'పటేల్ SIR' రివ్యూ

Friday,July 14,2017 - 06:05 by Z_CLU

నటీనటులు : జగపతిబాబు, పద్మప్రియ, తన్యా హాప్, సుబ్బరాజు, పోసాని, రఘుబాబు, శుభలేఖ సుధాకర్, కబీర్ సింగ్, పృథ్వి, బేబీ డాలీ

డైలాగ్స్ : ప్రకాష్

సంగీతం : వసంత్

బ్యానర్ : వారాహి చలనచిత్రం

సమర్పణ : సాయి శివాని

నిర్మాణం : సాయి కొర్రపాటి

నిర్మాత : రజిని కొర్రపాటి

కథ :  సునీల్ సుధాకర్

స్క్రీన్ ప్లే-దర్శకత్వం: వాసు పరిమి

విలన్ గా, క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా సూపర్ ఫామ్ లో ఉన్న జగపతిబాబు మళ్లీ హీరోగా నటించిన సినిమా ‘పటేల్ SIR’. ఇప్పటికే ఫస్ట్ లుక్ పోస్టర్, ట్రైలర్ తో అందరినీ ఎట్రాక్ట్ చేసిన పటేల్ సర్.. ఎలా ఎంటర్ టైన్ చేసాడో చూద్దాం.


కథ :

అక్రమ దారిలో టాప్ బిజినెస్ మాన్ గా ఎదిగి పాలిటిక్స్ లో ఎంట్రీ ఇవ్వాలనుకునే డి.ఆర్(కబీర్) ను అతని గ్యాంగ్ ను తన కుటుంబాన్ని బలి తీసుకున్న కారణంతో ఒక్కొక్కరినీ టార్గెట్ చేస్తూ చంపుతుంటాడు రిటైర్డ్ ఆర్మీ మేజర్ సుభాష్ పటేల్(జగపతి బాబు). అయితే అంధురాలిగా మారిన పాపతో కలిసి ఓ ఇంట్లో ఉంటూ తన పగను తీర్చుకుంటూ ఆ పాపకి కళ్ళు తీసుకురాలని ప్రయత్నిస్తుంటాడు పటేల్. అయితే ఇంతకీ పటేల్ ఎవరు.. తనతో పాటు ఉండే పాప పటేల్ కి ఏమౌతుంది.. అసలు పటేల్ కుటుంబాన్ని డి.ఆర్ ఎందుకు చంపాడు.. చివరికి డి.ఆర్ పై పటేల్ ఎలా రివెంజ్ తీర్చుకుని హతమార్చాడు.. అనేది సినిమా స్టోరీ.

నటీనటుల పనితీరు :

పటేల్ SIR గా స్టైలిష్ మేకోవర్ తో అందరినీ ఎట్రాక్ట్ చేసిన జగపతి బాబు తనదైన నటనతో ఎంటర్టైన్ చేసి సినిమాకు వన్ మేన్ షో గా నిలిచాడు. కొన్ని ఎమోషనల్ సీన్స్ లో నటుడిగా బాగా ఆకట్టుకున్నాడు. యామిని అనే పాప పాత్రలో తన నటనతో ఆకట్టుకుంది బేబీ డాలీ. తాన్యా హాప్ తన గ్లామర్ తో ఎట్రాక్ట్ చేసి సినిమాకు ప్లస్ అయింది. పౌడర్ పాండుగా పోసాని ఓ మోస్తరుగా ఎంటర్టైన్ చేశాడు. ఇక ఆమని, శుభలేఖ సుధాకర్, పద్మ ప్రియ, సుబ్బరాజు, కబీర్, పృథ్వి , ప్రభాకర్, రఘు బాబు, గిరి తదితరులు తమ క్యారెక్టర్స్ కి న్యాయం చేశారు.

టెక్నీషియన్స్ పనితీరు :

సినిమాకు తగిన మ్యూజిక్ అందించి మ్యూజిక్ డైరెక్టర్ గా పరవాలేదని పించుకున్నాడు డీజే వసంత్. ముఖ్యంగా ‘అవ్వా బుచ్చి’ సాంగ్ సాహిత్యం పరంగానూ ఆకట్టుకొని సినిమాకు హైలైట్ గా నిలిచింది. సినిమాటోగ్రఫీ బాగుంది. ఎడిటింగ్ పరవాలేదు. డైలాగ్స్ – స్క్రీన్ ప్లే మైనస్. వారాహి చలన చిత్ర ప్రొడక్షన్ వాల్యూస్ బాగున్నాయి.


జీ సినిమాలు సమీక్ష :

ప్రెజెంట్ ఫాదర్ గా,స్టైలిష్ విలన్ గా ఎంటర్టైన్ చేస్తున్న జగపతి బాబు పటేల్ SIR అనే టైటిల్ తో స్టైలిష్ మేకోవర్ తో మళ్ళీ హీరోగా వస్తున్నాడనగానే ఈ సినిమా పై అంచనాలు నెలకొన్నాయి. ఇక ఈ సినిమా ఎవరూ ఎక్స్ పెక్ట్ చేయని అన్-ఎక్స్ పెక్టెడ్ ఎలిమెంట్స్ తో ఎంటర్టైన్ చేస్తుందంటూ ఇప్పటికే పోస్టర్స్ పై ప్రింట్ వేసి మరీ యూనిట్ చెప్పడంతో ఈ సినిమా జగపతి బాబు కి హీరోగా మరో హిట్ అందిస్తుందని అనుకున్నారంతా. అంచనాలకు తగ్గట్టే పటేల్ SIR గా స్టైలిష్ లుక్ తో అదరగొట్టిన జగపతి బాబు తన పర్ఫార్మెన్స్ తో సినిమాను ముందుకు నడిపించి వన్ మాన్ షో గా నిలిచాడు.
అయితే రొటీన్ రివేంజ్ డ్రామాతో సినిమా తీసిన దర్శకుడు వాసు తన స్క్రీన్ ప్లే తో పూర్తి స్థాయిలో మేజిక్ చేయలేకపోయాడు. దర్శకుడిగా ఫస్ట్ హాఫ్ లో రివేంజ్ సీన్స్ తో బోర్ కొట్టించిన వాసు సెకండ్ హాఫ్ లో ఎమోషన్ తో పరవాలేదనిపించుకున్నాడు.
జగపతి బాబు క్యారెక్టర్, సెకండ్ హాఫ్ లో వచ్చే ఎమోషనల్ సీన్స్,’అవ్వా బుచ్చి’ సాంగ్, ప్రీ క్లైమాక్స్ ట్విస్ట్, క్లైమాక్స్ సినిమాకు హైలైట్ గా నిలవగా… రివేంజ్ సీన్స్ పెద్దగా ఆకట్టుకోకపోవడం, రొటీన్ స్టోరీ, స్క్రీన్ ప్లే సినిమాకు మైనస్ అని చెప్పొచ్చు.
ఓవరాల్ గా జగ్గూ భాయ్ మేకోవర్ కోసం, కొంత ఎమోషనల్ కనెక్ట్ కోసం పటేల్ సర్ ను చూడొచ్చు.

రేటింగ్ : 2.5/5