సాహసం శ్వాసగా సాగిపో రివ్యూ

Friday,November 11,2016 - 03:32 by Z_CLU

 టైటిల్ : సాహసం శ్వాసగా సాగిపో

నటీ నటులు : నాగ చైతన్య, మంజిమ మోహన్, రాకేందు మౌళి, బాబా సెహగల్ నాగినీడు తదితరులు

డైలాగ్స్ : కోన వెంకట్

సినిమాటోగ్రఫీ : డాన్ మాక్ ఆర్థర్

మ్యూజిక్ : ఏ.ఆర్.రెహ్మాన్

నిర్మాత  : మిర్యాల రవీందర్

కథ-దర్శకత్వం : గౌతమ్ మీనన్

విడుదల : 11 నవంబర్ 2016

కొన్ని నెలలుగా పోస్ట్ పోన్ అవుతూ ప్రేక్షకుల్లో ఆసక్తి  పెంచిన ‘సాహసం శ్వాసగా సాగిపో’ ఎట్టకేలకు థియేటర్స్ లోకొచ్చింది. గతంలో  ‘ఏ మాయ చేసావే’ వంటి సూపర్ హిట్ కాంబినేషన్ లో తెరకెక్కిన ఈ చిత్రం ప్రేక్షకులను ఏ మేరకూ అలరిస్తుందో? చూద్దాం

saahasam-swasaga

కథ :-

చదువు పూర్తి చేసుకున్న రజినికాంత్(నాగ చైతన్య) అనే యువకుడు తన చెల్లెలి ఫ్రెండ్ లీల (మంజిమ)ను ప్రేమిస్తాడు. ఒకానొక సందర్భంలో ఇద్దరూ కలిసి టూర్ వెళ్తారు? అలా రోడ్ ట్రిప్ కు వెళ్లిన రజినికాంత్ తన ప్రియురాలు ఆపదలో ఉందని తెలుసుకొని తనని, వారి కుటుంబాన్ని కాపాడానికి ఎలాంటి సాహసం చేశాడు? లీల కుటుంబానికి వచ్చిన ముప్పు ఏంటి? చివరికి రజినికాంత్ ఆ మిస్టరీని ఎలా ఛేదించాడు? అనేది చిత్ర కథాంశం..

 

నటీనటుల పనితీరు :-

సాధారణ యువకుడిగా ఎంతటి సాహసానికైనా ఒడిగట్టే పాత్రలో నాగచైతన్య నటన బాగుంది. మెచ్యూరిటీ నటనతో సినిమాకు హైలైట్ గా నిలిచాడు. తాజాగా వచ్చిన ప్రేమమ్ సినిమాకు, ఈ మూవీకి చక్కగా వేరియేషన్స్ చూపించగలిగాడు. ఈ రెండు సినిమాల్లో రెండు వేరియేషన్స్ కనిపిస్తాయి. మరీ ముఖ్యంగా ఫస్టాఫ్ లో చైతూ పర్ ఫార్మెన్స్ పీక్స్. తనకు ఎంతో అలవాటైన లవర్ బాయ్ క్యారెక్టర్ ను అద్భుతంగా పండించాడు. ప్రతి అమ్మాయి.. తనకూ ఇలాంటి ఓ లవర్ ఉంటే బాగుండు అని ఫీలయ్యేలా చేశాడు. హీరోయిన్ మంజిమా మోహన్… తెలుగులో చేసిన తొలి సినిమాతోనే ఆకట్టుకుంది. రచయిత కావాలనుకునే లీల పాత్రలో మంజిమ నటన, అందం రెండూ ఎట్రాక్ట్ చేస్తాయి. నాగ చైతన్య స్నేహితుడి పాత్రలో రాకేందు మౌళి అలరించాడు. కొన్ని సన్నివేశాల్లో తన డైలాగ్ డెలివరీ తో నవ్వించాడు. ఇక అవినీతి పోలీస్ పాత్రలో బాబా సెహగల్ తో పాటు… మిగతా నటీనటులందరూ తమ పాత్రలకు న్యాయం చేశారు.

