రాహు మూవీ రివ్యూ

Friday,February 28,2020 - 11:02 by Z_CLU

నటీనటులు: కృతి గార్గ్, అభిరామ్ వర్మ, కాలకేయ ప్రభాకర్, చలాకీ చంటి, గిరిధర్, సత్యం రాజేష్, స్వప్నిక తదితరులు.

రచన, దర్శకత్వం: సుబ్బు వేదుల

నిర్మాతలు: ఏవీఆర్ స్వామీ, శ్రీ శక్తి బాబ్జి, రాజా దేవరకొండ, సుబ్బు వేదుల

సినిమాటోగ్రఫీ: సురేష్ రగుతు, ఈశ్వర్ యల్లు మహాంతి

మ్యూజిక్: ప్రవీణ్ లక్కరాజు

ఎడిటింగ్: అమర్ రెడ్డి

సెన్సార్: A

రన్ టైమ్: 123 నిమిషాలు

రిలీజ్ డేట్: ఫిబ్రవరి 28, 2020

సాంగ్ తో సినిమాపై క్రేజ్ పెరిగింది. ట్రయిలర్ ఆడియన్స్ ఫోకస్ ఇంకాస్త పెరిగింది. అలా చిన్న సినిమాగా వచ్చిన రాహు.. ఈరోజు పెద్ద బజ్ తో థియేటర్లలోకి వచ్చింది. మరి ఈ సినిమా రిజల్ట్ ఏంటి? ‘జీ సినిమాలు‘ ఎక్స్ క్లూజివ్ రివ్యూ.

కథ :

చిన్నతనం నుంచే భాను (కృతి గార్గ్)కు ఓ మానసిక సమస్య ఉంటుంది. రక్తం చూస్తే ఆమె సడెన్ గా బ్లైండ్ అయిపోతుంది. టెన్షన్ తగ్గేవరకు ఆమెకు తిరిగి చూపు రాదు. అలాంటి సమస్యతో ఉన్న భాను, రిలీఫ్ కోసం ఫ్రెండ్స్ తో కలిసి సిక్కిం వెళ్తుంది. అక్కడే శేష్ (అభిరామ్) పరిచయమౌతాడు. మిస్-అండర్ స్టాండింగ్ తో మొదలై, ప్రేమించుకునే వరకు వెళ్తుంది వాళ్ల ప్రయాణం. ఒక దశలో తండ్రికి చెప్పకుండా పెళ్లి కూడా చేసుకుంటారు.
అంతా బాగుందనుకున్న టైమ్ లో భాను కిడ్నాప్ అవుతుంది. ఇంతకీ ఆమెను కిడ్నాప్ చేసింది ఎవరు? భాను తండ్రి పోలీసాఫీసర్ కావడంతో అతడి శత్రులువు ఎవరైనా భానును కిడ్నాప్ చేశారా? హిస్టీరికల్ బ్లయిండ్ నెస్ అనే తన బలహీనతను అధిగమించి, ఆ కిడ్నాప్ నుంచి భాను ఎలా బయటపడిందనేది రాహు స్టోరీ.

 

నటీనటుల పనితీరు :

సినిమా మొత్తాన్ని ఒంటిచేత్తో నడిపించింది హీరోయిన్ కృతిగార్గ్. నిజానికి ఈమెను హీరోయిన్ అనేకంటే, ఈ సినిమాకు ఈమె హీరో అనడం కరెక్ట్. అభిరామ్ కు మంచి క్యారెక్టర్ దొరికింది. ఒకే సినిమాలో రెండు షేడ్స్ చూపించే ఛాన్స్ చాలా తక్కువమంది నటులకు దక్కుతుంది. ఈ విషయంలో అభిరామ్ వర్మ లక్కీ. కీలకమైన పాత్రలో కనిపించిన కాలకేయ ప్రభాకర్.. తన క్యారెక్టర్ కు పూర్తి న్యాయం చేశాడు. రాజారవీంద్ర, చంటి, గిరిధర్, సత్యంరాజేష్ తమ పాత్రలకు న్యాయం చేశారు.

