పడి పడి లేచె మనసు మూవీ రివ్యూ

Friday,December 21,2018 - 02:12 by Z_CLU

నటీనటులు: శర్వానంద్, సాయిపల్లవి, మురళీశర్మ, ప్రియారామన్, వెన్నెల కిషోర్, కళ్యాణి నటరాజన్ తదితరులు

సంగీతం : విశాల్ చంద్రశేఖర్

ఛాయాగ్రహణం : జయకృష్ణ గుమ్మడి

నిర్మాణం : శ్రీలక్ష్మీ వెంకటేశ్వరా సినిమాస్

నిర్మాతలు : సుధాకర్ చెరుకూరి-ప్రసాద్ చుక్కపల్లి,

కథ -స్క్రీన్ ప్లే -దర్శకత్వం : హను రాఘవపూడి

విడుదల తేది : 21 డిసెంబర్ 2018

లవ్ స్టోరీస్ కి పర్ఫెక్ట్ సీజన్ ఇది.. సరైన లవ్ స్టోరీతో వస్తే హిట్ కొట్టడం కన్ఫర్మ్. సో అందుకే ఈ సీజన్ సెలెక్ట్ చేసుకొని ‘పడి పడి లేచె మనసు’ తో థియేటర్స్ లోకి ఎంట్రీ ఇచ్చారు  శర్వానంద్ – సాయి పల్లవి. మంచి కాంబినేషన్, క్యాచీ టైటిల్, బ్యూటిఫుల్ సాంగ్స్ ‘పడి పడి లేచె మనసు’ను వింటర్ సీజన్ లో స్పెషల్ మూవీ గా మార్చాయి. మరి ఈ సినిమా ఏ రేంజ్ లో ఇంపాక్ట్ క్రియేట్ చేసింది…శర్వా-సాయి పల్లవి లవ్ స్టోరీతో  మేజిక్ చేయగలిగారా… జీ సినిమాలు ఎక్స్ క్లూజీవ్ రివ్యూ.

కథ :

కలకత్తాలో ఉండే సూర్య(శర్వానంద్) తొలి చూపులోనే మెడికల్ స్టూడెంట్ అయిన వైశాలి( సాయి పల్లవి)ను చూసి ప్రేమలో పడతారు. వైశాలి కూడా సూర్యని ఇష్టపడుతుంది. ఎంతో ప్రేమతో పెళ్లి చేసుకున్న తన తల్లితండ్రులు విడిపోవడంతో పెళ్లి వద్దనుకుంటాడు సూర్య.. పెళ్ళంటే ఇష్టంలేని సూర్య మెంటాలిటీని అర్థం చేసుకోలేని వైశాలి దగ్గరయిన కొన్ని రోజులకే బ్రేకప్ చెప్పేస్తుంది. తమ ప్రేమ పదిలంగా ఉందనిపిస్తే విడిపోయిన నేపాల్ లో మళ్ళీ కలుద్దామని సూర్యతో చెప్పి యూరప్ వెళ్ళిపోతుంది వైశాలి . అలా విడిపోయిన వీరిద్దరూ మళ్ళీ ఎలా కలిసారు… వీళ్ళు కలిసే సమయానికి నేపాల్ లో ఓ భూకంపం వస్తుంది.. ఆ తర్వతా వీరిద్దరి ప్రేమకథ ఎలా సాగింది… సూర్య , వైశాలి చివరికి ఎలా ఒకటయ్యారు..అనేది మిగతా కథ.

నటీనటుల పనితీరు :

శర్వానంద్ ఎప్పటిలాగే మెచ్యూర్డ్ పెర్ఫార్మెన్స్ తో సినిమాకు హైలైట్ గా నిలిచాడు. చాలా సన్నివేశాల్లో బెస్ట్ అనిపించుకున్నాడు. సాయి పల్లవి మరోసారి మేజిక్ చేసింది. స్క్రీన్ మీద తన క్యూట్ పెర్ఫార్మెన్స్ తో యూత్ ని ఎట్రాక్ట్ చేసింది. ముఖ్యంగా రొమాంటిక్ సన్నివేశాల్లో బాగా నటించింది. మురళి శర్మ ఎప్పటిలాగే ఓ రొటీన్ తండ్రి క్యారెక్టర్ లో కనిపించాడు. కాస్త వేరియేషణ్ ఇవ్వాలని ట్రై చేసిన గతంలో చేసిన క్యారెక్టర్స్ గుర్తొచ్చాయి. సునీల్ ,వెన్నెల కిషోర్ , సత్యం రాజేష్ కామెడీ పండలేదు. ప్రియదర్శి డైలాగ్ కామెడితో కొన్ని సందర్భాల్లో ఎంటర్టైన్ చేసాడు. సంపత్ రాజ్, కళ్యాణి నటరాజన్ మిగతా కాస్టింగ్ అందరూ పరవాలేదనిపించుకున్నారు.

సాంకేతిక వర్గం పనితీరు :

సినిమాకు బెస్ట్ మ్యూజిక్ అందించాడు విశాల్ చంద్ర శేఖర్.. ఇప్పటికే రిలీజ్ అయిన సాంగ్స్ విజువల్ గా కూడా ఆకట్టుకున్నాయి. ముఖ్యంగా ‘పడి పడి లేచె మనసు’ టైటిల్ సాంగ్ సినిమాకు మెయిన్ హైలైట్ గా నిలిచింది. సాంగ్ పిక్చరైజేషన్ తో పాటు కోరియోగ్రఫీ కూడా బాగుంది. ‘ఏమై పోయావే’ ,’కల్లోలం’ పాటలు కూడా విజువల్ గా ఆకట్టుకున్నాయి. జయకృష్ణ సినిమాటోగ్రఫీ బాగుంది. కొన్ని సన్నివేశాల్లో, పాటల చిత్రీకరణలో అతని ప్రతిభ కనిపించింది. ఆర్ట్ వర్క్ బాగుంది. ముఖ్యంగా నేపాల్ భూకంపాన్ని క్రియేట్ చేసిన వర్క్ కి మెచ్చుకోవాలి. కొన్ని సందర్భాల్లో వచ్చే ఎమోషనల్ డైలాగ్స్ బాగున్నాయి. రైటర్ గా పరవాలేదనిపించుకున్న హను రాఘవపూడి డైరెక్టర్ గా బెస్ట్ అనిపించుకోలేకపోయాడు. ప్రొడక్షన్ వాల్యూస్ బాగున్నాయి.


