మూవీ రివ్యూ - 'బ్రో'

Friday,July 28,2023 - 01:29 by Z_CLU

నటీ నటులు : పవన్ కళ్యాణ్, సాయి ధరమ్ తేజ్, కేతిక శర్మ, ప్రియ ప్రకాష్ , సముద్ర ఖని, రోహిణి, రాజేశ్వరి నాయర్, రాజా,తనికెళ్ళ భరణి, వెన్నెల కిషోర్, సుబ్బరాజు, పృథ్విరాజ్,  యువలక్ష్మి , దేవిక, అలీ రెజా, సూర్య శ్రీనివాస్ తదితరులు.

డీఓపీ: సుజిత్ వాసుదేవ్

సంగీతం: ఎస్.ఎస్. థమన్

సహ నిర్మాత: వివేక్ కూచిభొట్ల

నిర్మాణం: పీపుల్ మీడియా ఫ్యాక్టరీ, జీ స్టూడియోస్

నిర్మాత: టి.జి. విశ్వప్రసాద్

స్క్రీన్ ప్లే, డైలాగ్స్: త్రివిక్రమ్

రచన, దర్శకత్వం: పి. సముద్రఖని

నిడివి : 134 నిమిషాలు

సెన్సార్ : U

విడుదల తేది : 28 జూలై 2023

మేన మావయ్య -మేనల్లుడు పవన్ కళ్యాణ్ , సాయి తేజ్ కాంబినేషన్ లో ఓ మెగా సినిమా రానుందని తెలిసినప్పటి నుండే ‘బ్రో’ పై మంచి బజ్ క్రియేట్ అయింది. సముద్రఖని దర్శకత్వంలో త్రివిక్రమ్ రైటింగ్ తో తెరకెక్కిన ఈ సినిమా తాజాగా ప్రేక్షకుల ముందుకొచ్చింది. మరి ‘వినోదాయ సీతమ్’ కి రీమేక్ గా కొన్ని మార్పులతో తెరకెక్కిన బ్రో పూర్తిగా మెప్పించిందా ? పవన్ , తేజ్ కలిసి విజయం అందుకున్నారా ? జీ సినిమాలు ఎక్స్ క్లూసివ్ రివ్యూ.

కథ : 

చిన్నతనం నుండి కుటుంబ భాద్యత తీసుకొని ఇంటి పెద్దగా ఉండే మార్కండేయ(సాయి తేజ) ఒక కంపెనీలో వర్క్ చేస్తూ అందులో జనరల్ మేనేజర్ పోస్ట్ కోసం ఎదురుచూస్తుంటారు. జీవితంలో టైమ్ కి చాలా ఇంపార్టెంట్ ఇచ్చే మార్క్ ఊహించని విధంగా కార్ యాక్సిడెంట్ లో మరణిస్తాడు. అలా మరణం పొందిన మార్క్ కి కాలం బ్రో(పవన్ కళ్యాణ్) రూపంలో మళ్ళీ తన తప్పులను ఒప్పులు చేసుకునేందుకు కుటుంబ భాద్యతలు నిర్వర్తించేందుకు ఓ మూడు నెలలు సమయం దొరుకుతుంది.

ఈ మూడు నెలల్లో మార్క్ ఏం చేశాడు ? బ్రో తిరిగిచ్చిన కాలంలో తన కుటుంబాన్ని సెంటిల్ చేయగలిగాడా ? చివరికి మార్క్  బ్రో ద్వారా తెలిసుకున్న జీవిత సత్యం ఏమిటి ?  అనేది మిగతా కథ.

 

 

నటీ నటుల పనితీరు : 

