'రంగుల రాట్నం' రివ్యూ

Sunday,January 14,2018 - 01:40 by Z_CLU

నటీ నటులు : రాజ్‌తరుణ్‌, చిత్రా శుక్లా, సితార, ప్రియదర్శి తదితరులు

సంగీతం : శ్రీచరణ్‌ పాకాల

సినిమాటోగ్రఫీ : ఎల్‌.కె.విజయ్‌

ఎడిటింగ్‌ : శ్రీకర్‌ప్రసాద్‌

ఆర్ట్‌ : పురుషోత్తం ఎం

నిర్మాణం : అన్నపూర్ణ స్టూడియోస్‌

కథ మాటలు–  స్క్రీన్ ప్లే – దర్శకత్వం: శ్రీరంజని

రిలీజ్ డేట్ : 14 జనవరి 2017

‘రారండోయ్‌ వేడుకచూద్దాం’, ‘హలో’ వంటి సూపర్‌హిట్‌ చిత్రాలను అందించిన అన్నపూర్ణ స్టూడియోస్‌ నుంచి సంక్రాంతి కానుకగా వచ్చిన చిత్రం ‘రంగుల రాట్నం’. రాజ్‌ తరుణ్‌, చిత్రా శుక్లా జంటగా యూత్ ఫుల్ & ఫ్యామిలీ ఎంటర్ టైనర్ గా తెరకెక్కిన ఈ సినిమాతో శ్రీరంజని దర్శకురాలిగా పరిచయమైంది. మరి సంక్రాంతి బరిలో చివరి సినిమాగా విడుదలైన ఈ సినిమా ప్రేక్షకులను ఎలా ఎంటర్ టైన్ చేసిందో..చూద్దాం

కథ :

ఒక క్రియేటివ్ కంపెనీ లో ఉద్యోగిగా పనిచేసే మిడిల్ క్లాస్ అబ్బాయి విష్ణు(రాజ్ తరుణ్).. చిన్నతనంలోనే తన నాన్నని కోల్పోవడంతో అమ్మే(సితార)  తన జీవితంగా జీవిస్తుంటాడు. ఓ ఈవెంట్ కంపెనీలో పనిచేస్తూ జాగ్రత్తకి బ్రాండ్ అంబాసిడర్ లా ఉండే కీర్తి(చిత్ర శుక్లా)ని తొలిచూపులోనే ప్రేమిస్తాడు. తను ప్రేమించిన విషయాన్ని  అమ్మతో చెప్పి కీర్తికి  చెప్పలనుకుంటూ చెప్పలేకపోతుంటాడు. అలాంటి టైమ్ లో అనుకోని ఓ సంఘటన విష్ణు జీవితాన్ని మలుపు తిప్పుతుంది. ఆ టైంలో  విష్ణుకి దగ్గరవ్తుంది కీర్తి. అలా ప్రియురాలిగా తన జీవితంలోకి ఎంటర్ అయిన కీర్తి తన అతి జాగ్రత్త వల్ల విష్ణుకి కోపం తెప్పిస్తుంటుంది. ఈ క్రమంలో విష్ణు  అమ్మ ప్రేమ- అమ్మాయి ప్రేమ ఒకటే అని ఎలా తెలుసుకున్నాడు అనేది సినిమా కథాంశం.

 

నటీనటుల పనితీరు :

రాజ్ తరుణ్ తన ఎనర్జిటిక్, నేచురల్ పెర్ఫార్మెన్స్ తో సినిమాకు మెయిన్ హైలైట్ గా నిలిచాడు. కొన్ని సందర్భాల్లో ఎమోషనల్ సీన్స్ లో తనలో నటనని మరోసారి  బయట పెట్టాడు.  చిత్ర శుక్ల తన పెర్ఫార్మెన్స్ తో క్యారెక్టర్ కి పర్ఫెక్ట్ అనిపించుకొని ఆకట్టుకుంది. అమ్మ క్యారెక్టర్ లో సితార బెస్ట్ అనిపించుకుంది. ప్రియదర్శి తన కామెడి టైమింగ్ తో ఎంటర్ టైన్ చేశాడు. రవి ప్రకాష్, స్వప్న  మిగతా నటీనటులు తన క్యారెక్టర్స్ తో పరవలేదనిపించుకున్నారు.

