'శివలింగ' రివ్యూ

Friday,April 14,2017 - 08:24 by Z_CLU

విడుదల : ఏప్రిల్ 14th, 2017

నటీనటులు : రాఘవ లారెన్స్, రితిక సింగ్

సినిమాటోగ్రఫీ : సర్వేశ్ మురారి

మ్యూజిక్ : థమన్ ఎస్.ఎస్

మాటలు : శశాంక్ వెన్నెలకంటి

ప్రొడక్షన్ : అభిషేక్ ఫిలింస్

నిర్మాత : రమేష్ పిళ్ళై

రచన-స్క్రీన్-దర్శకత్వం : పి.వాసు

రాఘవ లారెన్స్‌, రితిక సింగ్ హీరోహీరోయిన్లుగా అభిషేక్ ఫిలింస్ బ్యాన‌ర్‌పై పి.వాసు ద‌ర్శ‌క‌త్వంలో ర‌మేష్ పి.పిళ్లై నిర్మించిన హారర్ సస్పెన్స్ థ్రిల్లర్ `శివ‌లింగ‌` ఈరోజే థియేటర్స్ లోకొచ్చింది.. ‘ముని’,’కాంచన’,’గంగ’ సినిమాలతో ఇప్పటికే తెలుగు ఆడియన్స్ ను ఎంటర్టైన్ చేసిన లారెన్స్ ఈ సినిమాతో ఎలా ఆకట్టుకున్నాడో చూద్దాం..


కథ :

ట్రైన్ లో ప్రయాణిస్తూ హఠాత్తుగా చనిపోయిన రహీం(శక్తి) కేస్ ను ఇంటరాగేషన్ చేయమని పవర్ ఫుల్ సీబీ-సీఐడీ ఆఫీసర్ శివలింగేశ్వర్(లారెన్స్) కు అప్పజెప్తారు కమిషనర్.. అలా కమిషనర్ ఆర్డర్ తో రహీం కేసును టేకప్ చేసిన శివలింగేశ్వర్ తన భార్య సత్యభామ(రితిక సింగ్)తో కలిసి వరంగల్ కి షిఫ్ట్ అవుతాడు. అలా రహీం కేసు ఇన్వెస్టిగేషన్ ప్రారంభించిన లింగేశ్వర్ ఆ కేసులో ఎలాంటి నిజాలు తెలుసుకున్నాడు..? చనిపోయిన రహీం బ్యాక్ గ్రౌండ్ ఏంటి.. ఫైనల్ గా శివలింగేశ్వర్ ఏం చేశాడు.. అనేది సినిమా కథాంశం..

నటీనటుల పనితీరు :

ఇప్పటికే హారర్ ఎంటర్టైనింగ్ సినిమాలతో తన మార్క్ నటనతో తెలుగు ప్రేక్షకులను మెస్మరైజ్ చేసిన లారెన్స్… మరోసారి ఈ సినిమాలోని లింగేశ్వర్ క్యారెక్టర్ తో సినిమాకు హైలైట్ గా నిలిచాడు. గురు సినిమాలో బాక్సర్ గా మెప్పించిన రితిక.. ఈ సినిమాలో తన పర్ఫార్మెన్స్ తో పాటు గ్లామర్ డోస్ కూడా చూపించింది. ఇక భాను ప్రియ, ఊర్వశి, వడివేలు, రాధారవి,అరుణ్,జయ ప్రకాష్, ప్రదీప్ రావత్ తమ క్యారెక్టర్స్ కి పూర్తి న్యాయం చేశారు…


టెక్నీషియన్స్ పనితీరు :

ఇలాంటి సస్పెన్స్ హారర్ సినిమాలకు ప్రాణం పోసేది బ్యాగ్రౌండ్ స్కోరే. ఆ బరువైన బాధ్యతను తమన్ వందకు వందశాతం పర్ ఫెక్ట్ గా పూర్తిచేశాడు. బ్యాగ్రౌండ్ స్కోర్ & సాంగ్స్ తో సినిమాకు హైలైట్ గా నిలిచాడు. ముఖ్యంగా కొన్ని హారర్ సీన్స్ లో తమన్ టాలెంట్ చూపించాడు. సర్వేశ్ మురారి సినిమాటోగ్రఫీ సినిమాకు మరో ప్లస్ గా నిలిచింది. మరో కీలకమైన అంశం ఎడిటింగ్ కూడా బాగా కుదిరింది. శశాంక్ వెన్నెలకంటి మాటలు ఎంటర్టైన్ చేశాయి. విజువల్ ఎఫెక్ట్స్ ఆకట్టుకున్నాయి. ఇలాంటి సినిమాల్ని హ్యాండిల్ చేయడంలో ఇప్పటికే పండిపోయిన దర్శకుడు పి.వాసు..మరో సారి  ఆసక్తికరమైన స్క్రీన్ ప్లేతో ఆకట్టుకున్నారు. ప్రొడక్షన్ వాల్యూస్ బాగున్నాయి.

జీ సినిమాలు సమీక్ష:

హారర్-సస్పెన్స్-థ్రిల్లర్ సినిమాలకు కేరాఫ్ అడ్రెస్ అయిపోయాడు లారెన్స్. తమిళ్ తో పాటు తెలుగులో కూడా సైమల్టేనియస్ గా హిట్స్ కొడుతూ హాట్ ఫేవరెట్ అనిపించుకుంటున్నాడు. లారెన్స్ నుంచి ప్రేక్షకులు ఏం ఆశిస్తున్నారో అవన్నీ శివలింగలో ఉన్నాయి.

గతంలో ‘చంద్రముఖి’ సినిమాతో ట్రెండ్ సెట్టర్ గా నిలిచిన దర్శకుడు పి.వాసు… ఈ సినిమాను కూడా ఆసక్తికరంగా తెరకెక్కించి ఆద్యంతం సస్పెన్స్ మెయింటైన్ చేసి మెప్పించారు.
రితికాను ఈ సినిమాలో  తీసుకోవాలని ఎందుకు అనుకున్నారో తెలియదు  కానీ, ఆమె నుంచి హండ్రెండ్ పర్సెంట్ పర్ఫార్మెన్స్ రాబట్టగలిగారు. దర్శకుడిగా పి.వాసు.. కొరియోగ్రాఫర్ గా లారెన్స్.. రితికను పర్ ఫెక్ట్ గా స్క్రీన్ పై ప్రజెంట్ చేశారు. గురు చూసిన తర్వాత శివలింగ సినిమా చూస్తే.. రితిక విషయంలో ఆడియన్స్ కచ్చితంగా సర్ ప్రైజ్ ఫీల్ అవుతారు.
హారర్ సీన్స్, ఫైట్స్, బ్యాగ్రౌండ్ స్కోర్, విజువల్ ఎఫెక్ట్స్, సాంగ్స్ పిక్చరైజేషన్, కామెడీ సీన్స్, పావురం కనిపించే సీన్స్, ఇంట్రెస్టింగ్ స్క్రీన్ ప్లే సినిమాలో హైలైట్స్ . మరీ ముఖ్యంగా ఆఖరి 30 నిమిషాల ఎపిసోడ్ సినిమాను నిలబెట్టింది.
పర్ ఫెక్ట్ స్టోరీలైన్, అదిరిపోయే స్క్రీన్ ప్లేతో ‘శివలింగ’ మూవీ అందర్నీ ఎంటర్టైన్ చేస్తుంది  చేస్తుంది.

 

రేటింగ్ : 3 /5