'పద్మావత్' మూవీ రివ్యూ

Thursday,January 25,2018 - 09:02 by Z_CLU

నటీనటులు : దీపిక పదుకొనే, షాహిద్ కపూర్, రణ్వీర్ సింగ్

మ్యూజిక్ : సంజయ్ లీలా భన్సాలి

బ్యాక్ గ్రౌండ్ స్కోర్ : సంచిత్ బల్హర

సినిమాటోగ్రఫీ : సందీప్ చటర్జీ

నిర్మాణం : భన్సాలి ప్రొడక్షన్స్, Viacom 18 మోషన్ పిక్చర్స్

నిర్మాతలు : సంజయ్ లీల భన్సాలి, సుధాన్షు, అజిత్

రచన : సంజయ్ లీల భన్సాలి, ప్రకాష్ కపాడియ

స్క్రీన్ ప్లే – దర్శకత్వం : సంజయ్ లీల భన్సాలి

రిలీజ్ డేట్ : 25 జనవరి 2018

 

కొన్ని నెలలుగా ఎన్నో అవాంతరాలను ఎదుర్కొంటూ  వాయిదా పడుతూ వస్తున్న దీపిక పదుకొనే నటించిన ‘పద్మావత్’ ఎట్టకేలకి ఈరోజు ప్రపంచవ్యాప్తంగా విడుదలైంది. సంజయ్ లీల భన్సాలి దర్శకత్వంలో హిస్టారికల్ డ్రామాగా తెరకెక్కిన ఈ సినిమా అంత వివాదాస్పదమవ్వడానికి కారణమేంటి.. సినిమాలో నిజంగా వివాదాస్పద అంశాలున్నాయా.. ఇంతకీ పద్మావత్ ఎలా ఉంది..జీ సినిమాలు ఎక్స్ క్లూజివ్ రివ్యూ

కథ :

ఢిల్లీ సింహాస‌నంపై క‌న్నేసిన అప్ఘ‌నిస్థాన్ రాజు జలాలుద్ధీన్ ఖిల్జీ త‌న సైన్యంతో ఢిల్లీని ఆక్ర‌మించుకుంటాడు. జ‌లాలుద్ధీన్ కుమార్తె మాలికా ఎ జ‌న‌త్ (అదితిరావ్ హైద‌రీ)ని ప్రేమించి పెళ్లి చేసుకున్న అల్లావుద్ధీన్ ఖిల్జీ కొంత‌కాలం త‌ర్వాత జ‌లాలుద్ధీన్‌ను చంపి సింహాస‌నాన్ని ఆక్ర‌మిస్తాడు. కామాంధుడైన అల్లావుద్ధీన్‌ను ఎవ‌రూ ఎదిరించ‌లేరు. చాలా మంది హిందూ రాజులు అత‌నికి సామంతులుగా మారుతారు. అదే స‌మ‌యంలో సింహళంకు ముత్యాల కోసం వెళ్ళిన రావల్ రతన్ సింగ్ (షాహిద్ కపూర్‌), సింహ‌ళ యువ‌రాణి ప‌ద్మావ‌తి (దీపికా ప‌దుకొనే)ని పెళ్లి చేసుకుని త‌న రాజ్యానికి తీసుకుని వ‌స్తాడు. మేవాడ్ రాజ గురువు రాఘ‌వ చింత‌నుడు చేసిన ఓ అప‌రాధం వ‌ల్ల ర‌త‌న్ సింగ్ అత‌న్ని దేశ బ‌హిష్క‌ర‌ణ చేస్తాడు. కోపంతో కక్ష కట్టి ఢిల్లీ సుల్తాన్ అల్లాఉద్దీన్ ఖిల్జి(ర‌ణ్ వీర్ సింగ్) వద్ద చేరి అతడి దృష్టిని చిత్తోడ్ రాజ్యం వైపుకి మ‌ళ్లిస్తాడు. యుద్ధానికి వ‌చ్చి సంధిక‌ని న‌మ్మించి ర‌త‌న్ సింగ్ ను ఢిల్లీకి తీసుకెళ్లి బంధిస్తాడు అల్లా ఉద్దీన్ ఖిల్జీ. ఆ త‌ర్వాత ప‌ద్మావ‌తి ఏం చేసింది.. ఖిల్జీ నుంచి త‌న రాజ్యాన్ని.. మానాన్ని ఎలా కాపాడుకుంది అనేది మిగిలిన క‌థ‌.

