రివ్యూ - సలార్

Friday,December 22,2023 - 08:43 by Z_CLU

నటీనటులు: ప్రభాస్‌, పృథ్వీరాజ్‌ సుకుమారన్‌, శృతీహాసన్‌, జగపతిబాబు, ఈశ్వరీరావు, టినూ ఆనంద్‌, రామచంద్రరాజు తదితరులు

సంగీతం: రవి బస్రూర్‌

సినిమాటోగ్రఫీ: భువన గౌడ్‌

విడుదల తేది: డిసెంబర్‌ 22, 2023

నిడివి : 175 నిమిషాలు

నిర్మాతలు: విజయ్‌ కె.

దర్శకత్వం: ప్రశాంత్‌ నీల్‌

బాహుబలి 2 తర్వాత ప్రభాస్ నుండి వచ్చిన ‘ సాహో’, ‘ రాధే శ్యామ్ ‘, ‘ ఆదిపురుష్’ సినిమాలు ఆశించిన స్థాయిలో విజయం అందుకోలేకపోయాయి. అందుకే ప్రభాస్ అభిమానులు , మూవీ లవర్స్ అంతా ప్రభాస్ ,ప్రశాంత్ నీల్ కాంబో ‘ సలార్ ‘ మీద భారీ అంచనాలు పెట్టుకున్నారు. ప్రభాస్ కటౌట్ , ప్రశాంత్ నీల్ ఎలివేషన్స్ తో సలార్ మెప్పిస్తుంది ఊహించారు. మరి మాస్ ఎలివేషన్స్ తో ప్రభాస్ ఏ రేంజ్ లో మెప్పించాడు ? ఫైనల్ గా బ్లాక్ బస్టర్ సొంతం చేసుకున్నాడా? జీ సినిమాలు ఎక్స్ క్లూసివ్ రివ్యూ.

కథ :

ఆద్య(శృతిహాసన్‌) విదేశం నుంచి ఇండియా వస్తుంది. ఓబులమ్మ(ఝాన్సీ) మనుషుల నుంచి ఆద్యకి ప్రాణ హానీ ఉందని ఆమె తండ్రి ఆమెను బిలాల్‌(మైమ్‌ గోపీ) ద్వారా అస్సాంలో బొగ్గు గనుల్లో మెకానిక్ గా పనిచేసే దేవా(ప్రభాస్‌) దగ్గరకు పంపిస్తాడు. అతని తల్లి(ఈశ్వరీరావు)ఆ ప్రాంతంలోని పిల్లలకు పాఠాలు చెబుతూ జీవితాన్ని గడుపుతుంటారు. కొడుకు దేవా కాస్త లేట్‌గా ఇంటికి వచ్చినా..ఆమె భయపడుతుంది. అతని చేతిలో చిన్న ప్లాస్టిక్ కత్తి చూసి కూడా ఆందోళన చెందుతుంది.

ఆవిడ ఎందుకు అలా ప్రవర్తిస్తుంది? పాతికేళ్ల క్రితం ఖాన్సార్‌లో ఏం జరిగింది? అక్కడి నుంచి దేవా, అతని తల్లి ఎందుకు ఆస్సాంకి వచ్చారు? ఖాన్సార్‌ కర్త(జగపతి బాబు) రెండో భార్య కొడుకు వరద రాజమన్నార్‌(పృథ్వీరాజ్‌ సుకుమారన్‌)ను చంపాలని కుట్ర చేసిందెవరు?  ఆ కుట్రను ఎదుర్కొనేందుకు వరద రాజమన్నార్‌ ఏం చేశాడు? స్నేహితుడు దేవాని మళ్లీ ఖన్సార్‌కి తీసుకొచ్చిన తర్వాత ఏం జరిగింది?  ప్రాణ స్నేహితుడు వరద రాజమన్నార్‌ కోసం దేవా ఏం చేశాడు? ఆద్య ఎవరు?  ఓబులమ్మ మనుషులు ఆమెను చంపాలని ఎందుకు ప్రయత్నిస్తున్నారు?  ఆద్యకు దేవా ఎందుకు రక్షణగా నిలబడ్డాడు. ఖన్సార్‌ ప్రాంతం నేపథ్యం ఏంటి? అనేది తెలియాలంటే సలార్‌ చూడాల్సిందే.

