Movie Review - బీస్ట్

Wednesday,April 13,2022 - 02:10 by Z_CLU

Thalapathy Vijay’s ‘Beast’ Movie Review

నటీ నటులు : విజయ్ , పూజ హెగ్డే , సెల్వ రాఘవన్ , VTV గణేష్, యోగి బాబు తదితరులు

సినిమాటోగ్రఫీ : మనోజ్ పరమహంస

మ్యూజిక్ : అనిరుద్

నిర్మాణం : సన్ పిక్చర్స్

నిర్మాత : కళానిధి మారన్

రచన -దర్శకత్వం : నెల్సన్

విడుదల తేది : 13 ఏప్రిల్ 2022

నిడివి : 157 నిమిషాలు

విజయ్ – నెల్సన్ కాంబినేషన్ లో భారీ అంచనాలతో ప్రేక్షకుల ముందుకొచ్చింది ‘బీస్ట్’. కంటెంట్ ఏంటనేది ట్రైలర్ తోనే చెప్పేసిన నెల్సన్ ఈ సినిమాతో ఫైనల్ గా ఆడియన్స్ ని మెస్మరైజ్ చేశాడా ? ‘బీస్ట్’ బెస్ట్ అనిపించుకుందా ? జీ సినిమాలు ఎక్స్ క్లూజీవ్ రివ్యూ.

కథ :

అతిపెద్ద మిషన్ కంప్లీట్ చేసి చెన్నై తిరిగి వచ్చిన మాజీ రా ఏజెంట్ వీర రాఘవ (విజయ్) ఒక ఈవెంట్ లో ప్రీతీ (పూజ హెగ్డే) ని కలుసుకుంటాడు. ప్రీతీ తను వర్క్ చేసే సెక్యురిటీ ఏజెన్సీ కంపెనీలో వీర రాఘవ కి జాబ్ ఇప్పించే ప్రయత్నం చేస్తుంది. ఇంతలోనే  చెన్నై లోని ఈస్ట్ కోస్ట్ షాపింగ్ మాల్ ని హైజాక్ చేసి ఇండియన్ గరవర్న్ మెంట్ కి సవాల్ విసిరి ఉగ్రవాది ఉమర్ ఫరూక్ ని రిలీజ్ చేయాలని డిమాండ్ చేస్తారు టెర్రరిస్టులు. గవర్న్ మెంట్ తరుపున ఈ విషయాన్ని డీల్ చేస్తూ ఉగ్రవాదితో ఫోన్ కాల్ ద్వారా మాట్లాడుతూ వారి డిమాండ్స్ తెలుసుకుంటాడు ఇండియన్ ఆఫీసర్ అల్తాఫ్(సెల్వ రాఘవన్).

షాపింగ్ మాల్ హైజాగ్ చేసే టైంకి అందులోనే ఉన్న వీర రాఘవ టెర్రరిస్టుల నుండి హైజాగ్ చేయబడిన జనాలను ఎలా కాపాడాడు? అతనికి ఇండియన్ గవర్న్ మెంట్ ఎలా సహకరించింది ? ఈ మిషన్ ని వీర రాఘవ ఎలా డీల్ చేశాడు ? అనేది మిగతా కథ.

నటీ నటుల పనితీరు :

వీర రాఘవ అనే రా ఏజెంట్ క్యారెక్టర్ కి విజయ్ బెస్ట్ ఇచ్చాడు. తన నటనతో వన్ మ్యాన్ షో గా సినిమాను నడిపించాడు. పూజ హెగ్డే ని కేవలం గ్లామర్ షో కోసం తీసుకున్నారు తప్ప తన రోల్ కి పెద్దగా ఇంపార్టెన్స్ లేదు. సెల్వ రాఘవన్ తన క్యారెక్టర్ తో ఎంటర్టైన్ చేశాడు. ఇక VTV గణేష్ డైలాగ్ కామెడీ సినిమాకే హైలైట్ గా నిలిచింది. ఆ పాత్రకు తెలుగు డబ్బింగ్  కూడా బాగా కుదిరింది.

