్రేమ్ లో కూడా ఎమోషన్ మిస్ అవ్వలేదు. తనకు జరిగిన అన్యాయాన్ని పైకి చెప్పుకోలేక, అలా అని మరిచిపోలేక మనసులోనే కుమిలిపోయే పాత్రలో నయనతార అద్భుతంగా నటించింది. సినిమా మొత్తం ఆమె చుట్టూనే తిరుగుతుంది. ఇక నయన్ భర్త పాత్రలో నటించిన మమ్ముట్టి సినిమాను మరో మెట్టు పైకి తీసుకెళ్లాడు. కథలో వీళ్లిద్దరే కీలకం. మిగతా నటీనటులంతా తమ పరిధి మేరకు చక్కగా నటించారు.

జీ సినిమాలు రివ్యూ

కథల్లేవంటూ కామెంట్స్ చేసే మేకర్స్ కు వాసుకి ఓ బెస్ట్ ఎగ్జాంపుల్. కాంటెంపరరీ ఇష్యూస్ కు ఓ మహిళపై జరిగిన అన్యాయాన్ని జతచేయడమే సినిమాకు మొదటి విజయంగా చెప్పుకోవచ్చు. డ్రగ్స్ ఇష్యూకు, మహిళా సమస్యను జోడించడం చాలా బాగుంది. తనకు అన్యాయం చేసిన వ్యక్తులపై నయనతార ప్రతీకారం తీర్చుకునే విధానాన్ని దర్శకుడు చక్కగా చూపించాడు. ఎక్కడా సినిమాటిక్ గా అనిపించకుండా చాలా రియలిస్టిక్ గా ఉంది.

మలయాళంలో వచ్చిన ‘పుదియ నిలయం’ సినిమాకు డబ్బింగ్ వెర్షన్ గా వాసుకి వచ్చింది. తెలుగులో విడుదలకు ముందే ఈ సినిమాకు గాను అవార్డులు అందుకుంది నయనతార. అంతలా ఆమె సినిమాకు ప్లస్ అయింది. ఇక సినిమా స్టార్టింగ్ నుంచి సాఫ్ట్ గా కనిపించే మమ్ముట్టిని క్లైమాక్స్ లో చూపించిన విధానం చాలా బాగుంది.

వాసుకి సినిమా మొత్తాన్ని ఒంటిచేత్తో నడిపించింది నయనతార. ఆమె ట్రెడిషనల్ లుక్స్, కొన్ని కీలకమైన సన్నివేశాల్లో నయన్ యాక్టింగ్ కు ఎవరైనా ఫ్లాట్ అవ్వాల్సిందే. సినిమా సీరియస్ గా సాగుతున్నప్పటికీ.. ప్రేక్షకుడ్ని పూర్తిగా లీనం చేయడంలో వాసుకి హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ అయింది.

నయనతారకు టోటల్ సౌత్ లో అభిమానులున్నారు. టాలీవుడ్ కు సంబంధించి ఆమె అభిమానులంతా తప్పక చూడాల్సిన సినిమా ఇది. దీన్ని కేవలం ఫిమేల్ ఓరియంటెడ్ మూవీగా చూడడం తప్పు. దేశంలో ఎక్కువ మంది మహిళలు ఎదుర్కొంటున్న ఓ సమస్యకు దృశ్యరూపమే వాసుకి సినిమా.

ఫైనల్ గా చెప్పాలంటే ఈ ఏడాది కచ్చితంగా చూడాల్సిన సినిమాల్లో ఒకటి వాసుకి.

రేటింగ్   3/5