పవన్ కళ్యాణ్ ఎనర్జీను పర్ఫెక్ట్ గా వాడుకున్న కొన్ని ది బెస్ట్ కేరెక్టర్స్ లో ‘బ్రో’ ఒకటి. పవన్ తన ఎనర్జిటిక్ పెర్ఫార్మెన్స్ తో మెస్మరైజ్ చేశాడు. కాలం రూపంలో ‘బ్రో’ పాత్రకు పూర్తి న్యాయం చేశాడు పవన్. తన పాత సాంగ్స్ కి కొత్త ఎనర్జీ డాన్సులతో ఫ్యాన్ మూమెంట్స్ క్రియేట్ చేసి సినిమాకు మెయిన్ హైలైట్ అనిపించుకున్నాడు. సాయి తేజ్ మార్కండేయ పాత్రలో ఒదిగిపోయాడు. తన కుటుంబాన్ని చక్క దిద్దాలనుకునే కుర్రాడిగా ఆకట్టుకున్నాడు. కొన్ని ఎమోషనల్ సీన్స్ లో నటుడిగా మంచి మార్కులు స్కోర్ చేశాడు. కేతిక శర్మకి కథలో స్పేస్ తక్కువ ఉన్నప్పటికీ తన యాక్టింగ్ తో మెప్పించింది. చెల్లెలి పాత్రలో ప్రియ ప్రకాష్ వారియర్ ఆకట్టుకుంది. క్లైమాక్స్ కి ముందు వచ్చే సీన్స్ లో ఆమె నటన బాగుంది. ఎప్పటికే చాలా అమ్మ పాత్రలు చేసిన రోహిణీ ఆ పాత్రకు పూర్తి న్యాయం చేసింది. ఒక ఇంపార్టెంట్ సీన్ లో కనిపించే చిన్న పాత్రలో సముద్రఖని ఆకట్టుకున్నాడు.

రాజేశ్వరి నాయర్, రాజా,తనికెళ్ళ భరణి, వెన్నెల కిషోర్, సుబ్బరాజు, పృథ్విరాజ్,  యువలక్ష్మి , దేవిక, అలీ రెజా, సూర్య శ్రీనివాస్ తదితరులు వారి పాత్రలకు న్యాయం చేశారు.

 

సాంకేతిక వర్గం పనితీరు :

‘బ్రో’ కి సంబంధించి ముందుగా మాట్లాడుకోవాల్సింది తమన్ మ్యూజిక్ గురించే. మై డియర్ మార్కండేయ సాంగ్ సినిమాకు ప్లస్ అయ్యింది. ముఖ్యంగా తమన్ ఇచ్చిన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ సన్నివేశాలకు మరింత బాలాన్నిచ్చాయి. కొన్ని సందర్భాలలో వచ్చే నేపథ్య సంగీతం బాగా ఆకట్టుకుంది. సుజిత్ వాసుదేవ్ కెమెరా వర్క్ బాగుంది. ఆయన కెమెరా విజువల్స్ సినిమాకు మరో ప్లస్ పాయింట్.  ఏ.ఎస్. ప్రకాష్ ఆర్ట్ బాగుంది.  పర్ఫెక్ట్ రన్ టైమ్ తో నవీన్ నూలి ఎడిటింగ్ సినిమాకు ప్లస్ అయ్యింది. సెల్వ కంపోజ్ చేసిన ఫైట్ మాస్ కి నచ్చేలా ఉంది. వీఎఫ్ఎక్స్ వర్క్ పరవాలేదు.

సముద్రఖని కథ, త్రివిక్రమ్ అందించిన కథనం -మాటలు ఆకట్టుకున్నాయి. సముద్రఖని దర్శకత్వం బాగుంది. నటీ నటుల నుండి మంచి అవుట్ పుట్ తీసుకున్నాడు. ముఖ్యంగా పవన్ కేరెక్టర్ డిజైన్ చేసిన తీరు, తన ఎనర్జీ ను వాడుకోవడంలో మంచి మార్కులు అందుకున్నాడు. పీపుల్ మీడియా , జీ స్టూడియోస్ ప్రొడక్షన్ వెల్యూస్ సినిమా క్వాలిటీ ను పెంచాయి.

BroTeaser-news-pawankalyan-saidharamtej-zeecinemalu

జీ సినిమాలు సమీక్ష :

ఒక మనిషి మరణం పొందాక, కాలం అతనికి మళ్ళీ రెండో అవకాశం ఇస్తే ? ఆ వ్యక్తి దాని ద్వారా తెల్సుకున్న జీవితం సత్యం ఏమిటి ? ఒక్క ముక్కలో చెప్పాలంటే బ్రో కథ ఇదే. ఈ కథతో సముద్రఖని తమిళ్ లో తనే లీడ్ క్యారెక్టర్ ప్లే చేసి వినోదాయ సీతమ్ చేశాడు. ఆ కథతో సముద్రఖని చెప్పిన సందేశం , డ్రామా వర్కవుట్ అవ్వడంతో సినిమా ప్రశంసలు అందుకుంది. దర్శకుడిగా సముద్రఖనిను మరో మెట్టు పైకి ఎక్కించింది. ఈ కథను తెలుగు ప్రేక్షకులకు కూడా చెప్పాలని సంకల్పించుకున్న సముద్రఖని త్రివిక్రమ్ రూపంలో ఓ మంచి అవకాశం లభించింది. తను చెప్పాలనుకున్న ఓ సందేశాత్మక కథకు పవన్ లాంటి  స్టార్ దొరకడంతో ఈ చక్కని అవకాశాన్ని సద్వినియోగం చేసుకున్నాడు సముద్రఖని.

