'స్పైడర్' రివ్యూ

Wednesday,September 27,2017 - 02:22 by Z_CLU

నటీనటులు : మహేష్, రకుల్ ప్రీత్ సింగ్, ఎస్.జె.సూర్య, భరత్ తదితరులు

సంగీతం : హరీష్ జయ రాజ్

సినిమాటోగ్రఫీ : సంతోష్ శివన్

ఎడిటింగ్ : ఏ.శ్రీకర్ ప్రసాద్

నిర్మాణం :  ఎన్.వి .ఆర్ సినిమా ఎల్.ఎల్.పి

సమర్పణ : ఠాగూర్ మధు

నిర్మాత : ఎన్.వి.ప్రసాద్

కథ-మాటలు- స్క్రీన్ ప్లే- దర్శకత్వం : ఏ.ఆర్.మురుగదాస్

విడుదల : సెప్టెంబర్ 27, 2017

సూపర్ స్టార్ మహేష్ బాబు -సెన్సేషనల్ డైరెక్టర్ మురుగదాస్ కాంబినేషన్ లో మోస్ట్ ఎవైటింగ్ మూవీ గా తెరకెక్కిన ‘స్పైడర్’ ఈరోజే ప్రపంచవ్యాప్తంగా తమిళ్, తెలుగు, మలయాళ, అరబ్బీ భాషల్లో గ్రాండ్ గా రిలీజ్ అయింది..  వీరిద్దరి కాంబినేషన్ లో భారీ బడ్జెట్ తో రూపొందిన స్పైడర్ ఆడియన్స్ ను ఎలా ఎంటర్టైన్ చేసిందో..చూద్దాం..

కథ :

ఇంటలిజెన్స్ బ్యూరో లో పనిచేసే శివ(మహేష్ బాబు) అందరి కాల్స్ ట్రాప్ చేస్తూ తను రెడీ చేసుకున్న ఓ సాఫ్ట్ వేర్ ద్వారా సమాజంలో ఎక్కడ అన్యాయం జరిగితే అక్కడికెళ్లి ఎలాంటి తప్పు జరగకుండా అడ్డుపడుతుంటాడు.. అలా సాటి మనిషికి ఎటువంటి బాధ కలగకూడదనే వ్యక్తిత్వంతో ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ గా జీవితాన్నిగడిపే శివ, ట్రాప్ ద్వారా ఓ కాల్ వింటాడు.

అనుకోకుండా విన్న ఆ కాల్ శివ జీవితంలో ఓ పెద్ద మార్పు తీసుకొస్తుంది.. ఆ ఫోన్ కాల్ విన్న మరసటి రోజే శివ జీవితంలోకి వస్తాడు భైరవుడు… ఇంతకీ భైరవుడు ఎవరు ? అసలు శివకి భైరవుడికి మధ్య ఏం జరిగింది ? చివరికి శివ భైరవడుని ఎలా అంతమొందించి ప్రజల్ని కాపాడాడనేది సినిమా కథాంశం.

నటీనటుల పనితీరు :

ఇప్పటివరకూ ఎన్నో డిఫరెంట్ క్యారెక్టర్స్ తో ఎంటర్టైన్ చేసి ఆకట్టుకున్న మహేష్ బాబు సరికొత్త క్యారెక్టర్ తో మెస్మరైజ్ చేశాడు.. ముఖ్యంగా ఎమోషనల్ సీన్స్ లో మహేష్ పెర్ఫార్మెన్స్ అల్టిమేట్ అనే చెప్పాలి.  ఎస్.జె.సూర్య తన పెర్ఫార్మెన్స్ తో సినిమాకు మెయిన్ హైలైట్ గా నిలిచాడు. ముఖ్యంగా విలనిజంలో తన మార్క్ చూపించి నటుడిగా ది బెస్ట్ అనిపించుకున్నాడు. భరత్ తన పెర్ఫార్మెన్స్ తో మరో హైలైట్ గా నిలిచాడు. రకుల్ తన గ్లామర్ తో ఆకట్టుకుంది. ఇక నాగినీడు, షాయాజీ షిండే, ప్రియదర్శి, కృష్ణతేజ, వెన్నెల రామారావు తదితరులు తమ క్యారెక్టర్స్ కి పర్ఫెక్ట్ అనిపించుకున్నారు.