యోగి బాబు తన కామెడీ టైమింగ్ తో ఎంటర్టైన్ చేశాడు. ప్రీ క్లైమాక్స్ కి ముందే వచ్చే సన్నివేశాల్లో యోగి బాబు, రెడిన్ కింగ్స్లే కామెడీ ట్రాక్ వర్కౌట్ అయింది. టెర్రరిస్ట్ పాత్రలో అంకూర్ వికన్ పరవాలేదనిపించుకున్నాడు. లిల్లిపుట్ ఫరూక్ ఉమా ఫారూక్ రోల్ కి ఫిట్ అవ్వలేదనిపించింది. అపర్ణ దాస్ , షైన్ టాం తమ క్యారెక్టర్స్ పర్ఫెక్ట్ అనిపించుకున్నారు. మిగతా నటీ నటులు తమ పాత్రలకు న్యాయం చేశారు.

సాంకేతిక వర్గం పనితీరు :

‘బీస్ట్’ సినిమాకు బెస్ట్ వర్క్ ఇచ్చిన టెక్నీషియన్స్ లో ముందుగా మాట్లాడుకోవాల్సింది అనిరుద్ గురించే. తన మ్యూజిక్ తో సినిమాకు హైలైట్ గా నిలిచాడు అనిరుద్. హలమిత్తి హబిబో సాంగ్ తో పాటు సినిమాకు బెస్ట్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ అందించాడు. తన స్కోర్ తో  హీరోయిజంని ఎలివేట్ చేశాడు. మనోజ్ పరమహంస విజువల్స్  సినిమాకు ప్లస్ అయ్యాయి. నిర్మల్ ఎడిటింగ్ పరవాలేదు. ఆర్ట్ వర్క్ బాగుంది.

నెల్సన్ దిలీప్ కుమార్ రాసుకున్న రొటీన్ స్టోరీ -స్క్రీన్ ప్లే సినిమాకు మేజర్ మైనస్ అని చెప్పొచ్చు. సన్ పిక్చర్స్ ప్రొడక్షన్ వేల్యూస్ రిచ్ గా ఉన్నాయి.

Beast-telugu-trailer-out-vijay-poojahegde-dilraju-zeecinemalu

జీ సినిమాలు సమీక్ష :

డాక్టర్ సినిమాతో తెలుగు ప్రేక్షకులను కూడా మెప్పించి సూపర్ హిట్ అందుకున్న నెల్సన్ విజయ్ తో సినిమా చేస్తున్నాడని ఎనౌన్స్ మెంట్ నుండే ‘బీస్ట్’ సినిమాపై తెలుగులోనూ అంచనాలు నెలకొన్నాయి. అయితే ఆ అంచనాలను బీస్ట్ తో అందుకోలేక పోయాడు దర్శకుడు. గతంలో చాలా సినిమాల్లో చూసేసిన టెర్రరిస్ట్ హైజాక్ కథను తీసుకొని దానికి రొటీన్ స్క్రీన్ ప్లే రాసుకున్నాడు నెల్సన్. దీంతో ‘బీస్ట్’ బెస్ట్ అనిపించుకోలేకపోయింది.

వీర రాఘవ రా ఏజెంట్ గా ఉంటూ ఒక భారీ మిషన్ హ్యాండిల్ చేయడంతో సినిమా మొదలవుతుంది. అందులో భాగంలో ఓ తప్పు చేశాననే ఫీలింగ్ తో అతను రాజీనామా చేయడం , 11 నెలల తర్వాత చెన్నై తిరిగి రావడం సరిగ్గా అప్పుడే టెర్రరిస్టులు చెన్నై షాపింగ్ ని హైజాక్ చేయడం తో కథ మొదలవుతుంది. అలా షాపింగ్ మాల్ లో మొదలైన కథ ప్రీ క్లైమాక్స్ వరకూ అక్కడే తిరుగుతుంది. దీంతో ఆడియన్స్ కి ఈ యాక్షన్ డ్రామా బోరింగ్ గా అనిపిస్తుంది. షాపింగ్ మాల్  హైజాగ్ మీదే డిపెండ్ అయి  కథ రాసుకోవడం, దానికి ఆకట్టుకునే స్క్రీన్ ప్లే రాసుకోకపోవడం నెల్సన్ చేసిన బ్లెండర్ మిస్టేక్ అనిపిస్తుంది. అక్కడక్కడా నెల్సన్ మార్క్ కామెడీ ఎంటర్టైన్ చేస్తుంది కానీ.. ఫైనల్ గా మాత్రం ఈ రొటీన్ స్టోరీ, స్క్రీన్ ప్లే తో నెల్సన్ పూర్తి స్థాయిలో ప్రేక్షకులను మెప్పించలేకపోయాడు.

