Movie Review - '99 సాంగ్స్'

Friday,April 16,2021 - 03:19 by Z_CLU

టాప్ మ్యూజిక్ డైరెక్టర్ AR రెహ్మాన్ నిర్మాతగా మారి చేసిన ’99 సాంగ్స్’ ఈరోజే థియేటర్స్ లోకి ఎంట్రీ ఇచ్చింది. ఈ సినిమాకి కథ కూడా అందించాడు రెహ్మాన్. చిన్నతనం నుండి మ్యూజిక్ మీద ఆసక్తి పెంచుకొని ఫైనల్ గా రాక్ స్టార్ గా మారిన జయ్… సోఫియా అనే అమ్మాయి ప్రేమలో పడతాడు. అయితే సోఫియాని తనకిచ్చి పెళ్లి చేయాలంటే మ్యూజిషియన్ గా వంద పాటలు క్రియేట్ చేయమని ఛాలెంజ్ విసురుతాడు…ఆ ప్రయత్నంలో భాగంగా జయ్ ఎలాంటి కసరత్తు చేశాడు. ఫైనల్ గా 99 పాటలు పూర్తి చేసి వందో పాటతో ఎలా సెన్సేషన్ అయ్యాడనేది కథాంశం.

అయితే కథ పరంగా బాగున్నా కథనం మాత్రం కుదరలేదు. ముఖ్యంగా ఇలాంటి మ్యూజికల్ కాన్సెప్ట్ సినిమాకు పర్ఫెక్ట్ స్క్రీన్ ప్లే రాసుకోవాలి. రిలీజ్ కి ముందే సాంగ్స్ ని జనాలకి రీచ్ అయ్యేలా ప్రమోట్ చేసుకోవాలి. ఈ రెండు విషయాల్లో మేకర్స్ వర్కౌట్ చేయలేకపోయారు. కాకపోతే హాలీవుడ్ సినిమా స్టైల్ లో ఉండే మేకింగ్ ఎట్రాక్ట్ చేస్తుంది.

టెక్నికల్ గా సినిమాటోగ్రఫీ , మ్యూజిక్ సినిమాకు హైలైట్ అని చెప్పొచ్చు. ఇక కొన్ని సీన్స్ ని అలాగే ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ ని బాగా హ్యాండిల్ చేశాడు విశ్వంత్ కృష్ణమూర్తి. కాకపోతే ఈ మ్యూజికల్ లవ్ స్టొరీ ని అందరినీ ఆకట్టుకునేలా తెరకెక్కించడంలో విఫలమయ్యాడు. అయితే సినిమా అంతా ఓ డార్క్ మూడ్ లో నడిపించడం కూడా సినిమాకు మైనస్. మ్యూజిక్ పరంగా సినిమా బెస్ట్ అని చెప్పొచ్చు కానీ స్లో నెరేషన్, ఎంగేజింగ్ గా లేకపోవడం, బలమైన సన్నివేశాలు లేకపోవడం సినిమాకు ప్రధాన బలహీనతలు.

హీరో ఇహాన్ భట్ , ఎడిస్లీ వర్గాస్ ఇద్దరూ తమ క్యారెక్టర్స్ కి బెస్ట్ పర్ఫార్మెన్స్ ఇచ్చారు. అలాగే హీరో తల్లిదండ్రులుగా నటించిన కురూష్, వరీనా బాగా నటించారు. హీరో ఫ్రెండ్ క్యారెక్టర్ చేసిన టెంజింగ్ కూడా మంచి నటన కనబరిచాడు. ఓవరాల్ గా మ్యూజికల్ లవ్ స్టోరీ గా తెరకెక్కిన 99 సాంగ్స్ పూర్తి స్థాయిలో మెప్పించదు, కానీ మ్యూజిక్ టేస్ట్ ఉన్న వారిని, హాలీవుడ్ స్టైల్ టేకింగ్ ఇష్టపడే వారిని మాత్రం కొంత వరకూ ఆకట్టుకుంటుంది.

రేటింగ్ : 2 / 5

 

  • – Follow Us for Latest Telugu Zee Cinemalu News and upcoming trending
    stories, Gossips, Actress Photos and Special topics