Movie Review - మైఖేల్

Friday,February 03,2023 - 04:26 by Z_CLU

Sundeep Kishan’s ‘Michael’ Review

నటీ నటులు : సందీప్ కిషన్, విజయ్ సేతుపతి, గౌతమ్ మీనన్, దివ్యాంశ కౌశిక్, వరలక్ష్మి శరత్‌కుమార్, వరుణ్ సందేశ్,అనసూయ భరద్వాజ్ తదితరులు.

సంగీతం: సామ్ సిఎస్

కెమెరా : కిరణ్ కౌశిక్

డైలాగ్స్: త్రిపురనేని కళ్యాణ్ చక్రవర్తి, రాజన్ రాధామణలన్, రంజిత్ జయకోడి

సమర్పణ: నారాయణ్ దాస్ కె నారంగ్

బ్యానర్లు: శ్రీ వెంక‌టేశ్వర సినిమాస్ ఎల్ఎల్‌పి, క‌ర‌ణ్ సి ప్రొడ‌క్షన్స్ ఎల్ఎల్‌పి

రచన – దర్శకత్వం: రంజిత్ జయకొడి

నిర్మాతలు: భరత్ చౌదరి, పుస్కూర్ రామ్ మోహన్ రావు

నిడివి : 154 నిమిషాలు

విడుదల తేదీ : 3 ఫిబ్రవరి 2023

సందీప్ కిషన్ పాన్ ఇండియా మూవీ ‘మైఖేల్’ మోస్తారు అంచనాలతో ఇవ్వాళే థియేటర్స్ లోకి ఎంట్రీ ఇచ్చింది. మరి భారీ కాస్టింగ్ తో దర్శకుడు  రంజిత్ జయకొడి తీసిన ఈ సినిమా సందీప్ కిషన్ కి హిట్ అందించిందా ? టీజర్ , ట్రైలర్ తో ఎట్రాక్ట్ చేసిన ‘మైఖేల్’ అంచనాలను అందుకున్నాడా ? జీ సినిమాలు ఎక్స్ క్లూసివ్ రివ్యూ.

కథ : 

అనాధగా ఉన్న మైఖేల్(సందీప్ కిషన్) ను చిన్నతనంలో చేరదీసి నివాసం కల్పిస్తాడు బొంబే గ్యాంగ్ స్టర్ గురునాథ్ (గౌతం మీనన్). ఓ సందర్భంలో తనను ఓ ఎటాక్ నుండి కాపాడిన మైఖేల్ కి  బార్ వ్యాపారాలకు సంబంధించి భాద్యతలు అప్పగిస్తాడు. అలాగే తనపై ఎటాక్ జరిపిన రతన్ ను పట్టుకొని చంపమని టాస్క్ ఇస్తాడు. ఆ టాస్క్ లో భాగంగా రతన్ కూతురు తీర(దివ్యామ్ష కౌశిక్) ను ఫాలో అవుతాడు మైఖేల్. అనుకోకుండా ఇద్దరూ ఒకరికొకరు కనెక్ట్ అవుతారు.

అయితే చేతికి చిక్కిన రతన్ ను ఆమె కూతురి కోసం వదిలేస్తాడు మైఖేల్. ఈ విషయం తెలుసుకున్న గురునాథ్ ఏం చేశాడు ? మరో వైపు గురునాథ్ మైఖేల్ కి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తున్నాడని భార్య(అనసూయ) , కొడుకు అమర్ (వరుణ్ సందేశ్) పగతో రగిలిపోతో ఏం ప్లాన్ చేశారు? మధ్యలో విజయ్ సేతుపతి , వరలక్ష్మి శరత్ కుమార్ పాత్రలు ఎందుకు వస్తాయి ? వారికి మైఖేల్ కి సంబంధం ఏమిటి ? ఫైనల్ గా మైఖేల్ చిన్నతనం నుండి ప్లాన్ చేసుకున్న రివేంజ్ ఎలా తీర్చుకున్నాడు ? అనేది మిగతా కథ.

నటీ నటుల పనితీరు : 

మైఖేల్ పాత్ర కోసం సందీప్ కిషన్ కష్టపడ్డాడు. పర్ఫెక్ట్ ఫిజిక్ మెయిన్ టైన్ చేశాడు. తన నటనతో ఆ పాత్రకు న్యాయం చేశాడు కానీ సందీప్ కిషన్ లో రెగ్యులర్ గా కనిపించే ఎనర్జీ ఇందులో మిస్ అయ్యింది. దివ్యాంశ కౌశిక్ గ్లామర్ తో ఆకట్టుకుంది. నటన పరంగానూ మెప్పించింది. విజయ్ సేతుపతి నటన బాగుంది కానీ ఆ పాత్రకు సరైన డిజైనింగ్ కుదరలేదు. వరలక్ష్మి శరత్ కుమార్ రెండు సీన్లు , ఓ ఫైట్ లో మాత్రమే కనిపించింది. ఆమెకు కథలో ప్రాముఖ్యత దక్కలేదు. గౌతం వాసు దేవ్ మీనన్ గ్యాంగ్ స్టర్ గా పరవాలేదనిపించుకున్నాడు తప్ప ఎక్కువ మార్క్స్ స్కోర్ చేయలేకపోయాడు. అనసూయ తన పాత్ర న్యాయం చేసింది. వరుణ్ సందేశ్ కి మంచి పాత్ర దక్కింది. మిగతా నటీ నటులంతా తమ పాత్రలతో ఆకట్టుకున్నారు.