 

టెక్నీషియన్స్ పనితీరు :-

ఈ సినిమాకు పనిచేసిన టెక్నీషియన్స్ గురించి చెప్పాలంటే ముందుగా ఏ.ఆర్.రెహ్మాన్ గురించి చెప్పాలి. తన మ్యూజిక్ తో ఆర్.ఆర్ తో సినిమాకు హైలైట్ గా నిలిచాడు రెహమాన్. విడుదల ఇంత ఆలస్యమైనప్పటికీ… ప్రేక్షకుల్లో మూవీపై ఆసక్తి తగ్గలేదంటే దానికి కారణం రెహ్మాన్ మేజిక్కే. ‘తానూ నేను’,’చెకోరి’ పాటలకు సాహిత్యం బాగుంది.  ఈ సినిమాకు డాన్ సినిమాటోగ్రఫీ కూడా ప్లస్. ముఖ్యంగా కన్యాకుమారి లొకేషన్స్, సెకండ్ హాఫ్ లో కొన్ని యాక్షన్ సీన్స్ లో  సినిమాటోగ్రఫీ బాగుంది. మాటలు ఆకట్టుకున్నాయి. ఎడిటింగ్ ఫర్వాలేదు.

swasaga-sagipo-resized

జీ సినిమాలు సమీక్ష :-

గతంలో ప్రేమ కథలు, యాక్షన్ సినిమాలతో దర్శకుడిగా మంచి గుర్తింపు అందుకున్న గౌతమ్ మీనన్ ఈ చిత్రాన్ని ప్రేమ , యాక్షన్  రెండు కలగలిపి తెరకెక్కించి  ఓ ప్రయోగం చేసాడు. ఫస్ట్ హాఫ్ లో తన స్టయిల్ ఆఫ్ లవ్ సీన్స్ ను చూపించి అలరించిన దర్శకుడు… సెకండ్ హాఫ్ లో కొన్ని యాక్షన్ సీన్స్ లో కూడా తన టాలెంట్ చూపించాడు. క్లైమాక్స్ తో కాస్త బోర్ కొట్టించినప్పటికీ… ఓవరాల్ గా చైతూ-గౌతమ్ మీనన్ కాంబినేషన్ నుంచి ఎక్స్ పెక్ట్ చేసిన స్టఫ్ నే అందించాడు. ఫస్ట్ హాఫ్ లో లవ్ సీన్స్ ప్రేక్షకులను బాగా అలరిస్తాయి. ముఖ్యంగా నాగ చైతన్య-మంజిమ మధ్య వచ్చే లవ్ సీన్స్, టూర్ కి వెళ్లే సీన్స్, సెకండ్ హాఫ్ లో కొన్ని యాక్షన్ ఎపిసోడ్స్ సినిమాకు ప్లస్. ఈ సినిమాకు రెహ్మాన్ అందించిన పాటలు మ్యూజిక్ లవర్స్ కి  ఒక ట్రీట్ అనే చెప్పాలి. మొదటి భాగం లో ఒక సాధారణ యువకుడిగా కనిపించిన నాగ చైతన్య సెకండ్ హాఫ్ యాక్షన్ సీన్స్ లో తనలోని రఫ్ యాంగిల్ ను చూపించాడు. క్లైమాక్స్ లో పోలీస్ పాత్ర లో చైతూ ఎంట్రీ బాగుంది.  ఫస్ట్ హాఫ్ లో లవ్ సీన్స్, సాంగ్స్ , సెకండ్ హాఫ్ లో కొన్ని యాక్షన్ సీన్స్ కోసం సాహసం శ్వాసగా సాగిపో సినిమాను కచ్చితంగా చూడొచ్చు…

 

రేటింగ్ : 3/5