 

టెక్నీషియన్స్ పనితీరు :

ముందుగా దర్శకుడు సుబ్బు గురించే చెప్పుకోవాలి. ఇలాంటి కథను సెలక్ట్ చేసుకోవడం ఓ ఛాలెంజ్ అయితే, దాన్ని ఛాలెంజింగ్ గా తీసుకోవడంతో పాటు, కథకు అద్భుతంగా లాక్స్ వేయడంలో సుబ్బు సూపర్ సక్సెస్ అయ్యాడు. తొలి సినిమాకే కాస్త కాంప్లికేటెట్ స్క్రీన్ ప్లే రాసుకొని ప్రామిసింగ్ డైరక్టర్ అనిపించుకున్నాడు. ఏదో ఒక లవ్ స్టోరీ చేసి డైరక్టర్ గా సేఫ్ గా ల్యాండ్ అయిపోదామనుకునే ఈ రోజుల్లో సుబ్బు వేదుల రిస్క్ చేశాడనే చెప్పాలి. అతడి వర్క్ కచ్చితంగా అందర్నీ ఎట్రాక్ట్ చేస్తుంది.
ఈ సినిమాకు ఇద్దరు సినిమాటోగ్రాఫర్లు పనిచేయడం విశేషం. టాకీ మొత్తం సురేష్ రగుతు హ్యాండిల్ చేశాడు. అతడి కెమెరా పనితనం సినిమా అంతా కనిపిస్తుంది. ఇక సాంగ్స్ కు ఈశ్వర్ ఎల్లుమహంతి వర్క్ చేశాడు. సిక్కింలో తీసిన ఏమో ఏమో సాంగ్ లో ఇతడి టాలెంట్ కనిపిస్తుంది. ఏమో ఏమో పాటతో పాటు బ్యాక్ గ్రౌండ్ స్కోర్ తో ప్రవీణ్ లక్కరాజు ఎట్రాక్ట్ చేస్తే.. క్రిస్ప్ ఎడిటింగ్ తో అమర్ రెడ్డి ఆకట్టుకున్నాడు. నిర్మాతలు స్వామి, బాబ్ది, రాజా కథకు తగ్గట్టు డబ్బులు ఖర్చుచేశారు. ఇలా అందరూ తమ పరిథిలో మంచి అవుట్ పుట్ ఇవ్వడంతో రాహు టెక్నికల్ గా చాలా బెటర్ గా కనిపించింది.

జీ సినిమాలు రివ్యూ :

సరికొత్త కథలకు కేరాఫ్ ఎడ్రస్ గా మారింది టాలీవుడ్. రీసెంట్ టైమ్ లో ఎన్నో ప్రయోగాలు జరుగుతున్నాయి. అలాంటి ఓ వినూత్న ప్రయోగమే రాహు. ఈ సినిమాలో చెప్పుకోదగ్గ స్టార్ కాస్ట్ లేదు. ఫేమస్ డైరక్టర్ తీసిన సినిమా కూడా కాదు. కానీ ‘రాహు’ అందర్నీ ఎట్రాక్ట్ చేసిందంటే కారణం ఈ సినిమా స్టోరీలైన్. వినూత్నమైన కథతో వచ్చిన ఈ సినిమా క్రైమ్ థ్రిల్లర్స్ ను లైక్ చేసేవాళ్లకు విపరీతంగా నచ్చుతుంది.

ట్విస్ట్ లు ఉంటేనే ఇలాంటి సినిమాలు క్లిక్ అవుతాయి. రాహు సినిమాలో అలాంటి ట్విస్టులు మనకు బోలెడన్ని కనిపిస్తాయి. ఇతడే విలన్ అనిపించేలా ప్రేక్షకుల్ని ఆఖరి నిమిషం వరకు తీసుకెళ్లి, అక్కడ ఒక్కసారిగా ట్విస్ట్ రివీల్ చేయడమనే పాత పద్ధతిని మాత్రం దర్శకుడు సుబ్బు ఫాలో అవ్వలేదు. అసలైన ట్విస్ట్ ను కాస్త ముందే రివీల్ చేసి, అక్కడ్నుంచి డ్రామాను ఉత్కంఠగా నడిపించిన తీరు బాగుంది. ఈ విషయంలో సుబ్బు టాలెంట్ కనిపిస్తుంది.