సాంకేతిక వర్గం పనితీరు : 

మైఖేల్ కి టెక్నికల్ గా మంచి సపోర్ట్ దక్కింది. ముఖ్యంగా బ్యాక్ గ్రౌండ్ స్కోర్ , విజువల్స్ సినిమాకు స్తాయిను పెంచాయి. కిరణ్ కౌశిక్ కెమెరా వర్క్ బాగుంది. సామ్ cs మ్యూజిక్ బాగుంది. సిద్ శ్రీరామ్ తో పాడించిన సాంగ్ ఆకట్టుకుంది. సత్యనారాయణ ఎడిటింగ్ పరవాలేదు కానీ కొన్ని సన్నివేశాలను ట్రిమ్ చేస్తే బాగుండేది. యాక్షన్ ఎపిసోడ్స్ మాస్ ను ఆకట్టుకుంటాయి.

త్రిపురనేని కళ్యాణ్ చక్రవర్తి, రాజన్ రాధామణలన్, రంజిత్ జయకోడి రాసిన మాటలు అక్కడక్కడా బాగున్నాయి. క్లైమాక్స్ లో వచ్చే డైలాగులు పేలాయి. రంజిత్ జయకోడి కథ -కథనం రొటీన్ గా ఉన్నాయి. కొన్ని సన్నివేశాలను దర్శకుడిగా బాగా హ్యాండిల్ చేశాడు.

జీ సినిమాలు సమీక్ష : 

వెంకటాద్రి ఎక్స్ ప్రెస్ తర్వాత సందీప్ కిషన్ కి ఆ రేంజ్ హిట్ పడలేదు. కెరీర్లో ఎన్ని ప్రయోగాలు చేసినా అన్ని విఫలం అయ్యాయి. అందుకే రంజిత్ తో మైఖేల్ సినిమా సెట్ చేసుకొని హిట్ కొట్టాలని ప్లాన్ చేసుకున్నాడు. ఈసారి పాన్ ఇండియా కంటెంట్ ప్లాన్ చేసుకున్నాడు. అయితే రంజిత్ ఈ సినిమా కోసం తీసుకున్న స్టోరీ -స్క్రీన్ ప్లే రొటీన్ గానే ఉన్నాయి. కాకపోతే మంచి కాస్టింగ్ , మేకింగ్ స్టైల్ తో కొంత వరకు మెప్పించాడు.

అవుట్ అండ్ అవుట్ యాక్షన్ సినిమా ప్లాన్ చేసుకున్నప్పుడు కేవలం మేకింగ్  , కాస్టింగ్ , టెక్నికలిటీస్ మీద శ్రద్ద పెడితే సరిపోదు. మెస్మరైజ్ చేసే కంటెంట్ ప్లాన్ చేసుకోవాలి. ముఖ్యంగా హీరోయిజం ఎలివేట్ చేస్తూ అదిరిపోయే యాక్షన్ ఎపిసోడ్స్ ప్లాన్ చేసుకోవాలి. రంజిత్ ఉన్నంతలో మైఖేల్ కోసం ఇలాంటివి ప్లాన్ చేసుకున్నాడు. కాకపోతే హీరోయిజం అనుకున్న స్థాయిలో వర్కవుట్ అవ్వలేదు. పైగా సందీప్ కిషన్ కేరెక్టరైజేషన్ సరిగ్గా కుదరకపోవడంతో మైఖేల్ పాత్ర క్లిక్ అవ్వలేదు. సినిమాకు విజయ్ సేతుపతి , గౌతం మీనన్ , వరలక్ష్మి శరత్ కుమార్ , అనసూయ , వరుణ్ సందేశ్ ఇలా చాలా పెద్ద కాస్టింగ్ పెట్టుకున్నారు. కానీ ఆ పాత్రలకు సంబంధించి అదిరిపోయే సన్నివేశాలు రాసుకోలేకపోయాడు రంజిత్. ముఖ్యంగా విజయ్ సేతుపతి తో డిజైన్ చేసిన యాక్షన్ ఎపిసోడ్ తప్ప మిగతా సన్నివేశాలు ఆకట్టుకోలేదు.

‘మైఖేల్’ లో కొత్త కథ -కథనం కనిపించదు.  కథ పరంగా గతంలో తెలుగులో వచ్చిన ‘మున్నా’, ‘పంజా’ సినిమాలు గుర్తొస్తాయి. ట్రీట్ మెంట్ , మేకింగ్ స్టైల్ మాత్రం కేజీఫ్ తో పోలిక ఉంటుంది. కానీ కథను నడిపించిన తీరు కొంత వరకు ఆకట్టుకుంటుంది. అలాగే కొంత ఆసక్తి రేకెత్తిస్తుంది. హీరోకి లైఫ్ మీద ఎలాంటి ఆశలు లేనట్టు చూపించి ఫైనల్ గా అతనికి ఓ రివేంజ్ ఉందని క్లైమాక్స్ ద్వారా చూపించి కథను యాక్షన్ రివేంజ్ డ్రామాలా తీర్చిదిద్దాడు దర్శకుడు. అలాగే యాక్షన్ కథకి మదర్ సెంటిమెంట్ జోడించాడు.  కాకపోతే ఎమోషనల్ సన్నివేశాలు అంతగా పండలేదు. దర్శకుడు సినిమాను రెట్రో స్టైల్‌లో తీసిన విధానం బాగుంది. యాక్షన్ సినిమా ప్రేమికులకు ఆ స్టైల్ నచ్చుతుంది. ఓవరాల్ గా యాక్షన్ డ్రామా గా వచ్చిన మైఖేల్ ఓ మోస్తరుగా ఆకట్టుకుంటుంది. కానీ టీజర్ , ట్రైలర్ చూసి ఎక్కువ ఆశించి వెళ్తే మాత్రం నిరాశ తప్పదు.

రేటింగ్ : 2 .5 /5