ఒరిజినల్ సినిమాతో పోలిస్తే త్రివిక్రమ్ శ్రీనివాస్ బ్రోలో కొన్ని మార్పులు చేశాడు. అక్కడ మిడిల్ ఏజ్డ్ కేరెక్టర్ ను ఇక్కడ తేజ్ లాంటి యంగ్ హీరో కి మార్చడం కొంత ప్లస్ అయ్యింది. దీంతో మేన మావయ్య , అల్లుడు తమ స్క్రీన్ ప్రెజెన్స్ తో , ఆకట్టుకునే సన్నివేశాలతో మెప్పించారు. నిజానికి చెప్పాలనుకున్న ఓ మంచి కథకి పవన్ కళ్యాణ్ స్టార్ దొరకడంతో సముద్రఖని , త్రివిక్రమ్ సహాయంతో కథకి కొన్ని కమర్షియల్ హంగులు అందాల్సి వచ్చింది. ముఖ్యంగా ఫ్యాన్స్ ను మురిపించి, వారిచే విజిల్స్ వేయించేలా డిజైన్ చేసిన పవన్ సాంగ్స్ తో వచ్చే బిట్స్ ఫ్యాన్ మూమెంట్స్ గా వర్కవుట్ అయ్యాయి. ఆ సాంగ్ బిట్స్ కి థియేటర్స్ లో ఫ్యాన్స్ చెలరేగిపోవడం ఖాయం.

దర్శకుడు సముద్రఖని వినోదాయ సీతమ్ కథను తెలుగు ప్రేక్షకులను మెప్పించేలా త్రివిక్రమ్ చేసిన మార్పులు బాగున్నాయి. కొన్ని సందర్భాల్లో త్రివిక్రమ్ రైటింగ్ చాలా ప్లస్ అయ్యింది. కొన్ని సన్నివేశాల్లో త్రివిక్రమ్ మార్క్ డైలాగ్స్ ఆడియన్స్ ను అలరించేలా ఉన్నాయి. సినిమా ప్రారంభమైన పది నిమిషాలకే పవన్ పాత్రను తీసుకొచ్చిన విధానం అక్కడి నుండి ఆ పాత్రతో కథను ముందుకు నడిపించిన తీరు ఆకట్టుకున్నాయి. పవన్ , తేజ్ తో చెప్పే మాటలతో కూడిన సన్నివేశాలు వర్కవుట్ అయ్యాయి. ముఖ్యంగా మావయ్య, మేనల్లుడు కెమిస్ట్రీ స్క్రీన్ మీద అద్బుతంగా వర్కవుట్ అవ్వడంతో వారి మధ్య అన్ని సీన్స్ హైలైట్ గా నిలిచాయి. ఫ్యామిలీ ఎమోషన్స్ తో వచ్చే సీన్స్ , జీవిత తత్వం భోధిస్తూ వచ్చే సాంగ్ సినిమాకు మరింత బలం చేకూర్చాయి.ముఖ్యంగా సెకండాఫ్ లో కథ నడిచే తీరు, ప్రీ క్లైమాక్స్ , క్లైమాక్స్ ఎమోషనల్ బ్యాక్స్ సినిమాకు మరింత అందం తీసుకొచ్చి ప్రేక్షకులు సినిమాకు కనెక్ట్ అయ్యేలా చేశాయి.

పవన్ కళ్యాణ్ ఎనర్జీతో కూడిన నటన, తేజ్ పెర్ఫార్మెన్స్ , ఒకప్పటి పవన్ గుర్తుచేసేలా వచ్చే ఫ్యాన్ మూమెంట్స్ , త్రివిక్రమ్ రైటింగ్ , సముద్రఖని స్టోరీ – డైరెక్షన్ , ఎమోషనల్ సీన్స్ , కెమెరా వర్క్ , నేపథ్య సంగీతం, ప్రీ క్లైమాక్స్ , క్లైమాక్స్ సినిమాకు మేజర్ ప్లస్ పాయింట్స్. ఫైనల్ గా “పుట్టడం మెరుపు , చావడం గెలుపు” అంటూ జీవిత సత్యం తెలిపే ఎమోషనల్ కథతో  ‘బ్రో’ ఎంటర్టైన్ చేస్తుంది.

 

రేటింగ్ : 3 /5