నిజానికి నెల్సన్ కామెడీ సినిమాలను బాగా హ్యాండిల్ చేయగలడు. ‘కోకోకోకిల’, ‘డాక్టర్’ సినిమాలే ఇందుకు ఉదాహరణ. సీరియస్ సబ్జెక్ట్ లతో కొన్ని క్యారెక్టర్స్ ద్వారా  కామెడీ పండించడం నెల్సన్ కున్న బలం. బీస్ట్ కి వచ్చే సరికి హీరోయిజం మీద ఎక్కువ శ్రద్ధ పెట్టాడు నెల్సన్.  తన మార్క్ కామెడీతో హిలేరియస్ గా నవ్వించాడు కానీ టెర్రరిస్టుల హైజాక్ అంటూ సీరియస్ కథలో కామెడీ ఇరికించడంతో నెల్సన్ విజయ్ తో కామెడీ సినిమా తీసాడనిపిస్తుంది. పైగా లాజిక్స్ ఏవి పట్టించుకోకుండా తనకి అనిపించినట్టుగా సినిమాను తెరకెక్కించడం కూడా పెద్ద మైనస్. ముఖ్యంగా ఇండియన్ ఆఫీసర్ , టెర్రరిస్ట్ ల ఫోన్ సంభాషణ ,  ఆ టైంలో మినిస్టర్ కామెడీగా బిహేవ్ చేయడం లాంటివి సిల్లీగా అనిపిస్తాయి. అదే విధంగా షాపింగ్ మాల్ లో హీరో… దొంగ-పోలీస్ గేమ్ ఆడుతున్నట్లు గన్స్ పట్టుకొని అటు ఇటు తిరుగుతూ దాచుకుంటూ బ్యాకెండ్ లో ఏదో సీక్రెట్ మిషన్ అమలు చేస్తుండటం  కూడా కామెడీగా అనిపిస్తాయి తప్ప కథలో సిరీయస్ కనిపించదు. పైగా హీరో క్లైమాక్స్ లో పాకిస్తాన్ కి వెళ్లి ఉగ్రవాదిని ఇండియాకి తీసుకొచ్చే ఎపిసోడ్ కామెడీగా ఉంది. ఆ ఎపిసోడ్ కోసం మాత్రం బాగానే ఖర్చు పెట్టారు మేకర్స్. ఆ ఎపిసోడ్ తో కొన్ని మిషన్స్ వెనుక ఎలాంటి రాజకీయం ఉంటుందో చెప్పే ప్రయత్నం చేశాడు దర్శకుడు.

విజయ్ యాక్టింగ్ , పూజ హెగ్డే గ్లామర్,  అనిరుద్ మ్యూజిక్ , కామెడీ సీన్స్, హలమిత్తి హబిబో సాంగ్ కోసం ‘బీస్ట్’ ని ఒకసారి చూడొచ్చు. ఇవి కాకుండా సినిమాలో పెద్దగా చెప్పుకోవడానికి ప్లస్ పాయింట్స్ లేవు. ఫైనల్ గా బీస్ట్ అంచనాలను అందుకోలేక జస్ట్ బిలో యావరేజ్ మూవీ అనిపించుకుంది.

రేటింగ్ : 2.25 /5

Follow Us for Latest Telugu Zee Cinemalu News and upcoming trending stories, Gossips, Actress Photos and Special topics