నటీ నటుల పనితీరు :

ప్రభాస్ తన కటవుట్ తో మాస్ ఎలివేషన్స్ కి గూస్ బంప్స్ తెప్పించాడు. కోపాన్ని కంట్రోల్ చేసుకునే దేవాగా మెప్పిస్తో యాక్షన్ ఎపిసోడ్స్ లో విధ్వంసం చేసే పవర్ ఫుల్ మెన్ గా మేస్మరైజ్ చేశాడు. సినిమాలో ప్రభాస్ ఎక్కువగా మాట్లాడడు, భారీ డైలాగులు చెప్పాడు. ఇది తన అభిమానులను కొంచెం నిరాశ పరచొచ్చు. శృతి హాసన్ కథకి కీలకమైన అమెరికా నుంచి వచ్చి ఆపదలో ఇరుక్కున్న అమ్మాయిగా బాగా నటించింది. పృథ్విరాజ్ సుకుమారన్ చాలా సెటిల్డ్ క్యారెక్టర్ తో మెప్పించాడు. జగపతి బాబు, బాబీ సింహ, టిన్ను ఆనంద్, మైమ్ గోపి, ఈశ్వరరావు, శ్రియ రెడ్డి, ఝాన్సీ.. అందరూ తమ పాత్రల్లో ఒదిగిపోయి నటించారని చెప్పొచ్చు.

 

సాంకేతిక వర్గం పనితీరు :

రవి బస్రూర్ మ్యూజిక్ సినిమాను ఊహించని విధంగా ఎలివేట్ చేశాయి. సెకండాఫ్ లో బీజీఎం బాగుంది. భువన్ గౌడ సినిమాటోగ్రఫి మరో ప్రధాన ఎట్రాక్షన్ గా నిలిచింది. కథ పరంగా కోల్ మైనింగ్ కాబట్టి కేజీఎఫ్ కలర్ టోన్ నే ఫాలో అయ్యారు. యాక్షన్ సీక్వెన్స్ సినిమాకు మెయిన్ హైలెట్ గా నిలిచాయి. ఆర్ట్ వర్క్ బాగుంది. హోంబలే ప్రొడక్షన్ వేల్యూస్ గ్రాండియర్ గా కనిపిస్తూ సినిమా క్వాలిటీని పెంచాయి.

జీ సినిమాలు సమీక్ష :