 

టెక్నిషియన్స్ పని తీరు :

సినిమాకు పనిచేసిన టెక్నిషియన్స్ లో ముందుగా చెప్పుకోవాల్సింది మ్యూజిక్ డైరెక్టర్ శ్రీచరణ్ పాకాల గురించే. ఒక క్యూట్ లవ్ ఎంటర్ టైనర్ కి పర్ఫెక్ట్ సాంగ్స్ అందించాడు శ్రీ చరణ్. ‘ఎన్నో ఎన్నో’,’ఏమైంది బుజ్జి కన్నా’,’అరేయ్ విష్ణు’ సాంగ్స్ బాగా ఆకట్టుకున్నాయి. ఎమోషనల్ సీన్స్ ను తన బాగ్రౌండ్ స్కోర్ తో బాగా ఎలివేట్ చేసి సినిమాకు ప్లస్ అయ్యాడు. ఎల్‌.కె.విజయ్‌ సినిమాటోగ్రఫీ బాగుంది. పాటల పిక్చరైజేషన్ బాగుంది. ఎడిటింగ్ పరవాలేదు. కొన్ని సందర్భాల్లో వచ్చే డైలాగ్స్ ఆకట్టుకున్నాయి.  శ్రీ రంజని డైరెక్షన్-స్క్రీన్ ప్లే బాగుంది. అన్నపూర్ణ స్టూడియోస్ ప్రొడక్షన్ వాల్యూస్ బాగున్నాయి.

జీ సినిమాలు సమీక్ష :

సంక్రాంతికి ఎన్ని పెద్ద సినిమాలోచ్చినా మినిమం బడ్జెట్ సినిమాలకు కూడా ప్లేస్ ఉంటుంది. గత కొన్నేళ్లుగా కొన్ని బడా సినిమాలతో పాటు చిన్న సినిమాలు కూడా సంక్రాంతి పోటీలో నిలిచి సూపర్ హిట్స్ అందుకున్నాయి. అందుకే ఈ సినిమాను హఠాత్తుగా సంక్రాంతి బరిలో దింపాడు నిర్మాత నాగార్జున. అయితే  సంక్రాంతికి పవన్ కళ్యాణ్, బాలకృష్ణ, సూర్య వంటి బిగ్ స్టార్స్ థియేటర్స్ లో హంగామా చేసినప్పటికీ అన్నపూర్ణ స్టూడియోస్ బ్యానర్ లో లవ్ ఎంటర్ టైనర్ గా తెరకెక్కిన రంగులరాట్నంపై ఓ మోస్తరు అంచనాలున్నాయి. ముఖ్యంగా ఫస్ట్ లుక్ పోస్టర్ తో పాటు ట్రైలర్ కూడా సినిమాపై హైప్ పెంచింది.

ఇక సినిమా విషయానికొస్తే… కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ సెల్వ రాఘవన్ దగ్గర కొన్నేలుగా డైరెక్షన్ డిపార్ట్ మెంట్ లో పనిచేసి ఈ సినిమాతో దర్శకురాలిగా పరిచయం అయింది శ్రీరంజని.  దర్శకురాలిగా మొదటి సినిమాకు ఒక మంచి పాయింట్ సెలెక్ట్ చేసుకున్న శ్రీరంజని తన స్క్రీన్ ప్లేతో ఎంటర్ టైన్ చేసింది. ముఖ్యంగా రాజ్ తరుణ్ – చిత్ర క్యారెక్టర్స్ ను చక్కగా తీర్చిదిద్దారు. మొదటి సినిమా అయినప్పటికీ  ప్రీ ఇంటర్వెల్ లో వచ్చే ఎమోషనల్ సీన్స్ ని దర్శకురాలిగా బాగా డీల్ చేసింది. ‘అమ్మ మనల్ని ఏదైనా అంటే దులిపేసుకుని వెళ్ళిపోతాం.. అదే వైఫ్ చెప్తే అమ్మో టార్చర్ లా అనిపిస్తుంది.. అంటూ ఒకే ఒక్క డైలాగ్ తో తను చెప్పాలనుకుంటున్న పాయింట్ ని అందరికీ అర్ధం అయ్యేలా చివరిలో చెప్పింది.

రాజ్ పెర్ఫార్మెన్స్ , చిత్ర శుక్లా క్యారెక్టర్ , రాజ్ తరుణ్ -సితార సెంటిమెంట్ సీన్స్, రాజ్ తరుణ్ – చిత్ర మధ్య వచ్చే  రొమాంటిక్ లవ్ సీన్స్, ప్రియదర్శి కామెడి, సాంగ్స్, డైలాగ్స్, ప్రీ ఇంటర్వెల్ ఎమోషనల్ సీన్, సెకండ్ హాఫ్ స్క్రీన్ ప్లే , ప్రీ క్లైమాక్స్, క్లైమాక్స్ సినిమాకు హైలైట్ గా నిలిచాయి. కాస్త తమిళ ఫ్లేవర్, స్లో నెరేషన్ మైనస్ పాయింట్స్. ఓవరాల్ గా సెంటిమెంట్,  ఎంటర్ టైన్ మెంట్ తో ‘రంగులరాట్నం’ ఎంటర్టైన్ చేస్తుంది.

 

రేటింగ్ : 3 /5