రాధ మూవీ రివ్యూ...

Friday,May 12,2017 - 04:12 by Z_CLU

నటీనటులు : శ‌ర్వానంద్‌, లావ‌ణ్య త్రిపాఠి

సంగీతం : ర‌థన్‌

సినిమాటోగ్ర‌ఫీ : కార్తీక్ ఘ‌ట్ట‌మ‌నేని

నిర్మాత : భోగ‌వ‌ల్లి బాపినీడు

దర్శ‌క‌త్వం : చంద్ర‌మోహ‌న్‌

రిలీజ్ డేట్ : 12, మే,2017

లేటెస్ట్ గా ‘శతమానంభవతి’ సినిమాతో కెరీర్ లో గ్రాండ్ హిట్ అందుకున్న శర్వానంద్ లేటెస్ట్ మూవీ ‘రాధ’.. యాక్షన్ ఎంటర్టైనర్ గా తెరకెక్కిన ఈ సినిమా ఈరోజే థియేటర్స్ లోకొచ్చింది. శర్వా ఫస్ట్ టైం పోలీస్ క్యారెక్టర్ లో నటించిన ఈ సినిమా ఎలా ఎంటర్టైన్ చేసిందో..చూద్దాం..


కథ :

చిన్నప్పట్నుంచి భగవద్గీతకి బాగా అడిక్ట్ అయిన రాధాకృష్ణ (శర్వానంద్) చిన్నతనంలో కిందపడి ఓ పోలీస్ సహాయం అందుకుంటాడు. ఆ సమయంలో ఆపదలో ఉన్నప్పుడు వచ్చే పోలీస్ కృష్ణుడితో సమానమని నమ్ముతూ అప్పటి నుంచి పోలీస్ అంటే అమితంగా ఇష్టం పెంచుకొని ఎప్పటికైనా పోలీస్ అవ్వాలని డిసైడ్ అవుతాడు. అలా డిసైడ్ అయిన రాధ చివరికి పోలీస్ అయ్యాక కృష్ణుడిలా ఫీలవుతూ సమాజంలో జరిగే అన్యాయాలను తన స్టైల్ లో ఎలా ఎదుర్కొన్నాడనేది సినిమా కథాంశం.

నటీనటుల పనితీరు:

సీరియస్ సినిమాలు చేసి బోర్ కొట్టేసింది. కాస్త సరదాగా ఉండే పాత్రలు చేయాలనుకుంటున్నానంటూ దాదాపు ప్రతి ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చాడు శర్వానంద్. అలా చెప్పినట్టే ఉంది రాధలో శర్వ క్యారెక్టర్. కెరీర్ లో ఫస్ట్ టైం పోలీస్ క్యారెక్టర్ లో నటించిన శర్వ… యాక్షన్ తో పాటు కామెడీ టైమింగ్ లో కూడా అదరగొట్టాడు. లావణ్య త్రిపాఠి గ్లామరస్ పెర్ఫార్మెన్స్ తో ఆకట్టుకుంది. అక్ష క్యారెక్టర్ చిన్నదే అయినా పరవాలేదనిపించుకుంది. విలన్ గా రవికిషన్ మరోసారి మెప్పించాడు. షకలక శంకర్, జయప్రకాశ్ రెడ్డి, సప్తగిరి తమ కామెడీతో ఎంటర్టైన్ చేశారు. ఇక కోటా శ్రీనివాసరావు, తణికెళ్ళ భరణి, అలీ, ఆశిష్ విద్యార్థి, బ్రహ్మాజీ, దువ్వాసి మోహన్, అంబటి శ్రీను, జెమినీ సురేష్, ఫిష్ వెంకట్, ప్రగతి, మహేష్ ఆచంట తదితరులు తమ క్యారెక్టర్స్ కి న్యాయం చేశారు.