జీ సినిమాలు సమీక్ష :

కొన్ని సినిమాల మీద ప్రేక్షకులు అంచనాలు పెట్టుకొని థియేటర్స్ కొస్తారు. అయితే ఆడియన్స్ తమ సినిమాకు ఎందుకు వచ్చారు.. వాళ్ళు మన సినిమా నుండి ఏం కోరుకుంటున్నారు అనే పల్స్ పట్టుకుంటే వాళ్ళని సాటిస్ఫై చేయడం ఏ డైరెక్టర్ కైనా ఈజీ.. అయితే ఈసారి హను ఆడియన్స్ పల్స్ పట్టుకొని కొంత వరకూ ఎంటర్టైన్ చేయగలిగాడు కానీ చాలా చోట్ల మిస్ ఫైర్ అయ్యాడు. తను చెప్పాలనుకున్న ప్రేమకథను తడబడుతూ తెరకెక్కించి పూర్తిగా ఎంటర్టైన్ చేయలేకపోయాడు. నిజానికి హను రాసుకున్న కథకి బెస్ట్ ఇచ్చే హీరో హీరోయిన్ దొరికినప్పటికీ కథే తేడా కొట్టింది. చాలా వరకూ శర్వా- సాయి పల్లవి జోడీ మేజిక్ చేసింది.

ఫస్ట్ హాఫ్ లో శర్వానంద్ -సాయి పల్లవి మధ్య వచ్చే లవ్ సీన్స్ తో సినిమాను స్లోగా నడిపించిన హను సెకండ్ హాఫ్ లో మరీ బోర్ కొట్టించాడు. కథలో కామెడీ చేర్చి విసిగించాడు. ముఖ్యంగా సెకండ్ హాఫ్ నుండి క్లైమాక్స్ వరకూ ఓ డిసార్డర్ అంటూ కన్ఫ్యూస్ క్రియేట్ చేసి కథని రోటిన్ ఫార్మేట్ లోకి తీసుకెళ్ళాడు. కొన్ని సందర్భాల్లో రైటింగ్ తో, తన మార్క్ సీన్స్ తో మెస్మరైజ్ చేసిన హను కొన్ని సీన్స్ తో మరీ బోర్ కొట్టించాడు. ఇంటర్వెల్ నుండి సినిమా గ్రాఫ్ పడిపోయింది. పడిన గ్రాఫ్ మళ్ళీ ఎప్పుడు లేగుస్తుందా అనే సందర్భం ప్రేక్షకులకు ఎదురవుతుంది. ముఖ్యంగా లివింగ్ రిలేషన్ షిప్ గురించి వచ్చే ఇంటర్వెల్ సీన్ కూడా ఆడియన్స్ కి పెద్దగా కనెక్ట్ అవ్వలేదు.

సెకండ్ హాఫ్ లో వచ్చే సునీల్ కామెడీ కథకి అడ్డుతగిలి ప్రేక్షకుడిని బాగా ఇబ్బంది పెట్టింది. కామెడీ గురించి పాకులాడకుండా కథ మీద దృష్టి పెట్టి మంచి సీన్స్ రాసుకుంటే బాగుండేది. సమస్యంతా సెకండ్ హాఫ్ తోనే… సునీల్, వెన్నెల కిషోర్ లను కావాలని పెట్టి ఏదో నవ్వించాలని ట్రై చేసినా వర్కౌట్ అవ్వలేదు. సర్ ప్రైజింగ్ క్యారెక్టర్ తో ఎంట్రీ ఇస్తాడనుకున్న సునీల్ రొటీన్ క్యారెక్టర్ తోనే ఎంట్రీ ఇచ్చి నవ్వించాలని ట్రై చేశాడు.

హను రాఘవపూడి తీసిన ‘అందాల రాక్షసి’, ‘కృష్ణగాడి వీర ప్రేమ గాథ’ లవ్ స్టోరీస్ ఆడియన్స్ ని బాగానే ఎంటర్టైన్ చేసాయి. అందాల రాక్షసి కమర్షియల్ గా ఆడకపోయినా చాలా మందికి అది ఫేవరేట్ సినిమా. తనకి పట్టున్న జోనర్ కావడంతో ఈ సారి కూడా అదే మేజిక్ క్రియేట్ చేసి ఎంటర్టైన్ చేస్తాడనుకున్న ఆడియన్స్ ను కాస్త డిసపాయింట్ చేసాడు హను. శర్వానంద్ – సాయి పల్లవి పెర్ఫార్మెన్స్ , మ్యూజిక్ , సినిమాటోగ్రఫీ , లోకేషన్స్ , కొన్ని రొమాంటిక్ సీన్స్ సినిమాకు హైలైట్ కాగా స్లో నెరేషన్, కామెడీ , సెకండ్ హాఫ్, కథని సాగదీయడం మైనస్. రొమాంటిక్ లవ్ స్టోరీస్ ని ఇష్టపడే వారు ఓ సారి ట్రై చేయొచ్చు.

రేటింగ్ : 2 . 75/ 5