చిన్నతనంలో దేవా,వరద రాజమన్నార్ ఫ్రెండ్షిప్ సన్నివేశాలతో సింపుల్ గా సినిమాను మొదలు పెట్టిన దర్శకుడు ప్రశాంత్ నీల్ ఆ ఎపిసోడ్ లో దేవా ఎంత మొండితనం కలిగిన బలవంతుడో చూపిస్తూ ఎలివేషన్ ఇచ్చాడు. ఆ తర్వాత దేవాను తీసుకొని అతని తల్లి ఖాన్సార్ ఎక్కడో దూరంగా ఎవరికీ తెలియకుండా అస్సాంలో ఓ పల్లెటూరిలో బొగ్గు గనుల ప్రాంతంలో బతకడం, హీరో చాలా ప్రశాంతంగా ఉండటం, హీరో చేతిలో ప్లాస్టిక్ కత్తి చూసినా తల్లి భయపడటంతో ఖాన్సార్ లో ఏం జరిగింది అసలు దేవా ఎవరు ? అతను ఎందుకు ఎవరు ఏమన్నా సైలెంట్ గా వెళ్లిపోతుంటాడు? అనే ఆసక్తి నెలకొల్పుతూ కథను నడిపించాడు. విదేశాల నుండి తండ్రి కి కూడా తెలియకుండా ఇండియా తిరిగి వచ్చిన ఆధ్య ను ఇండియా లో ఒక్కరే కాపాడ గలడు అంటూ ఆమె తండ్రి దేవా దగ్గరికి పంపించడం దేవా పాత్రను బాగా ఎలివేట్ చేశాడు. ఇంటర్వెల్ వరకూ సైలెంట్ గా ఉండే దేవా పాత్రతో ఇంటర్వెల్ బ్యాంగ్ లో యాక్షన్ ఎపిసోడ్ తో విధ్వంసం సృష్టించింది మాస్ ప్రేక్షకులకు అక్కడి నుండి గూస్ బాంప్స్ తెప్పించే యాక్షన్ బ్లాక్స్ తో మెప్పించాడు ప్రశాంత్ నీల్. ప్రభాస్ కటవుట్ ను పర్ఫెక్ట్ గా వాడుకొని దేవా పాత్ర తాలూకు ఎలివేషన్స్ తో మేజిక్ చేశాడు. సెకండాఫ్ లో వచ్చే భారీ యాక్షన్ తో కూడిన సీక్వెన్స్ లు టికెట్టు కొన్న ప్రేక్షకులను పూర్తిగా సాటిస్ఫై చేస్తాయి. ముఖ్యంగా మాస్ ప్రేక్షకులను సినిమాలో ఉన్న యాక్షన్ బాగా ఆకట్టుకుంటుంది. దేవా ఫ్లాష్ బ్యాక్ ను ఆధ్య కి బిలాల్ తో చెప్పిస్తూ మంచి ఎలివేషన్స్ ప్లాన్ చేసుకొని మేజిక్ చేశాడు ప్రశాంత్ నీల్. అయితే మొదటి భాగంలో దేవా తల్లి ఊరి కోసం టీచర్ అవతారం మెత్తడం, దేవా బొగ్గు గనుల్లో మెకానిక్ గా పనిచేస్తూ వచ్చే సీన్స్ కాస్త బోర్ కొట్టిస్తాయి కానీ ప్రీ ఇంటర్వల్ యాక్షన్ నుండి సినిమా గ్రాఫ్ పెరుగుతుంది.. ఇంటర్వెల్ బ్లాక్ తో మైండ్ బ్లాక్ చేసి హై ఓల్టేజ్ యాక్షన్ చూపించి మంచి మార్కులు కొట్టేశాడు ప్రశాంత్ నీల్.
ఇక సెకండ్ హాఫ్ అంతా ఫ్లాష్ బ్యాక్ తో కథను నడిపించాడు. చిన్నప్పుడు దేవాని వదిలేసిన వరద రాజమన్నార్ వచ్చి దేవాని మళ్లీ పాతికేళ్ల తర్వాత సహాయం అడగడం, వరద రాజమన్నార్ రాజు కాకుండా అక్కడ ఉన్న వాళ్లంతా అడ్డుకోవడం, వాళ్ళతో దేవా పోరాడటంతో సెకండ్ హాఫ్ ఆసక్తిగా సాగుతుంది. అయితే ఖాన్సార్ ప్రపంచంలో వాడే పేర్లు, నిభందనలు, పాత్రలు కొత్తగా అనిపిస్తాయి. ఒక రకంగా ఆ ఫ్లాష్ బ్యాక్ అంతా కెజీఎఫ్ ను గుర్తు చేస్తుంది. కొన్ని సందర్భాల్లో దేవా కోపాన్ని వరద కంట్రోల్ చేస్తూ వచ్చే సన్నివేశాలు ఛత్రపతి ను గుర్తు చేస్తాయి. అలాగే దేవా తన మిత్రుడి మీద చెయ్యి వేసిన వ్యక్తి తల నరకడం బాహుబలి లో గూస్ బంప్స్ తెచ్చే సీన్ ను గుర్తు చేసింది. ఓవరాల్ గా యాక్షన్ సీన్స్ లో మాత్రం ప్రభాస్ అదరగొట్టేశాడు. రాధే శ్యామ్, ఆది పురుష్ లాంటి క్లాస్ కంటెంట్ చూసిన ప్రేక్షకులకు ప్రభాస్ ను మరణ మాస్ గా చూపిస్తూ తెరకెక్కిన సలార్ మెప్పిస్తుంది. , చివర్లో అదిరిపోయే క్లైమాక్స్ ట్విస్ట్ ఇచ్చి అందర్నీ ఆశ్చర్యపరిచాడు ప్రశాంత్ నీల్. దీంతో పార్ట్ 2 పై ప్రేక్షకుల్లో బాగా ఆసక్తి పెరిగింది. ఆ ట్విస్ట్ తో సెకండ్ పార్ట్ కి ఒక్కసారిగా ఫుల్ హైప్ ఇచ్చారు. ఫస్ట్ హాఫ్ లో తల్లి – కొడుకు ఎమోషన్స్ , సెకండ్ హాఫ్ లో ఫ్రెండ్స్ ఎమోషన్ కూడా కనెక్ట్ అయ్యి ఇంకాస్త వర్కౌట్ అయితే బెటర్ గా ఉండేది. ఓవరాల్ గా సలార్ మాస్ కంటెంట్ తో మెప్పిస్తుంది. ప్రభాస్ మాస్ తో టికెట్టు కి న్యాయం జరుగుతుంది.

 

రేటింగ్ : 3 /5