టెక్నిషన్స్ పనితీరు :

సినిమాకు రధన్ అందించిన సాంగ్స్ లో 2 పాటలు మాత్రమే ఆకట్టుకున్నాయి. బ్యాగ్రౌండ్ స్కోర్ సినిమాకు ప్లస్ అయింది. కార్తీక్ ఘట్టమనేని సినిమాటోగ్రఫీ బాగుంది. కొన్ని సందర్భాల్లో వచ్చే కామెడీ , ఎమోషనల్ డైలాగ్స్… ముఖ్యంగా పోలీస్ వృత్తి గురించి చెప్పే డైలాగ్ బాగా ఆకట్టుకున్నాయి. ఫస్ట్ హాఫ్ స్క్రీన్ ప్లే బాగుంది. ఎడిటింగ్ పరవాలేదు. ప్రొడక్షన్ వాల్యూస్ బాగున్నాయి.


జీ సినిమాలు సమీక్ష :

వరుస సూపర్ హిట్స్ తో దూసుకుపోతున్న శర్వానంద్ రాధా అనే టైటిల్ తో పోలీస్ క్యారెక్టర్ చేస్తున్నాడనగానే ఈ సినిమా పై పాజిటీవ్ బజ్ మొదలైంది.. పైగా శతమానం భవతి తర్వాత శర్వా నుంచి వస్తున్న సినిమా కావడం, ట్రైలర్ ప్రేక్షకులకు కనెక్ట్ కావడంతో ఈ సినిమాపై అంచనాలు పెరిగాయి.
చిన్నప్పట్నుంచి పోలీస్ మీద గౌరవం పెంచుకొని ఎప్పటికైనా పోలీస్ అయి అందర్నీ కాపాడుకోవాలనే కుర్రాడి కథతో పోలీసులందరికీ ఓ ట్రిబ్యూట్ లా అనిపించే కథ బాగున్నా ఆ కథతో ఫుల్ ఫ్లెడ్జ్ గా ఎంటర్టైన్ చేయడంలో కాస్త తడబడ్డాడు దర్శకుడు చంద్ర మోహన్. ఫస్ట్ హాఫ్ ను కామెడీ సీన్స్ తో ఎంటర్టైనింగ్ గా తెరకెక్కించిన దర్శకుడు సెకండ్ హాఫ్ లో కాస్త కన్ఫ్యూజ్ అయి కథను రొటీన్ ట్రాక్ లో పెట్టేశాడు. ఒక ఉన్నత పదవి కోసం రాజకీయాల్లోకొచ్చి ఆ పదవి కోసం ఆరాటపడుతూ అందరినీ తొక్కుతూ ఎదిగే విలన్, ఆ విలన్ వల్ల జీవితంలో కోలుకోలేని దెబ్బ తిన్న హీరో.. చివరికి అతడిని రాజకీయాలకు ఎలా దూరం చేసి రోడ్డుమీదకు తీసుకొచ్చాడు.. ఎలా రివెంజ్ తీర్చుకున్నాడు అనే రొటీన్ కథ తో సెకండాఫ్ బోర్ కొట్టించాడు రాధ.
ఇక శర్వానంద్ క్యారెక్టర్, ఫస్ట్ హాఫ్ లో వచ్చే కామెడీ, లావణ్య త్రిపాఠి, భగవద్గీత లోని క్యారెక్టర్స్ తో అందరినీ పిలిచే సీన్స్ బ్యాగ్రౌండ్ స్కోర్, డైలాగ్స్ సినిమాకు హైలైట్ గా నిలిచాయి. రొటీన్ స్టోరీ, ఊహించేలా ఉండే ట్విస్టులు, సెకండాఫ్ స్క్రీన్ ప్లే సినిమాకు మైనస్. ఫైనల్ గా రెగ్యులర్ కమర్షియల్ ఎంటర్టైనర్లు ఇష్టపడేవారికి, కాసేపు సరదాగా సినిమా చూసి నవ్వుకోవాలనుకునేవాళ్లకు రాధ సరిగ్గా సరిపోతాడు.

 

రేటింగ్ : 3/5