మేకర్స్ చేసిన మరో మంచి పని కీలకమైన హీరోయిన్ క్యారెక్టరైజేషన్ ను ముందే బయట పెట్టడం. చిన్నప్పట్నుంచే హీరోయిన్ కు ఓ డిసార్డర్ ఉంటుంది. రక్తం చూస్తే ఆమె ఒక్కసారిగా తన చూపు కోల్పోతుంది. అదే ఆమె బలహీనత. ఒక దశలో ఆ బలహీనతే ఆమెకు అతిపెద్ద సమస్యగా మారుతుంది. దాన్నుంచి ఆమె ఎలా బయటపడిందనే విషయాన్ని దర్శకుడు చక్కగా వివరించాడు. సినిమా జానర్ ను దృష్టిలో పెట్టుకొని కొన్ని కీలకమైన ఎలిమెంట్స్ ను ఇక్కడ టచ్ చేయడం లేదు.

నటీనటుల విషయానికొస్తే హీరోయిన్ కృతి గార్గ్ ఈ సినిమాకు బ్యాక్ బోన్ గా నిలిచింది. ఆమె పెర్ఫార్మెన్స్ ఈ సినిమాకు హైలెట్.  అభిరామ్ వర్మ మరో సర్ ప్రైజ్. లవర్ బాయ్ నుంచి యాక్షన్ మోడ్ లోకి మారే పాత్రలో అభిరామ్ బాగా చేశాడు. మరీ ముఖ్యంగా ఒకే సినిమాలో సాఫ్ట్ గా, రఫ్ గా కనిపించే అవకాశం అభిరామ్ కు దక్కింది. కీలకపాత్ర పోషించిన కాలకేయ ప్రభాకర్, క్లైమాక్స్ లో వచ్చే సత్యంరాజేష్ కూడా సినిమాలో సర్ ప్రైజ్ చేస్తారు.

కంటెంట్ పరంగా సినిమా ఎంత బాగుందో, టెక్నికల్ గా కూడా ఈ సినిమా అంతే రిచ్ గా ఉంది. ఇలాంటి సినిమాలకు మ్యూజిక్ ఎంత అవసరమో మనకు తెలిసిందే. ఈ విషయంలో ప్రవీణ్ లక్కరాజు సక్సెస్ అయ్యాడు. సినిమాకు అదిరిపోయే బ్యాక్ గ్రౌండ్ స్కోర్ అందించాడు. మరీ ముఖ్యంగా చివరి 30 నిమిషాలు ప్రవీణ్ అందించిన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ టెర్రిఫిక్ గా ఉంది. అంతేకాదు, సిద్ శ్రీరామ్ తో కలిసి ఓ హిట్ సాంగ్ కూడా ఇచ్చాడు. వినడానికి ఈ పాట ఎంత బాగుంటుందో, స్క్రీన్ పై చూడ్డానికి కూడా అంతే బాగుంటుంది. సిక్కిం బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కించిన ఈ పాట సినిమాలో హైలైట్ గా నిలిచింది. ఈ పాటలో సినిమాటోగ్రాఫర్ ఈశ్వర్ ఎల్లుమహంతి వర్క్ కనిపిస్తుంది. సిద్ శ్రీరామ్ వాయిస్, ఈశ్వర్ సినిమాటోగ్రఫీ రెండూ పోటీపడ్డాయి. మరో కెమెరామెన్ సురేష్ రగుతు వర్క్ కూడా బాగుంది.

ఉన్నంతలో ఈ సినిమాకున్న ప్రధానమైన అడ్డంకి ఒకటే. అది కూడా ఈ జానర్ వల్ల వచ్చిన సమస్య. అన్ని వర్గాలకు రీచ్ అయ్యే జానర్ కాదిది. మరీ ముఖ్యంగా ఫ్యామిలీ ఆడియన్స్ ఈ సినిమాకు కనెక్ట్ అవ్వకపోవచ్చు. ఫేస్ వాల్యూ ఉన్న స్టార్ కాస్ట్ లేకపోవడం కూడా మరో ఇబ్బంది. ఇలాంటి చిన్నచిన్న అడ్డంకుల్ని  అధిగమించగలిగితే ‘రాహు’ సినిమా ఈ ఏడాది హిట్ సినిమాల్లో ఒకటిగా నిలవడం గ్యారెంటీ.

రేటింగ్2.75/5