రోగ్ రివ్యూ

Friday,March 31,2017 - 05:04 by Z_CLU

రిలీజ్ డేట్ : మార్చి 31, 2017

నటీనటులు : ఇషాన్, మన్నారా చోప్రా, ఏంజెలా

మ్యూజిక్ : సునీల్ కశ్యప్

సినిమాటోగ్రఫీ : ముఖేష్‌.జి

ఎడిటర్‌: జునైద్‌ సిద్ధిఖీ

నిర్మాతలు: సి.ఆర్‌.మనోహర్‌, సి.ఆర్‌.గోపి

కథ-మాటలు- స్క్రీన్ ప్లే- దర్శకత్వం: పూరి జగన్నాథ్‌

యంగ్‌ హీరో ఇషాన్‌ను హీరోగా పరిచయం చేస్తూ పూరి జగన్నాథ్ తెరకెక్కించిన చిత్రం ‘రోగ్‌'(మరో చంటిగాడి ప్రేమకథ). తెలుగు-కన్నడ భాషల్లో ఒకేసారి రూపొందిన ఈ సినిమా థియేటర్లలోకొచ్చింది.

 

కథ :

అంజలి(ఏంజెలా) అనే అమ్మాయిని ప్రేమించి, మోసపోయి ఆ అమ్మాయి వల్ల జైలుకెళ్లిన రోగ్(ఇషాన్) జైలు నుంచి తిరిగొచ్చి తనవల్ల నష్టపోయిన ఓ కుటుంబానికి అండగా నిలుస్తాడు. తన కుటుంబానికి అండగా నిలవడంతో  రోగ్ ప్రేమలో పడుతుంది అంజలి(మన్నార చోప్రా). అసలు రోగ్ జైలుకెళ్లడానికి కారణమేంటి? ఇంతకీ రోగ్ వల్ల ఆ కుటుంబానికి ఎలాంటి నష్టం జరిగింది. చివరికి అంజలి ని రోగ్ ప్రేమించాడా..అనేది సినిమా కథాంశం..

నటీనటుల పనితీరు :

రోగ్ అనే డిఫరెంట్ క్యారెక్టర్ తో తొలి సినిమాతోనే యాక్టింగ్ పరంగా బెస్ట్ అనిపించుకున్నాడు ఇషాన్. ముఖ్యంగా ఫైట్స్ సీక్వెన్స్ లో ఓ కమర్షియల్ హీరోను తలపించాడు. మన్నారా చోప్రా, ఏంజెలా తమ గ్లామర్ తో ఎంటర్టైన్ చేశారు. సైకో క్యారెక్టర్ తో విలన్ గా ఆకట్టుకున్నాడు అనూప్ సింగ్ ఠాకూర్. అలీ కామెడీ పరవాలేదు. ఇక అజాజ్ ఖాన్, సత్య, సుబ్బరాజు, అవినాష్, తులసి తదితరులు తమ క్యారెక్టర్స్ కి న్యాయం చేశారు.

టెక్నీషియన్స్ పనితీరు :

సినిమాకు పనిచేసిన టెక్నీషియన్స్ లో ముందుగా చెప్పుకోవాల్సింది మ్యూజిక్ డైరెక్టర్ సునీల్ కశ్యప్ గురించే. సాంగ్స్, బ్యాగ్రౌండ్ స్కోర్ తో సినిమాకు హైలైట్ గా నిలిచాడు. సినిమాటోగ్రఫీ బాగుంది. పూరి మార్క్ పంచ్ డైలాగ్స్ ఎంటర్టైన్ చేశాయి. ఎడిటింగ్ పరవాలేదు. ప్రొడక్షన్ వాల్యూస్ బాగున్నాయి.

 

జీ సినిమాలు సమీక్ష :

పూరి ఓ హీరోను పరిచయం చేస్తున్నాడంటే ఆ హీరో కచ్చితంగా డిఫరెంట్ లుక్, పంచ్ డైలాగ్స్ తో ఎంటర్టైన్ చేస్తాడని వేరే చెప్పనక్కర్లేదు. ఇషాన్ కూడా పూరి మార్క్ హీరోయిజం,  డైలాగ్స్ కు బాగా సింక్ అయిపోయాడు. లుక్ ,పెర్ఫార్మెన్స్ విషయంలో కూడా హీరోగా మంచి మార్కులే అందుకున్నాడు. ఇక స్టోరీ విషయానికొస్తే, ఫస్ట్ హాఫ్ లో తన మార్క్ స్క్రీన్ ప్లే తో ఎంటర్టైన్ చేసి సెకండ్ హాఫ్ లో విలన్ క్యారెక్టర్ తో కాస్త బోర్ కొట్టించాడు పూరి. ఓ కొత్త హీరోను పరిచయం చేస్తున్నప్పుడు దర్శకుడిగా తీసుకోవాల్సిన అన్ని జాగ్రత్తలు తీసుకున్నప్పటికీ స్టోరీ, స్క్రీన్ ప్లే విషయంలో పూరి ఇంకాస్త ఫోకస్ పెట్టి ఉంటే బాగుండేది. మరో చంటిగాడి ప్రేమకథ  అంటూ ‘రోగ్’ సినిమాను భారీగా ప్రమోట్ చేయడంతో పూరి మార్క్ లవ్ స్టోరీ అనుకుని థియేటర్స్ కు వెళ్లే ఆడియన్స్ కాస్త నిరుత్సాహపడటం ఖాయం. ఇషాన్ క్యారెక్టర్, సాంగ్స్, డైలాగ్స్, కొన్ని కామెడీ సీన్స్ సినిమాకు హైలైట్స్ గా నిలవగా రొటీన్ స్టోరీ, స్క్రీన్ ప్లే, సెకండ్ హాఫ్ లో కొన్ని బోరింగ్ సీన్స్ సినిమాకు మైనస్ గా నిలిచాయి. ఓవరాల్ గా ఫక్తు కమర్షియల్ సినిమా ఇష్టపడే వారికి రోగ్ పరవాలేదనిపిస్తాడు.

రేటింగ్ : 2/5