టెక్నీషియన్స్ పనితీరు:

టెక్నికల్ గా స్పైడర్.. ది బెస్ట్ అని చెప్పొచ్చు. ముఖ్యంగా సంతోష్ శివన్ ఫోటోగ్రఫీ, హారీస్ జయ రాజ్ బ్యాగ్రౌండ్ స్కోర్, పీటర్ హెయిన్స్ హాలీవుడ్ స్టాండర్డ్ ఫైట్స్, మురుగదాస్ మేకింగ్ స్టైల్, స్క్రీన్ ప్లే, శ్రీకర్ ప్రసాద్ ఎడిటింగ్, రామజోగయ్య శాస్త్రి లిరిక్స్ ఇలా ప్రతీ ఒక్కటి సినిమాకు హైలైట్ గా నిలిచి ఆడియన్స్ టెక్నీకల్ గా ఓ రేంజ్ లో మెస్మరైజ్ చేశాయి. ముఖ్యంగా హారీస్ జయరాజ్ కంపోజ్ చేసిన ‘బూమ్ బూమ్ ‘,’హాలీ హాలీ ‘, ‘సిసిలియా’, ‘అక్కడ ఉన్నవాడే’ సాంగ్స్ మ్యూజిక్ లవర్స్ ను బాగా ఆకట్టుకున్నాయి. ఇక సినిమాకు సంబంధించి ఖర్చు కు ఏమాత్రం వెనకడుగేయకుండా ప్రొడక్షన్ వాల్యూస్ తో శెభాష్ అనిపించుకున్నారు నిర్మాతలు.

జీ సినిమాలు సమీక్ష:

మురుగదాస్ సినిమాలంటే కచ్చితంగా ఓ స్ట్రాంగ్ మెసేజ్ ఉండాల్సిందే.. అలా ఫిక్స్ అయిపోయారు ఆడియన్స్.. ఇప్పటివరకూ ఆయన చేసిన ప్రతీ సినిమాలో ఏదో ఒక చక్కని మెసేజ్ అందించాడు ఈ స్టార్ డైరెక్టర్. తన మేకింగ్ స్టైల్ తో ఓ మెసేజ్ తో ఎంటర్టైన్మెంట్ సినిమాలు తెరకెక్కిస్తూ సెన్సేషనల్ హిట్స్ అందుకున్న మురుగదాస్ ఫస్ట్ టైం మహేష్ బాబుతో ఓ సినిమా చేస్తున్నాడనగానే ‘స్పైడర్’ పై భారీ అంచనాలు నెలకొన్నాయి. అయితే మహేష్ తో మురుగదాస్ ఎలాంటి మెసేజ్ తో సినిమా చేయబోతున్నాడనే క్యూరియాసిటీ తో నిన్నటి వరకూ వెయిట్ చేసిన ఆడియన్స్ కు అదిరిపోయే స్క్రీన్ ప్లే తో పాటు దర్శకుడిగా మంచి సందేశం అందించాడు మురుగదాస్.

ముఖ్యంగా సినిమా ద్వారా తను చెప్పాలనుకున్న పాయింట్ ను మొదటి నుంచి తన స్క్రీన్ ప్లే తో చెప్తూనే క్లైమాక్స్ లో వచ్చే ‘పరిచయం లేని వాళ్ళకి ఏమి ఆశించకుండా చేసే సాయమే మానవత్వం..” అంటూ ఫైనల్ గా సినిమా కథాంశాన్ని చెప్పాడు మురుగదాస్.  అలాగే డివైస్ లకు అతుక్కుపోతూ లైక్, షేర్ అనే ప్రపంచంలో బ్రతికేస్తున్న జనాలకు ‘పక్కనున్న మనిషిని లైక్ చెయ్యండి.. మనలోని ప్రేమను షేర్ చేయండి.’ అనే ఓ డైలాగ్ తో మానవత్వాన్ని బయటికి తీసుకురావాలంటూ తెలిపాడు. నిజానికి మహేష్ బాబు  ఇప్పటివరకూ చేసిన సినిమాల్లో ఇది ఓ డిఫరెంట్ సినిమా అనే చెప్పాలి. ఇప్పటివరకూ ఇలాంటి క్యారెక్టర్ తో మహేష్ మెసేజ్ అందించింది లేదు. సో మహేష్ నుంచి ఓ రెగ్యులర్ సినిమా ఎక్స్పెక్ట్ చేసి థియేటర్స్ కి వెళ్లే వాళ్ళకి ఈ సినిమా ఓ కొత్త అనుభూతి కలిగిస్తుందనే చెప్పాలి.

 మహేష్ క్యారెక్టర్, రకుల్ గ్లామర్, సాంగ్స్, బ్యాగ్రౌండ్ స్కోర్, మురుగదాస్ స్క్రీన్ ప్లే , ఎస్.జె.సూర్య పెర్ఫార్మెన్స్, మహేష్ – సూర్య మధ్య నడిచే మైండ్ గేమ్, ఇంటర్వెల్ బ్యాంగ్ , సెకండ్ హాఫ్ లో వచ్చే రోలర్ కోస్టర్ ఫైట్,  విలన్ దగ్గర నుంచి ఓ కుటుంబాన్ని చుట్టూ వున్న మహిళలతో కాపాడే సీన్స్, రాక్ ఎపిసోడ్, ప్రీ క్లైమాక్స్ సినిమాకు హైలైట్ గా నిలిచాయి. ఫైనల్ గా ‘స్పైడర్’ ఓ డిఫరెంట్ ఎంటర్టైనర్ గా ఆడియన్స్ కు ఓ కొత్త అనుభూతి కలిగిస్తుంది.

 

రేటింగ్ : 3.5/5