నటీనటుల పనితీరు:

పద్మావతి అనే పాత్రలో దీపిక ఒదిగిపోయి నటించింది. కొన్ని సన్నివేశాల్లో పద్మావతి అంటే ఇలాగే ఉంటుందేమో అనేట్టుగా మైమరపించింది దీపిక. ముఖ్యంగా కొన్ని ఎమోషనల్ సీన్స్ లో తన నటనతో మెస్మరైజ్ చేసింది. అల్లావుద్ధీన్ ఖిల్జీ పాత్రలో రణ్వీర్ సింగ్ బెస్ట్ అనిపించుకున్నాడు. కొన్ని సందర్భాలలో ఈ పాత్ర రన్వీర్ కోసమే పుట్టిందేమో అనిపించేలా నటించి సినిమాకు మెయిన్ హైలైట్ గా నిలిచాడు. షాహిద్ కపూర్ తన క్యారెక్టర్ తో పర్ఫెక్ట్ అనిపించుకున్నాడు. అదితి రావు హైదరి తన అందం, నటనతో ఆకట్టుకొని సినిమాకు ప్లస్ అయింది. ఇక జిమ్ సార్బ్, రాజా మురద్, అనుప్రియ గోయింక తదితరులు తమ నటనతో ఆకట్టుకున్నారు.

 

టెక్నిషియన్స్ పని తీరు :

సినిమాకు సంజయ్ లీలా బన్సాలి అందించిన మ్యూజిక్ ఒకెత్తయితే సంచిత్ బల్హర అందించిన నేపధ్య సంగీతం మరో ఎత్తు. కొన్ని సన్నివేశాలకు అదిరిపోయే బాగ్రౌండ్ స్కోర్ అందించి సినిమాకు హైలెట్ గా నిలిచాడు సంచిత్. సందీప్ చటర్జీ సినిమాటోగ్రఫీ సినిమాకు బిగ్గెస్ట్ ఎసెట్. ప్రతీ ఫ్రేమ్ అందంగా, ఓ పెయిటింగ్ లా గ్రాండియర్ గా ఉంది. ఆర్ట్ వర్క్ చాలా బాగుంది. సినిమా కోసం వేసిన ప్రత్యేకమైన సెట్స్ అందరినీ ఆకట్టుకునేలా ఉన్నాయి. విజువల్ ఎఫెక్ట్స్ రియలిస్టిక్ గా ఉన్నాయి. ఎడిటింగ్ బాగుంది. కాని మొదటి భాగంలో ఇంకాస్త ట్రిమ్ చేసి ఉంటే బాగుంటుందనిపించింది. సౌండ్ డిజైనింగ్ అదిరింది. కొన్ని సందర్భాల్లో వచ్చే మాటలు అలరించాయి. సంజయ్ లీల భన్సాలి మేకింగ్ స్టైల్, షాట్ డివిజన్, స్క్రీన్ ప్లే తో అద్భుతంగా ఉన్నాయి. భవిష్యత్ లో పద్మావత్ మేకింగ్, షాట్ డివిజన్ ఓ గైడ్ లా పనిచేస్తుంది. ప్రొడక్షన్ వాల్యూస్ రిచ్ గా ఉన్నాయి.

జీ సినిమాలు సమీక్ష :

చరిత్రలో నిలిచిపోయిన గొప్ప వ్యక్తి జీవిత కథతో ఓ సినిమా వస్తుందంటే ఆ సినిమా పై అందరి ఫోకస్ ఉంటుందన్న సంగతి తెలిసిందే. అయితే ‘పద్మావత్’ సినిమాపై ఆసక్తితో పాటు వివాదాలు కూడా భారీ ఎత్తున చెలరేగాయి. దర్శకుడు సంజయ్ లీల భన్సాలి చరిత్రను వక్రీకరిస్తూ ఈ సినిమాను తెరకెక్కించాడని రాజపుత్రులు ఎన్నో నెలలుగా తమ నిరసనలు వ్యక్తపరుస్తూ సినిమాను నిషేధించాలని డిమాండ్  చేయడంతో దేశవ్యాప్తంగా పద్మావత్ హాట్ టాపిక్ గా మారింది.

ఇక సినిమా విషయానికొస్తే గత సినిమాలతో అలరించి దర్శకుడిగా గుర్తింపు అందుకున్న సంజయ్ లీల భన్సాలి మరోసారి తన మేకింగ్ స్టైల్, డైరెక్షన్ తో మేజిక్ చేశాడు. చరిత్రలో నిలిచిపోయిన క్యారెక్టర్స్ కి పర్ఫెక్ట్ అనిపించే నటీ నటులను సెలెక్ట్ చేసుకొని అక్కడే తొలి విజయం అందుకున్నాడు సంజయ్. మొదటి భాగం కాస్త స్లో అనిపిస్తూ బోర్ కొట్టించినప్పటికీ సెకండ్ హాఫ్ లో తన స్క్రీన్ ప్లే తో రోమాలు నిక్కబొడుచుకునే క్లైమాక్స్ తో అదుర్స్ అనిపించాడు. గతంలో ‘బాజీరావు మస్తాని’ వంటి గ్రాండియర్ సినిమా చేసిన అనుభవంతో మరోసారి అలాంటి భారీ సినిమాను ప్రేక్షకులకు అందించి సక్సెస్ అయ్యాడు. ముఖ్యంగా చరిత్రను ఎక్కడా వక్రీకరించకుండా చాలా బ్యాలెన్స్ గా సినిమాను రూపొందించి దర్శకుడిగా శెభాష్ అనిపించుకున్నాడు. ప‌ద్మావ‌తి, ఖిల్జీ మ‌ధ్య సీన్స్ ను చాలా జాగ్ర‌త్త‌గా హ్యాండిల్ చేసాడు ద‌ర్శ‌కుడు. నిజానికి 700 ఏళ్ల క్రితం జరిగిన కథను తెలుసుకొని రీసెర్చ్ చేసి ఎంతో అందంగా చూపించిన బన్సాలీని ఈ సందర్భంగా అభినందించాల్సిందే.

దీపిక, రన్వీర్ సింగ్ పెర్ఫార్మెన్స్, షాహిద్ కపూర్ క్యారెక్టర్, సినిమాటోగ్రఫీ, సాంగ్స్, బ్యాక్ గ్రౌండ్ స్కోర్, ఎమోషనల్ సీన్స్, ర‌త‌న్ సింగ్ ను విడిపించే క్ర‌మంలో ప‌ద్మావ‌తి తెలివితేట‌లు ప్రదర్శించే సీన్స్, ఇంటర్వెల్ ట్విస్ట్, ఆ త‌ర్వాత ఖిల్జీ దండ‌యాత్ర స‌మ‌యంలో త‌మ‌ను తాము అర్పించుకునే స‌న్నివేశాలు రోమాలు నిక్క‌బొడుచుకునేలా ఉండే క్లైమాక్స్ సినిమాకు హైలైట్స్ గా నిలవగా, ఫస్ట్ హాఫ్ లో స్లో అనిపించే స్క్రీన్ ప్లే, ప్రేక్షకుడు సీట్లో కూర్చొని సంబరపడే సీన్స్, యాక్షన్ ఎపిసోడ్స్ పెద్దగా లేకపోవడం సినిమాకు మైనస్.

ఓవరాల్ గా హిస్టారికల్ కాన్సెప్ట్ తో వచ్చిన ఓ అద్భుత దృశ్యకావ్యంగా ‘పద్మావత్’ అందరినీ మెప్పిస్తుంది.

రేటింగ్ : 3.25 /5